E-Paper
Advertisement

NKR 21 – NKR 22: కళ్యాణ్ రామ్ బర్త్ డే స్పెషల్.. అదిరిపోయిన కొత్త సినిమాల పోస్టర్లు..

NKR 21 – NKR 22: కళ్యాణ్ రామ్ బర్త్ డే స్పెషల్.. అదిరిపోయిన కొత్త సినిమాల పోస్టర్లు..
Advertisement

NANDAMURI KALYAN RAM: నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం పలు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇవాళ అతడి బర్త్ డే కావడంతో రెండు సినిమాలకు సంబంధించిన అప్డేట్‌లను మేకర్స్ అందించారు. అందులో ముందుగా కళ్యాణ్ రామ్ కెరీర్‌లో 21వ మూవీగా తెరకెక్కుతోన్న సినిమా గురించి తెలుసుకుందాం.

NKR-21

Advertisement

కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీ తర్వాత నటిస్తున్న కొత్త సినిమా ‘NKR-21’. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇవాళ కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ప్రకారం.. ఇందులో కళ్యాణ్ మాస్ లుక్ చాలా అద్భుతంగా ఉంది. పిడికిలి బిగించి అగ్గిని కూడా లెక్కచేయకుండా కూర్చున్న స్టిల్ సినీ ప్రియుల్లో క్యూరియోసిటీ పెంచేస్తుంది. అదే సమయంలో తన చుట్టూ ఉన్న గూండాలు కసితో అతడిని చూస్తున్న తీరు ఆసక్తి రేపుతోంది.

ఈ లుక్‌లో కళ్యాణ్ రామ్‌ను మునుపెన్నడూ చూడలేదు. అయితే మేకర్స్ ప్రకారం.. ఇంతక ముందెన్నడూ చూడని అవతార్ కళ్యాణ్ రామ్‌ను ఈ సినిమాలో చూస్తారని మేకర్స్ అంటున్నారు. కాగా ఈ మూవీ కళ్యాణ్ రామ్ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. అయితే ఈ మూవీలో విజయ్ శాంతి కూడా అదిరిపోయే పాత్ర చేస్తోంది.

Advertisement

Also Read: కుబేర మూవీ నుంచి రష్మిక ఫస్ట్ లుక్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న వీడియో

ఇంతకముందు ఆమె పాత్రకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేయగా నెట్టింట వైరల్‌గా మారింది. చాలా ఏళ్ళ తర్వాత మళ్లీ పోలీస్ డ్రెస్‌లో విజయ్ శాంతి కనిపించి అదరగొట్టేసింది. ఇక ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్, సోహెల్ ఖాన్, శ్రీకాంత్ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

NKR-22

నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్‌లో తెరకెక్కబోతున్న 21వ మూవీతో పాటు 22వ సినిమాకు సంబంధించిన అప్డేట్‌ను కూడా మేకర్స్ అందించారు. ‘NKR-22’ వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ మూవీ ‘బింబిసార’ ప్రీక్వెల్‌గా తెరకెక్కబోతున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. ‘బింబిసార’ సినిమాతో రికార్డులు క్రియేట్ చేసిన కళ్యాణ్‌రామ్.. ఇప్పుడు ప్రీక్వెల్‌కు సిద్ధమయ్యాడు.

అయితే ‘బింబిసార’ చిత్రానికి వశిష్ట దర్శకత్వం వహించగా.. ఇప్పుడు ఈ బింబిసార ప్రీక్వెల్ చిత్రానికి అనిల్ పాడూరి దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. ఈ చిత్రాన్ని కొసరాజు హరికృష్ణ గ్రాండ్‌ లెవెల్లో నిర్మిస్తున్నాడు. ఇవాళ కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా ‘‘బింబిసార కంటే ముందు త్రిగర్తలను పాలించిన లెజెండ్ స్టోరీ చూడ్డానికి రెడీగా ఉండండి’’ అంటూ మేకర్స్ ఒక సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×