Naga Babu Latest Tweet(Latest news in tollywood): మెగా బ్రదర్ నాగబాబు తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఎవరు ఏం చేస్తున్నారు. ఎవరు ఎవరిని మీట్ అవుతున్నారు. ఎవరెలా స్పందిస్తున్నారు అనే అన్ని విషయాలను తెలుసుకుని ఒక్కసారిగా ట్వీట్ల వర్షం కురిపిస్తుంటారు. అలా ట్వీట్‌లు చేస్తూ వివాదాల్లో చిక్కుకుంటారు. వాళ్లు వీళ్లు.. తన మన భేదం లేకుండా ట్వీట్లలో రచ్చ రచ్చ చేస్తుంటారు.
అయితే ఇటీవల నాగబాబు ఏపీలో ఎన్నికల పోలింగ్ తర్వాత చేసిన ఓ ట్వీట్ నెట్టింట దుమారం రేపింది. ‘మావాడైనా పరాయివాడే.. పరాయివాడైనా మా వాడే’ అంటూ ఓ ట్వీట్ చేశారు. దీంతో ఆ ట్వీట్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసింది. అయితే ఆ ట్వీట్‌లో ఎవరిని ఉద్దేశించి అన్నారో చెప్పకపోయినా.. అది మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను ఉద్దేశించేనని అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే మరి నాగబాబుకు – అల్లు అర్జున్‌కు ఏమైనా గొడవలు జరిగాయా అని అంతా అనుకోవచ్చు. అలాంటిదేమి లేదు. మరి ఎందుకు అనుకుంటున్నారా?. ఏపీలో 2024 ఎలక్షన్ టైంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టీడీపీకి మద్దతుగా నిలిచారు. దీంతో మెగా ఫ్యామిలీతో పాటు యావత్ తెలుగు సినీ ఇండస్ట్రీలోని చాలా మంది నటీ నటులు పవన్ కల్యాణ్‌కు అలాగే జనసేనకు మద్దతుగా నిలిచారు.
అదే టైంలో అల్లు అర్జున్ మాత్రం వైసీపీ ఎమ్మెల్యేకు సపోర్ట్ చేశారు. నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే రవికి బన్నీ తన సపోర్ట్‌ను అందించారు. ఎందుకంటే గత ఎన్నికలు 2019లోనే రవికి మద్దతుగా నిలుస్తానని బన్నీ మాట ఇచ్చాడట. కానీ అప్పుడు వీలు కాక.. ఈ 2024 ఎలక్షన్లో ఎలాగైనా మాట నిలబెట్టుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే రవికి సపోర్ట్‌గా నిలిచాడు.
Also Read: నాగబాబు వర్సెస్ అల్లు అర్జున్.. ఇప్పట్లో ఆగేలా లేదే..?
దీంతో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. అటు సినీ ఇండస్ట్రీ, మెగా ఫ్యామిలీ మొత్తం టీడీపీ పొత్తుకు (పవన్ కల్యాణ్) సపోర్ట్ చేస్తుంటే.. ఇటు అదే ఫ్యామిలీకి చెందిన బన్నీ మాత్రం తన స్నేహితుడు, వైసీపీ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయడం చర్చనీయాంశమైంది. దీనిపై నాగబాబు మే 13న ట్వీట్ చేశారు. ‘మావాడైనా పరాయివాడే.. పరాయివాడైనా మా వాడే’ అంటూ ఆ ట్వీట్‌లో రాసుకొచ్చారు.
దీంతో ఆ ట్వీట్ అల్లు అర్జున్‌ను ఉద్దేశించేనని అభిమానులు చిర్రెత్తిపోయారు. ఇక ఏముంది ట్విట్టర్‌లో రచ్చ మొదలైంది. బన్నీ ఫ్యాన్స్ ట్విట్టర్‌లో నాగబాబును ఓ ఆట ఆడేసుకున్నారు. ట్రోలింగ్స్, విమర్శలతో రచ్చ రంబోలా చేశారు. ఆ రెండు రోజులు మెగా బ్రదర్ నాగబాబు వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనే రేంజ్‌లో వార్ జరిగింది. దీంతో నాగబాబు తన ట్విట్టర్ అకౌంట్‌ను తాత్కాలికంగా డియాక్టివేట్ చేశారు.
అయితే అంతా సర్దుమనిగింది అనే సమయంలో నాగబాబు మళ్లీ తన ట్విట్టర్ ఖాతాను రీ-యాక్టివేట్ చేశారు. ఇదే విషయాన్ని నాగబాబు తాజాగా తెలియజేశారు. అంతేకాదు ఓ ట్వీట్ కూడా చేశారు. మరి ఎమైందో ఏమో కానీ.. ‘ఐ హ్యావ్ డిలీటెడ్ మై ట్వీట్’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ మళ్లీ కామెంట్ల సెక్షన్ నింపేశారు. ఏం ట్వీట్ డిలీట్ చేశావ్ అని కొందరు.. అలా దారికి రావాలని మరికొందరు ఇలా ఎవరికి తోచినట్లు వారు కామెట్లు పెడుతున్నారు.
"I have deleted my tweet"
— Naga Babu Konidela (@NagaBabuOffl) May 18, 2024