E-Paper
Advertisement

Kalki 2898 AD: కల్కి ఓటీటీ డేట్ ఫిక్స్‌, కొత్త స్ట్రీమింగ్ వర్షన్‌లో అలరించనున్న మూవీ

Kalki 2898 AD: కల్కి ఓటీటీ డేట్ ఫిక్స్‌, కొత్త స్ట్రీమింగ్ వర్షన్‌లో అలరించనున్న మూవీ
Advertisement

Kalki OTT Date Fix, Movie To Be Entertained In New Streaming Version: పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ డార్లింగ్‌ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన లేటెస్ట్‌ బ్లాక్‌​బస్టర్ మూవీ కల్కి. ఈ మూవీ వరల్డ్ ​వైడ్‌​గా రూ 11 వందల కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి తెలుగు మూవీని ప్రపంచానికి పరిచయం చేసింది. జూన్ 27న రిలీజైన ఈ మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా రికార్డుల మోతలు మోగించింది. అయితే ఇన్ని రోజులు థియేటర్లలో అలరించిన కల్కి మూవీ, ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయింది.

కల్కి డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌​ఫామ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు టాక్. ఇక ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఈనెల 23 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని ఇన్‌సైడ్ మూవీ వర్గా్ల్లో చర్చ నడుస్తోంది. అయితే థియేటర్ వెర్షన్ కాకుండా మూవీని కాస్త ట్రిమ్ చేసి ఓటీటీలో రిలీజ్ చేయనున్నారట. అసలు రన్‌​టైమ్‌​లో దాదాపు 6 నిమిషాల ఫుటేజీ కట్ చేయనున్నారని తెలుస్తోంది. అయితే ఓటీటీ రిలీజ్‌ రన్‌​టైమ్​ గురించి ఇంకా మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సింది. కల్కి 2898 ఏడీ మూవీ 2024 ఏడాదిలో రిలీజైన అతిపెద్ద హిట్ సినిమాగా టాలీవుడ్‌ ఇండస్ట్రీలో నిలిచింది. రిలీజ్ నుంచి ఆదరణ పొందుతూ కొత్త కొత్త రికార్డులను సృష్టించింది. ఈ నేపథ్యంలో సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి రూ 760 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Also Read: సంస్కృతి, సాంప్రదాయాలను అపహాస్యం చేయొద్ధని వేడుకున్న దర్శకుడు

దీంతో బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్​ ఖాన్ నటించిన జవాన్ సినిమా ఆల్ టైమ్ ఇండియా కలెక్షన్స్ రికార్డును కూడా బ్రేక్ చేసింది. ఇండియన్ బాక్సాఫీస్‌లో జవాన్ సినిమా ఆల్ టైమ్ కలెక్షన్స్ రూ 760 కోట్లుగా నిలిచింది. అంతేకాదు భారతీయ చలన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో మూవీగా కల్కి నిలిచింది. గతంలో బాహుబలి 2,, కేజీఎఫ్ 2,, ఆర్ఆర్ఆర్ సినిమాలు ఈ ఫీట్ సాధించగా తాజాగా ఈ మూవీ ఈ లిస్ట్‌లోకి వచ్చి చేరింది.ఇక ఈ మూవీని దర్శకుడు నాగ్ అశ్విన్ హిందూ పురాణాలను ఆధారంగా చేసుకుని సైన్స్ ఫిక్షన్ ఎంటర్ టైనర్‌గా అధ్భుతంగా తెరకెక్కించారు. ఇందులో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ నటీనటులు నటించారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×