BigTV English
Advertisement

Ayyannapatrudu Comments on YCP: గత ప్రభుత్వం అసెంబ్లీ భవనాలకు సున్నం కూడా వేయలేదు: స్పీకర్ అయ్యన్న

Ayyannapatrudu Comments on YCP: గత ప్రభుత్వం అసెంబ్లీ భవనాలకు సున్నం కూడా వేయలేదు: స్పీకర్ అయ్యన్న

Ayyanna Patrudu comments on YCP(Andhra politics news): గత ప్రభుత్వంపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తనదైన రీతిలో స్పందించారు. ఐదేళ్లు పాలించిన వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీ భవనాలకు కనీసం సున్నం కూడా వేయలేదని విమర్శించారు. శుక్రవారం అమరావతిలోని ఎమ్మెల్యేల క్వార్టర్స్, అసెంబ్లీ పరిసరాలను ఆయన పరిశీలించారు. స్పీకర్ వెంట ఎమ్మెల్యేలు శ్రావణ్ కుమార్, విష్ణుకుమార్ రాజు, పలువురు అధికారులు ఉన్నారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.. స్పీకర్ హోదాలో నిర్మాణ దశలో ఉన్న ఎమ్మెల్యేల క్వార్టర్లను పరిశీలించినట్లు ఆయన పేర్కొన్నారు.


2014-19 మధ్య కాలంలో ఈ భవనాల నిర్మాణ వేగంగా జరిగిందన్నారు. వైసీపీ పాలనలో నిర్మాణాలు ఒక్క అంగుళం కూడా ముందుకు పడలేదన్నారు. నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్ ను కూడా దొంగిలించారన్నారు. ఐదేండ్ల పాటు పనులు చేపట్టకపోవడంతో తిరిగి పనులు పూర్తి చేసేందుకు మరో రూ. 380 కోట్ల అదనపు భారం పడుతోందని చెప్పారు. రాబోయే 9 నెలల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్స్ పూర్తయ్యే విధంగా చూడాలని సీఎం చంద్రబాబుు కోరినట్లు ఆయన చెప్పారు.

మిగిలిన రాష్ట్రాల్లో ఇటువంటి రాజధాని ఎక్కడా లేదని.. అధికారులు సహకరించి నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని స్పీకర్ సూచించారు. అందరం కలిసి రాజధానిని నిర్మించుకుని ప్రజలకు అంకితమివ్నాలని అయ్యన్నపాత్రుడు కోరారు.


Also Read: మళ్లీ కడప.. మూడురోజుల జగన్ టూర్, మహానేత కోసం..

ఇదిలా ఉంటే.. కృష్ణా డెల్టా ఆయకట్టుకు సాగునీరివ్వడం ఆగస్టు వరకు సాధ్యం కాదని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సాగునీరు అందించే విషయంలో ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

‘పులిచింతల ప్రాజెక్టులో గతంలో 40 టీఎంసీలు నిల్వ ఉంచుకుని వాడుకునేవాళ్లం. ప్రస్తుతం అందులో అర టీఎంసీ నీరు కూడా నిల్వ లేదు. పట్టిసీమ ద్వారా కృష్టాడెల్టాకు కొంచెం తాగు, సాగునీరు ఇవ్వగలుగుతున్నాం. ఐదేళ్లుగా నిర్వహణ సరిగా లేక పట్టిసీమ మోటార్లు పనిచేయడంలేదు. జగన్ పరిపాలన వల్ల జలవరుల శాఖ తీవ్రంగా నష్టపోయింది.

Also Read: రాష్ట్రాన్ని ఆదుకోండి.. నిర్మలమ్మకు చంద్రబాబు వినతి

ఈవీఎం బద్దలు కొట్టడం తప్పు కాదని జగన్ మోహన్ రెడ్డి మాట్లాడడం దారుణం. ఈవీఎంలను బద్దలు కొట్టడమంటే ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయడమే అవుతుంది. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండా జగన్ ప్రజలనే తప్పు పడుతున్నారు. జగన్ తీరు ఇలాగే ఉంటే మొన్న మూడంకెల్లో రెండే మిగిలాయి.. భవిష్యత్తులో రెండు నుంచి ఒక సంఖ్యకే పరిమితమవుతారు’ అంటూ నిమ్మల అన్నారు.

Tags

Related News

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

Big Stories

×