BigTV English

Pawan Kalyan : దేవాలయాలకు అసలైన అర్థం ఇదే.. ఇస్రో మాజీ చీఫ్ వీడియోపై పవన్ ట్వీట్

Pawan Kalyan : దేవాలయాలకు అసలైన అర్థం ఇదే.. ఇస్రో మాజీ చీఫ్ వీడియోపై పవన్ ట్వీట్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆధ్యాత్మికత గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. దేవాలయాలు సాంస్కృతిక కేంద్రాలు అని అన్నారు. సైన్స్, ఆధ్యాత్మికతను కలిస్తే అదే దేవాలయాలని, అవే సాంస్కృతిక వారసత్వం అని చెప్పుకొచ్చారు.ఇస్రో మాజీ ఛైర్మన్ సోమ్‌నాథ్ వీడియోను ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.


మన సంస్కృతి, చరిత్ర సరిహద్దులను దాటిపోవాలని, దేవాలయాలు ఖగోళ శాస్త్రం, గణిత శాస్త్రాల మధ్య సంబంధానికి స్పూర్తిదాయక ఉదాహరణలుగా నిలుస్తాయన్నారు. ఈ ప్రదేశాల ఆధ్యాత్మికత ప్రాముఖ్యత మన చుట్టూ ఉన్న ప్రపంచానికి మనలను అనుసంధానించడమేనన్నారు. అంతేకాకుండా వాటి గోడల్లోనూ జ్ఞానాన్ని కలిగి ఉంటుందన్నారు.

తరతరాలుగా దేవాలయాలను సాంస్కృతిక కేంద్రాలుగా విరాజిల్లేందుకు మార్గం సుగమం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సంస్కృతి, విజ్ఞానం కోసం ప్రజలు అభ్యాసం చేయాలని సూచించారు. జనం సమాజ కార్యకలాపాలలో నిమగ్నమవ్వడం ద్వారా, శాస్త్రం, ఆధ్యాత్మిక రంగాలను ఏకీకృతం చేయొచ్చన్నారు.


also read : Naga Babu : గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. మూసీ భాదితులకు డబుల్ బెడ్ రూమ్స్

తద్వారా సంప్రదాయం, వారసత్వం ఆవిష్కరణల మధ్య అంతరాన్ని తగ్గించొచ్చన్నారు. ఫలితంగా మన సమాజాన్ని నిర్మించడంలో వాటి ప్రాముఖ్యతను పునరుద్ధరించవచ్చవని అభిప్రాయపడ్డారు. మరోవైపు భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చేలా ఈ శాశ్వతమైన సంపదలను పెంపొందించుకుందామని పిలుపునిచ్చారు.

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×