E-Paper
Advertisement

Kubera – Rashmika: కుబేర మూవీ నుంచి రష్మిక ఫస్ట్ లుక్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న వీడియో

Kubera – Rashmika: కుబేర మూవీ నుంచి రష్మిక ఫస్ట్ లుక్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న వీడియో
Advertisement

Kubera – Rashmika: ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ ‘కుబేర’. ధనుష్, నాగార్జున కలిసి నటిస్తున్న ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. హైలీ యాంటిసిపేటెడ్ సోషల్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో హీరోయిన్‌గా రష్మిక మందన్న నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ ఈ చిత్రాన్ని కలిసి నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో తమిళం, తెలుగు భాషల్లో ఈ సినిమా ఏకకాలంలో షూటింగ్ జరుపుకుంటోంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్ ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి. అందులో ముందుగా రిలీజ్ చేసిన ధనుష్ గ్లింప్స్‌కి సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ గ్లింప్స్‌లో ధనుష్ ఒక బిచ్చగాడిలా కనిపించడంతో సినిమాపై ఆసక్తి రేగింది. దీంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. సినిమా టైటిల్ చూస్తే ‘కుబేర’ అని పెట్టారు. మరి గ్లింప్స్‌లో ధనుష్ ఏంటి బిచ్చగాడిలా కనిపిస్తున్నాడు అని అంతా నివ్వెరబోయారు.

Advertisement

Also Read: నాగార్జున ‘కుబేర’ ఫస్ట్ లుక్ రిలీజ్.. అచ్చం ఆ సినిమాలాగే ఉందే?

మరికొందరేమో గ్లింప్స్‌తోనే సినిమా రేంజ్ మరో స్థాయికి వెళ్లిందని.. దర్శకుడు శేఖర్ కమ్ముల ఏదో పెద్ద ప్లానే వేశాడంటూ కామెంట్లు పెట్టారు. ఇక దీని తర్వాత ఇటీవల నాగార్జునకు సంబంధించి ఓ గ్లింప్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అందులో నాగ్ మాస్ లుక్ చాలామందిలో క్యూరియోసిటీ పెంచేసింది. ఈ గ్లింప్స్‌లో యాక్షన్‌ సీన్లు చూపించారు. అంతేకాకుండా పెట్టెలతో ఎక్కువగా ఉన్న డబ్బులను చూపించి ఆసక్తి రేకెత్తించారు.

Advertisement

ఇలా రెండు గ్లింప్స్‌తో సినిమాపై భారీ అంచనాలు పెంచేసిన మేకర్స్ ఇప్పుడు మరో గ్లింప్స్‌‌తో ట్రీట్ అందించారు. ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్న రష్మిక మందన్నా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఇందులో రష్మిక పింక్ డ్రెస్‌లో కనిపించింది. చేతిలో బ్యాగ్‌తో ఉన్న లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఫస్ట్ లుక్‌తో పాటు ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియోలో రష్మిక ఒక గునపం పట్టుకుని గొయ్యి తవ్వి అందులోనుంచి ఒక సూట్కేస్ తీస్తుంది. అందులో డబ్బే డబ్బు కనిపించింది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో అండ్ ఫస్ట్ లుక్ చేసేయండి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×