BigTV English
Advertisement

Kalyan Ram : డేరింగ్ డెసిషన్ తీసుకున్న డెవిల్ .. పోటీ తట్టుకునేనా..

Kalyan Ram : డేరింగ్ డెసిషన్ తీసుకున్న డెవిల్ .. పోటీ తట్టుకునేనా..

Kalyan Ram : విభిన్నమైన కథలతో.. వినూత్నమైన కంటెంట్‌తో.. మంచి నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు నందమూరి కళ్యాణ్ రామ్. బింబిసార మూవీతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చిన కళ్యాణ్ రామ్ అదే జోష్ తో డెవిల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇందులో బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా కళ్యాణ్ రామ్ లుక్స్ ఇప్పటికే ప్రేక్షకుల మనసు దోచుకున్నాయి. ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్ వీడియో చిత్రం పై ఆసక్తిని పెంచింది అనడంలో ఎటువంటి డౌట్ లేదు.


డెవిల్ ..ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ మూవీ నుంచి ఓ చిన్ని అప్డేట్ సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేస్తుంది. కంటెంట్ సాలిడ్ గా ఉండడంతో మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి సందడి చేస్తుంది అని చిత్ర యూనిట్ గట్టి నమ్మకంతో ఉంది. పైగా ఇందులో కళ్యాణ్ రామ్ లక్కీ హీరోయిన్ సంయుక్త మీనన్ నటిస్తుండడంతో.. ఈ మూవీ కూడా కళ్యాణ్ రామ్ కెరిర్ లో మంచి సక్సెస్ఫుల్ మూవీ గా మిగులుతుంది అని అభిమానులు ఆశిస్తున్నారు.

 ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ కూడా మంచి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి. అంతా బాగానే ఉంది కానీ ఇంకా ఈ రిలీజ్ డేట్ పై చాలా రోజుల నుంచి కన్ఫ్యూజన్ నెలకొని ఉంది. మొదట్లో డిసెంబర్ ఫస్ట్ వీక్ లేక సెకండ్ వీక్ లో ఈ సినిమా వస్తుంది అని అందరూ అనుకున్నారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులలో జరిగిన ఆలస్యం కారణంతో మూవీని వాయిదా వేయక తప్పలేదు. దీంతో కొత్త రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్.. డిసెంబర్ 29న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయడానికి రాబోతున్నట్టు అఫీషియల్ గా మేకర్స్ అనౌన్స్ చేశారు.


అయితే అసలు చిక్కు ఇక్కడే మొదలైంది.. డిసెంబర్ 22న సలార్ చిత్రం గ్రాండ్ గా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరెక్టుగా వారం గ్యాప్ తర్వాత డెవిల్ రావడం అనేది కాస్త డ్రాస్టిక్ డెసిషన్ అంటున్నారు సినీ విశ్లేషకులు. సలార్ మూవీ క్లిక్ అయితే.. బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలవుతాయి అనేది కన్ఫామ్.. మరి ఈ నేపథ్యంలో ఎంత పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా ..డెవిల్ కలెక్షన్స్ పై ప్రభావం పడకుండా మానదు. మరోపక్క సలార్ కి నెగిటివ్ టాక్ వస్తే.. ఇక డెవిల్ చిత్రం ప్రభంజనంలా రెచ్చిపోతుంది. అయితే ఇది జరిగే ఛాన్స్ చాలా తక్కువ. తనకి తమ కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో డెవిల్ టీం డిసెంబర్ 29న రావడానికి రెడీగా ఉంది.. ఇక ఈ మూవీ సలార్ పోటీ తట్టుకొని ..ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×