BigTV English

Coolie: కూలీలో మరో సూపర్ స్టార్.. పోతారు.. మొత్తం పోతారు

Coolie: కూలీలో మరో సూపర్ స్టార్.. పోతారు.. మొత్తం పోతారు

Coolie: సూపర్ స్టార్ రజినీకాంత్ వయసుతో సంబంధం లేకుండా కుర్రకారుకు పోటీ ఇస్తున్నాడు. వరుస సినిమాలను లైన్లో పెట్టి.. కుర్ర డైరెక్టర్లతో హిట్స్ కొడుతున్నాడు. ప్రస్తుతం రజినీ నటిస్తున్న చిత్రాల్లో కూలీ ఒకటి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో లోకేష్ స్టార్ క్యాస్టింగ్ తో పిచ్చేక్కిన్చే పనిలో ఉన్నాడు.


ఇప్పటికే కూలీ కోసం అక్కినేని నాగార్జున విలన్ గా దింపుతున్నారని వార్తలు వినిపించాయి. ఇదే నిజమా.. కాదా..? అని క్లారిటీ రాలేదు. ఈలోపే మరో సూపర్ స్టార్.. రజినీకాంత్  కోసం రంగంలో దిగడానికి కోలీవుడ్ కోడై కూస్తోంది. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర.. కూలీ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడని వార్తలు గుప్పుమన్నాయి. ఈ సినిమాకు ఉపేంద్ర పాత్ర ఎంతో కీలకమని సమాచారం.

ఉపేంద్రకు రజినీ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  కబ్జా సినిమా సమయంలో ఒక రిపోర్టర్ శ్రీయను మీరు ఇద్దరు సూపర్ స్టార్లు అయిన రజినీకాంత్, ఉపేంద్రలతో నటించారు.. ఎలా అనిపిస్తుంది మీకు అని  అడిగిన ప్రశ్నకు శ్రీయ సమాధానం చెప్పేలోపే    ఉపేంద్ర మైక్ తీసుకొని.. మనందరికి ఉన్నది ఒకరే సూపర్ స్టార్.. అది రజినీకాంత్ అని చెప్పాడు.  ఆయన అంటే అంత ఇష్టం. అలాంటిది  ఆయన సినిమాలో నటించే అవకాశం వస్తే ఉప్పీ వదులుకుంటాడా.. ? లోకేష్ కథ చెప్పగానే ఓకే చేసినట్లు సమాచారం.


త్వరలోనే మేకర్స్ ఉపేంద్రను కూలీ సినిమాలోకి ఆహ్వానించనున్నారు. అయితే ముందు నాగ్ కు అనుకున్న పాత్రకే ఉపేంద్రను తీసుకున్నారా.. ? లేక ఇది వేరే పాత్ర అనేది  తెలియాల్సి ఉంది. ఏదిఏమైనా రజినీకాంత్ సినిమానే హైప్ అనుకుంటే.. ఇందులో మరో సూపర్ స్టార్  కూడా యాడ్  అయితే ఇక మాములు హైప్ కాదు. పోతారు.. మొత్తం పోతారు అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×