
Kamal Haasan Mohan Lal:విక్రమ్ సినిమా సక్సెస్ మీదున్నారు లోకనాయకుడు కమల్‌హాసన్. ఈ సినిమా ఇచ్చిన ఎనర్జీతో హ్యాపీగా ఇండియన్2 పనులు కంప్లీట్ చేస్తున్నారు. అంతే కాదు, తిరిగి ఇచ్చేయాలి డూడ్.. లేకుంటే లావైపోతాం అనే సిద్ధాంతానికి మరింత జాగ్రత్తగా స్టిక్ ఆన్ అవుతున్నారు. అందుకే మెగాస్టార్ మూవీలో యాక్ట్ చేయడానికి మాటిచ్చేశారు. మెగాస్టార్ అనగానే చిరంజీవి అనుకునేరు. కాదండోయ్.. మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ గురించి మనం మాట్లాడుకుంటున్నది. మలయాళంలో మోహన్‌లాల్ మలైకోట్టై వాలిబన్ అనే చిత్రంలో యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో కీ రోల్ చేయమని కమల్‌హాసన్‌ని అప్రోచ్ అయ్యారట. వెంటనే కమల్‌హాసన్ ఓకే చెప్పేశారట. దాదాపు 13 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో సినిమా వస్తోంది. ఉన్నైపోల్ ఒరువన్ అనే సినిమాలో కలిసి నటించారు వీరిద్దరూ. ఆ సినిమా తెలుగులో ఈనాడు పేరుతో రిలీజ్ అయింది.
అప్పట్లో థ్రిల్లర్ మూవీ లవర్స్ ని అమితంగా ఆకట్టుకుంది ఉన్నైపోల్ ఒరువన్. ఇప్పుడు మలైకోట్టై వాలిబన్‌లోనూ కమల్‌కి ట్రెమండస్ రోల్ రాశారట డైరక్టర్. కథ వినగానే నచ్చి చేస్తానని అన్నారట కమల్. రీసెంట్‌గా మలయాళం ఇండస్ట్రీతో మంచి ర్యాపో మెయింటెయిన్ చేస్తున్నారు కమల్‌హాసన్. ఆయన విక్రమ్ సినిమాలోనూ ఫాహద్ ఫాజిల్‌కి మంచి రోల్ ఇచ్చారు.
కమల్ విక్రమ్ సినిమాకు కూడా సీక్వెల్ సిద్ధం కావాల్సి ఉంది. ప్రస్తుతం విజయ్ సినిమా పనుల్లో ఉన్నారు డైరక్టర్ లోకేష్ కనగరాజ్. అది పూర్తి కాగానే విక్రమ్ సీక్వెల్ పనుల్లో ఇన్వాల్వ్ అవుతారు లోకేష్. అప్పటికి కమల్‌హాసన్ ఇండియన్2, మోహన్‌లాల్ మలైకోట్టై వాలిబన్ సినిమాలను పూర్తి చేస్తారు.