BigTV English

Instant Noodles: నూడుల్స్ తింటే ఆరోగ్యానికి హానికరమా..? తినే ముందు అసలు నిజం తెలుసుకోండి!

Instant Noodles: నూడుల్స్ తింటే ఆరోగ్యానికి హానికరమా..? తినే ముందు అసలు నిజం తెలుసుకోండి!

Instant Noodles are Good or Bad for Health: చాలా మంది ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతుంటారు. అందులో ముఖ్యంగా నూడుల్స్ అంటే నోట్లో నీళ్లు ఊరేస్తుంటాయి. హోటళ్లలో చేసే నూడుల్స్ మాత్రమే కాకుండా మార్కెట్లో ఇన్‌స్టంట్ నూడుల్స్ ప్యాకెట్లు విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో అవి తిని చాలా మంది అనారోగ్యానికి గురవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే కొంత కాలం నుంచి నూడుల్స్ తినడం ఆరోగ్యానికి హానికరం అని చాలా వార్తలు వచ్చాయి. అయితే నూడుల్స్ తింటే అసలు ఏం అవుతుంది. నిజంగా ఆరోగ్యానికి హానికరమేనా అనే విషయాలు తెలుసుకుందాం.


ఇన్ స్టంట్ నూడుల్స్ తినడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదమే అని నిపుణులు చెబుతున్నారు. నూడుల్స్ లో మోనోసోడియం గ్లూటామేట్ అనే పదార్థాన్ని వాడుతారు. మలబద్ధకం, తలనొప్పి, కడుపునొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయట. అంతేకాదు దీర్ఘకాలిక వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంటుందని అంటున్నారు.

హైబీపీ..


నూడుల్స్ అధికంగా ఉండే సోడియం కంటెంట్ వల్ల రక్తపోటు పెరుగుతుందట. అంతేకాదు నీరు ఎక్కువగా నిలిచిపోవడం వల్ల మూత్రపిండాలు కూడా దెబ్బ తినే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

Also Read: Tulasi Leaves Benefits: తులసి నీళ్లతో అందం, ఆరోగ్యం.. ఇంకా మరెన్నో ప్రయోజనాలు..

క్యాన్సర్..

నూడుల్స్ లో ఉండే బిస్ ఫినాల్ అనే హానికరమైన రసాయనాలు.. క్యాన్సర్‌కు కారణం అవుతాయట. అందువల్ల నూడుల్స్ ప్రతీరోజు తినే వారు క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

గుండె సంబంధింత వ్యాధులు..

ఇన్ స్టంట్ న్యూడుల్స్ తినడం వల్ల గుండె వ్యాధులు పెరుగుతాయి. నూడుల్స్ లో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల హృదయనాళ వ్యాధుల ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మేరకు PLoS One అనే ఓ అధ్యయనంలో తేలింది.

Also Read: chapped lips: వేసవికాలంలో పెదవులు పొడిబారడానికి కారణం తెలుసా ? ఈ చిట్కాలు పాటిస్తే అంతా సెట్

జీర్ణ సమస్యలు..

ఇన్ స్టంట్ న్యూడుల్స్ తినడం వల్ల మలబద్ధకం, ఉబ్బరం, అతిసారం వంటి సమస్యలకు దారితీస్తుంది. నూడుల్స్ లో పీచు పదార్థాలు తక్కువగా ఉండి, సోడియం ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణ సమస్యలు ఏర్పడతాయి.

మధుమేహం..

నూడుల్స్ తినడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉంటుంది. నూడుల్స్ ఉండే కార్బోహైడ్రేట్ల కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.

Tags

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×