BigTV English

Koratala Shiva: కృష్ణమ్మ కోసం వచ్చినా.. ఆచార్యను వదలరేమో కొరటాల.. ?

Koratala Shiva: కృష్ణమ్మ కోసం వచ్చినా.. ఆచార్యను వదలరేమో కొరటాల.. ?

Koratala Shiva: సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ కు కత్తిమీద సాము లాంటింది. హిట్ అయితే క్రెడిట్ మొత్తాన్ని హీరోకు ఇచ్చేస్తారు. పొరపాటున ప్లాప్ అయ్యిందా.. ? డైరెక్టర్ దే తప్పు అనేసి ట్రోల్స్ చేయడం మొదలుపెడతారు. చివరకు హీరో కూడా డైరెక్టర్ దే తప్పు అని నిర్మొహమాటంగా చెప్పుకొచ్చేస్తున్నారు. ఎంతోమంది హీరోలు ఇలానే చేశారు. ఇక ఒక్క సినిమా వలన స్టార్ డైరెక్టర్స్ ఎన్నో విమర్శలను అందుకోవాల్సి వస్తుంది. అలా కెరీర్ మొదటి నుంచి హిట్స్ అందుకున్న డైరెక్టర్.. ఒక సినిమా ప్లాప్ కారణంగా దారుణమైన ట్రోల్స్ కు గురయ్యాడు. అతడే కొరటాల శివ.


మిర్చి లాంటి సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన కొరటాల.. ప్రభాస్ ను అతని కెరీర్ లోనే మోస్ట్ స్టైలిష్ లుక్ లో చూపించి అభిమానుల చేత దండాలు పెట్టించుకున్నాడు. ఇక ఆ తరువాత జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, భరత్ అనే నేను లాంటి సినిమాలు తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ గా.. పరాజయమే ఎరుగని దర్శకుడుగా మారాడు. ఆ సమయంలోనే కొరటాల.. చిరంజీవితో ఆచార్య ప్రకటించాడు. మెగాస్టార్ తో కొరటాల కాంబో అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇక అందులో రామ్ చరణ్ కూడా ఉండడంతో అభో థియేటర్లలో బ్లాస్ట్ లే అనుకున్నారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఆచార్య భారీ పరాజయాన్ని అందుకుంది. కథ లేదు ఏం లేదు పాదఘట్టం తప్ప అనే విమర్శలు వచ్చాయి. చరణ్ ను అనవసరం గా ఇరికించారని, చేయరు ఫేస్ గ్రాఫిక్స్ బాలేదని.. ఇలా ఒకటని చెప్పలేనంతగా కొరటాల పరువు మొత్తం బజారుకీడ్చారు. కొన్ని సందర్భాల్లో చిరు సైతం కొరటాలదే తప్పు అన్నట్లు మాట్లాడడం మరింత ఆజ్యం పోసింది.

ఇక ఈ ఆచార్య ఎఫెక్ట్ నుంచి కోలుకోవడానికి కొరటాల కు బాగానే టైమ్ పట్టింది. ఆ తరువాత ఎన్టీఆర్ తో దేవరను మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ మీద ఉంది. ఇక అప్పుడు మీడియా ముందుకు వచ్చిన కొరటాల మళ్లీ ఇన్నేళ్లకు మరోసారి కృష్ణమ్మ కోసం మీడియా ముందుకు వస్తున్నాడు. సత్యదేవ్ హీరోగా నటించిన కృష్ణమ్మ సినిమాను కొరటాల సమర్పిస్తున్నాడు. ఈ సినిమా మే 3 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మీడియా గురించి తెల్సిందే. కొరటాల ఎప్పుడు కనిపిస్తాడా.. ? ఆచార్య గురించి అడుగుదామా..? అని ఎదురుచూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ లో కొరటాల దొరికినట్లే. మరి కొరటాల ఆచార్య గురించి మాట్లాడతాడా.. ? వదిలేయమంటాడా..? అనేది తెలియాలి.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×