E-Paper
Advertisement

Praja Darbar : ప్రజాభవన్‌లో ప్రజాదర్బార్.. ఫిర్యాదులతో ప్రజలు రెడీ..

Praja Darbar : ప్రజాభవన్‌లో ప్రజాదర్బార్.. ఫిర్యాదులతో ప్రజలు రెడీ..
Advertisement

Praja Darbar : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం చేస్తూ రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రగతి భవన్ ఇనుప కంచెలు బద్దలు కొట్టామని.. నేటి ఉదయం 10 గంటలకు అక్కడ ప్రజా దర్బార్ నిర్వహిస్తామని చెప్పారు. ప్రగతి భవన్ పేరుని జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌గా మారుస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై ప్రజా భవన్‌కు ఎవరైనా రావొచ్చు అని.. ఎలాంటి ఆంక్షలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లభించిందని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకే ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని రేవంత్ రెడ్డి చెప్పారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పాటుతో సమాన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలతోనే కాదని, ప్రపంచంతోనే పోటీపడేలా చేస్తానన్నారు. కాగా ప్రజా దర్బార్ ప్రతి శుక్రవారం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రజా దర్బార్ ద్వారా ప్రజల ఫిర్యాదులను స్వీకరించి వెంటనే పరిష్కరించేలా సీఎం రేవంత్ చర్యలు చేపట్టనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

అయితే జ్యోతిరావుఫూలే ప్రజాభవన్‌కు.. ప్రతి సామాన్య వ్యక్తి వచ్చి తన సమస్యలు చెప్పుకునే వెసులుబాటు ఉంటుందని.. సీఎం రేవంత్‌ రెడ్డి మొదట్నుంచి చెప్తూనే ఉన్నారు. చెప్పిన విధంగానే ప్రగతి భవన్‌ కంచెను తొలగించారు. ఇక ఇవాళ్టి నుంచి ప్రజా దర్బార్‌ ప్రారంభంకానుంది. ఇప్పటికే పలు జిల్లాల నుంచి ప్రజలు, నిరుద్యోగులు తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజాభవన్‌కు చేరుకున్నారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×