Ambati Rayudu on RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 సీజన్ మరో 11 రోజులలో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే నిర్వాహకులు షెడ్యూల్ ని కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. మార్చి 22 నుండి మే 25 వరకు ఈ ఐపీఎల్ 18వ సీజన్ జరగనుంది. మొత్తం 13 వేదికలలో 74 మ్యాచ్లు జరగబోతున్నాయి. అయితే ఈ ఐపీఎల్ టోర్నమెంట్ ప్రారంభానికి తక్కువ రోజుల సమయం ఉన్న నేపథ్యంలో విపరీతమైన హైప్ క్రియేట్ అవుతుంది.
Also Read: Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీనే మర్చిపోయిన రోహిత్ శర్మ !
ఐపీఎల్ కోసం ఇప్పటికే అనేక జట్లు ప్రాక్టీస్ క్యాంపులను కూడా ప్రారంభించాయి. మరోవైపు తమ అభిమానులను ఆకర్షించేందుకు ఫ్రాంచైజీలు సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా కొత్త అప్డేట్స్ ని ఇస్తున్నాయి. అలాగే ఈ ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ ల టికెట్ల విక్రయాలు కూడా మొదలైపోయాయి. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు, క్రికెట్ విశ్లేషకులు తమ కామెంట్లతో ఐపిఎల్ పై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆదివారం రోజు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భాగంగా భారత్ – న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, సంజయ్ బంగర్ మధ్య జరిగిన ఓ ఆసక్తికర సంభాషణ ఇప్పుడు వైరల్ గా మారింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో కామెంటరీలో సంజయ్ బంగర్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుపై ప్రశంసలు కురిపించాడు.
గత నాలుగు సంవత్సరాలుగా ఆర్సిబి నిలకడగా ఆడి.. ప్లే ఆఫ్స్ వరకు దూసుకొస్తుందని.. ఇది గొప్ప పరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే మరో కామెంటేటర్ అయిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు {Ambati Rayudu on RCB} స్పందిస్తూ ఆర్సిబి జట్టు పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ లెక్కన ఈసారి ఆర్సిబి క్వాలిఫైయర్ – 2 ఆడుతుందా..? అని అన్నాడు అంబటి రాయుడు. దీంతో ఆర్సిబి అభిమానులు ఈ మ్యాచ్ చూస్తున్నారు.. అది మరచిపోవద్దు అని రాయుడికి హితవు పలికాడు సంజయ్.
Also Read: Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్స్‌కు వైట్ సూట్స్ ఎందుకు ఇస్తారో తెలుసా?
అయినప్పటికీ రాయుడు మాట్లాడుతూ.. “అయితే ఏంటి..? నన్ను బెదిరిస్తున్నారా..? ఏది ఏమైనా అర్జీబీ అభిమానులు అంటే నాకు కూడా ప్రేమే” అని అన్నాడు. అయితే అంబటి రాయుడు ఆర్సిబి పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇది తొలిసారి మాత్రమే కాదు. గతంలోనూ ఆర్సిబి ఫై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ టీమ్ డబ్ల్యూపిఎల్ గెలిచిన తర్వాత.. ఐపీఎల్ 2024 బరిలోకి దిగింది ఆర్సిబి పురుషుల జట్టు. అయితే ఆ సమయంలో ఆడిన నాలుగు మ్యాచ్లలో, మూడు మ్యాచ్లలో ఓడిపోయి తొమ్మిదవ స్థానంలో ఉంది. ఆ సమయంలో అంబటి రాయుడు.. ఆర్సిబి ఐపీఎల్ ఎప్పటికీ గెలవదు అంటూ విమర్శించాడు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">