BigTV English

Train Accident: గౌడవెల్లిలో ట్రైన్ ఢీకొని.. తండ్రి, ఇద్దరు కూతుళ్లు మృతి

Train Accident: గౌడవెల్లిలో ట్రైన్ ఢీకొని.. తండ్రి, ఇద్దరు కూతుళ్లు మృతి

Hyderabad: తెలంగాణలో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌‌లోని మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలోని గౌడవెల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ ఢీకొని తండ్రి, ఇద్దరు కుమార్తెలు మరణించారు. రాఘవేందర్ నగర్ కాలనీకి చెందిన కృష్ణ కుటుంబంగా వీరిని గుర్తించారు. కృష్ణ లైన్‌మెన్‌గా పని చేస్తున్నారు.


కృష్ణ లైన్‌మెన్‌గా పని చేస్తున్నారు. ఈ రోజు ఆయన తన ఇద్దరు కుమార్తెలు వర్షిత, వరిణిని కూడా వెంట తీసుకెళ్లారు. వారిని ట్రాక్ పై కూర్చోబెట్టి పని చేసుకుంటున్నారు. వారిద్దరూ ట్రాక్ పైనే ఆడుకుంటూ ఉన్నారు. ఇంతలో ఓ ట్రైన్ అదే ట్రాక్ పై రావడాన్ని కృష్ణ గుర్తించారు. వెంటనే తన కుమార్తెల వద్దకు వెళ్లారు. వారిని కాపాడబోతుండగా.. ప్రమాదం జరిగింది. ఆ ట్రైన్ ఢీకొని ముగ్గురు మరణించారు. పోలీసులు స్పాట్‌కు చేేరుకున్నారు. ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణ సతీమణి శోకసంద్రంలో మునిగిపోయింది. ఏకకాలంలో భర్త, ఇద్దరు కన్నబిడ్డలను కోల్పోవడంతో ఆమె రోధన.. అందరినీ కలచివేసింది.

Also Read: Dhanush Wayanad Landslide: వయనాడ్ బాధితులకు ధనుష్ సాయం.. లక్షల్లో విరాళం..


ఇదిలా ఉండగా, హైదరాబాద్ శివారులో నార్సింగి సమీపంలో టిప్పర్ లారీని ఓ కారు అమితవేగంతో వచ్చి ఢీకొట్టింది. దీంతో కారులోని ముగ్గురు యువకులు, టిప్పర్ లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో మైహోమ్ అవతార్ జంక్షన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. గంటపాటు శ్రమిస్తేగానీ, కారులో నుంచి బాధితులను బయటికి తీయలేకపోయారు. కారు మితిమీరిన వేగంతో ప్రయాణించడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు.

కారులోని ముగ్గురు యువకులు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులని తెలుస్తున్నది. ఈ నలుగురినీ హాస్పిటల్‌లో చికిత్స నిమిత్తం చేర్చారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×