E-Paper
Advertisement

Kalki 2898AD: ప్రభాస్ జీవితంలోకి వస్తున్న అమ్మాయి ఎవరో తెలిసిపోయిందిరోయ్..!

Kalki 2898AD: ప్రభాస్ జీవితంలోకి వస్తున్న అమ్మాయి ఎవరో తెలిసిపోయిందిరోయ్..!
Advertisement

Kalki 2898AD Team Revealed Prabhas Instagram Story: ఈరోజు ఉదయం నుంచి ప్రభాస్ పెళ్లి వార్తలు ఎంత సెన్సేషన్ సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేటి ఉదయం ప్రభాస్.. మన జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి రాబోతున్నారు అని పోస్ట్ చేయడంతోనే.. ప్రభాస్ పెళ్లి చేసుకుంటున్నాడు.. ప్రభాస్ గుడ్ న్యూస్ చెప్పాడు అంటూ సోషల్ మీడియాను షేక్ చేశారు. ఇక కొద్దిసేపటికి అదంతా ప్రమోషన్స్ కోసమే అని తెలిసి అవాక్కయ్యారు.

తాజాగా ఆ పోస్ట్ ప్రభాస్ ఎందుకు పెట్టాడో తెలిసిపోయింది. ముందుగా అనుకున్నట్లుగానే కల్కి ప్రమోషన్స్ లో భాగంగా డార్లింగ్.. ఈ పోస్ట్ పెట్టాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్విన్ దత్ మరియు స్వప్న దత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే నటిస్తుండగా.. కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్, దిశా పటానీ నటిస్తున్నారు. ఇప్పటికే కల్కి నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్ ఏ రేంజ్ లో రికార్డులు సృష్టించాయో తెల్సిందే.

Advertisement

ఇక తాజాగా మేకర్స్ హీరోయిన్ లుక్ ను రివీల్ చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు. స్క్రాచ్ ఎపిసోడ్ 04 అనే పేరుతో రేపు సాయంత్రం 4 గంటలకు హీరోయిన్ లుక్ ను రివీల్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో దీపికా పేరు బుజ్జి అని తెలిపారు. ప్రభాస్ పేరు భైరవ అని ఇప్పటికే రివీల్ చేశారు. భైరవ- బుజ్జిని మీకు చూపించడానికి వేచి ఉండలేకపోతున్నాం అంటూ మేకర్స్ తెలిపారు. ఈ అప్డేట్ తో ప్రభాస్ పెట్టిన పోస్ట్ కు ఒక క్లారిటీ వచ్చింది.

Also Read: Naga Babu Twitter Account: మళ్లీ ట్విట్టర్‌లోకి మెగా బ్రదర్ నాగబాబు.. ఈ సారి ఏమని ట్వీట్ చేశారంటే..?

Advertisement

ఇక ఎట్టకేలకు డార్లింగ్ చెప్పిన అమ్మాయి బుజ్జి అని తెలిసిపోయింది. దీంతో అభిమానులు పెళ్లి కాదు అని తెలిసి అసహనం వ్యక్తం చేసినా.. కల్కి అప్డేట్ వస్తుంది అని ఆనందపడుతున్నారు. మరి కల్కిలో దీపికా లుక్ ఎలా ఉండబోతుందో అని అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి రేపు ఈ పోస్టర్ ఎలా ఉండబోతుందో చూడాలి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×