E-Paper
Advertisement

Kamal Haasan: ప్యాన్ ఇండియా మల్టీ స్టారర్‌కు రూట్ క్లియర్.. కమల్ హాసన్‌తో ఆ బాలీవుడ్ స్టార్ హీరో సినిమా

Kamal Haasan: ప్యాన్ ఇండియా మల్టీ స్టారర్‌కు రూట్ క్లియర్.. కమల్ హాసన్‌తో ఆ బాలీవుడ్ స్టార్ హీరో సినిమా
Advertisement

Kamal Haasan: ఈరోజుల్లో సౌత్, నార్త్ అని తేడా లేకుండా హీరోలంతా ప్యాన్ ఇండియా చిత్రాలపైనే ఫోకస్ చేస్తున్నారు. ముఖ్యంగా ఒక భాషా దర్శకులు, మరో భాషలోని హీరోతో సినిమాలు చేయడానికి కూడా వెనక్కి తగ్గడం లేదు. అలాగే ఒక బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ లైన్‌లో ఉన్నట్టు తాజాగా వార్తలు బయటికొచ్చాయి. ఉలగనాయగన్ కమల్ హాసన్.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ఓకే చేస్తూ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధమయ్యాడు. అలాగే త్వరలోనే ఒక భారీ ప్రాజెక్ట్‌లో ఆయన భాగం కానున్నట్టు కోలీవుడ్‌లో మాత్రమే కాదు బాలీవుడ్‌లో కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎందుకంటే ఆయన చేయబోయే సినిమాలో ఒక బాలీవుడ్ స్టార్ హీరో కూడా ఉండబోతున్నాడని సమాచారం.

బిగ్గెస్ట్ మల్టీ స్టారర్

Advertisement

యంగ్ డైరెక్టర్ అట్లీ ఇప్పటికే పలు స్టార్ హీరోలను డైరెక్ట్ చేసి తాను కూడా స్టార్ డైరెక్టర్ కేటగిరిలో చేరిపోయాడు. అంతే కాకుండా గతేడాది బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌తో కలిసి ‘జవాన్’ సినిమా చేసిన తర్వాత బాలీవుడ్‌లో కూడా అట్లీకి విపరీతమైన పాపులారిటీ పెరిగిపోయింది. దీంతో అక్కడ కూడా స్టార్లు.. అట్లీతో కలిసి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమాను తెరకెక్కించే ఛాన్స్ అట్లీ చేతికి వచ్చిందని సమచారం. ఆ మల్టీ స్టారర్‌లో ఒక హీరో ఉలగనయగన్ కమల్ హాసన్ అయితే.. మరొక హీరో బాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో సల్మాన్ ఖాన్ అని ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Also Read: అప్పుడలా ఇప్పుడలా.. ప్రభాస్‌ విషయంలో ప్లేట్ మార్చిన బాలీవుడ్ నటుడు

Advertisement

భారీ బడ్జెట్‌తో ప్లాన్

కమల్ హాసన్, అట్లీ, సల్మాన్ ఖాన్ కాంబినేషన్ అనగానే మూవీ లవర్స్ అందరిలో ఆసక్తి మొదలయ్యింది. ఇక ఈ ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గురించి విన్న ప్రేక్షకులు ఇప్పటికే దీని గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు. పైగా ఇప్పటినుండే దీనిపై భారీ అంచనాలు కూడా పెంచేసుకుంటున్నారు. కమల్ హాసన్, సల్మాన్ ఖాన్ కాంబినేషన్ అంటే కచ్చితంగా భారీ అంచనాలు ఉంటాయి కాబట్టి బడ్జెట్ కూడా భారీగానే కేటాయించాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ఈ మూవీకి కనీసం రూ.1000 కోట్ల బడ్జెట్ అయినా ఉంటే బాగుంటుందనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. ఇంత బడ్జెట్ కేటాయించినా కూడా అసలు ఈ సినిమా ఏ జోనర్‌కు చెందింది అనే విషయం మాత్రం ఇంకా బయటికి రాలేదు.

దాని తర్వాతే

ప్రస్తుతం సల్మాన్ ఖాన్.. మరొక తమిళ స్టార్ డైరెక్టర్ అయిన మురుగదాస్‌తో ప్రాజెక్ట్ ఓకే చేశాడు. ఆ సినిమా షూటింగ్‌లోనే బిజీగా గడిపేస్తున్నాడు. మురుగదాస్, సల్మాన్ ఖాన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాకు ‘సికిందర్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక ఈ మూవీ తర్వాత సల్మాన్ ఖాన్ చేయనున్న ప్రాజెక్ట్స్‌పై పూర్తిస్థాయిలో క్లారిటీ లేదు. దీంతో ‘సికిందర్’ తర్వాత వెంటనే అట్లీతో చేసే ప్రాజెక్ట్‌పై సల్మాన్ ఫోకస్ చేయనున్నాడా అనే డౌట్లు మొదలయ్యాయి. అలా అయితే ఈ సినిమా 2025లోనే మొదలయ్యే అవకాశం ఉంది. కమల్ హాసన్ కూడా ఇటీవల మణిరత్నంతో చేస్తున్న ‘థగ్ లైఫ్’ చిత్రానికి గుమ్మడికాయ కొట్టేశారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×