E-Paper
Advertisement

Karate Kalyani: అన్వేష్ పై మరోసారి ఫిర్యాదు చేసిన కరాటే కళ్యాణి.. ఈసారి గట్టి దెబ్బే!

Karate Kalyani: అన్వేష్ పై మరోసారి ఫిర్యాదు చేసిన కరాటే కళ్యాణి.. ఈసారి గట్టి దెబ్బే!
Advertisement

Karate Kalyani:నా అన్వేషణ అన్వేష్ (Naa Anveshana Anvesh) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు 90 లక్షలకు పైగా ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ఇతడు.. ఇప్పుడు 70 లక్షల ఫాలవర్స్ ను మాత్రమే కలిగి ఉన్నారు. దీనికి కారణం ఆయన నోటి దూల అని చెప్పాలి. ముఖ్యంగా టాలీవుడ్ లో నటుడు శివాజీ (Sivaji ) హీరోయిన్స్ వస్త్రధారణ గురించి చేసిన కామెంట్లకు తనదైన రీతిలో స్పందించి, అందరి ఆగ్రహానికి గురయ్యాడు. అక్కడితో ఆగకుండా ప్రముఖ ప్రవచనకర్త గరికపాటిని ఇందులోకి లాగుతూ సగటు తెలుగువాడు కూడా వినలేని అసభ్యకర పదజాలంతో రెచ్చిపోయాడు.

అంతేకాదు హిందూ దేవీ దేవత మూర్తులైన సీతా, ద్రౌపదిపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో మండిపడ్డ ప్రజలు, నెటిజన్స్ వెంటనే ఇతడిని అన్ ఫాలో చేయాలి అని పిలుపునిచ్చారు. దీంతో సుమారుగా 20 లక్షల మంది సబ్స్క్రైబర్లు అన్ ఫాలో కొట్టేశారు. కనీసం ఇక్కడితోనైనా అతడు దిగి వస్తాడని, క్షమాపణలు చెబుతాడని అందరూ అనుకున్నారు. కానీ అన్వేష్ మాత్రం అంతకుమించి వీడియోలు రిలీజ్ చేస్తూ ఏకంగా ఇండియాని కూడా దూషిస్తూ కామెంట్లు చేయడం సంచలనంగా మారింది.

అన్వేష్ పై కరాటే కళ్యాణి ఫిర్యాదు..

Advertisement

దీంతో రంగంలోకి దిగిన కరాటే కళ్యాణి హిందూ మతాన్ని కించపరచడమే కాకుండా దేవీ దేవత మూర్తులైన ద్రౌపది, సీతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వెంటనే ఇతడిని అరెస్టు చేయాలి అని, ఆమె హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇకపోతే రంగంలోకి దిగిన పోలీసులు ఇతడి ఇంస్టాగ్రామ్ యూజర్ ఐడి డీటెయిల్స్ ఇవ్వాలి అని, ఇంస్టాగ్రామ్ కు లేఖ కూడా రాశారు. అక్కడి నుంచి సమాధానం వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఇప్పుడు మరొకసారి అన్వేష్ విడుదల చేసిన వీడియోకి మండిపడ్డ కరాటే కళ్యాణి మళ్లీ అతనిపై ఫిర్యాదు చేసింది.

also read:Taapsee Pannu: పీఆర్ టీమ్‌పై తాప్సీ అనుచిత వ్యాఖ్యలు.. మొత్తం దండగా అంటూ!

అన్వేష్ పై మళ్లీ ఫిర్యాదు చేసిన కరాటే కళ్యాణి..

Advertisement

అన్వేష్ ఇండియా పాస్ పోర్ట్ దరిద్ర గొట్టు పాస్ పోర్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కరాటే కళ్యాణి మరోసారి హైదరాబాదులోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అన్వేష్ పై ఫిర్యాదు చేసింది . అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. “భారతదేశంలో పౌరసత్వం ఎంత ముఖ్యమో.. పాస్పోర్ట్ కూడా అంతే ముఖ్యం. ఈ పాస్పోర్ట్ కి పోలీస్ వెరిఫికేషన్ కూడా జరుగుతూ ఉంటుంది. అంత ముఖ్యమైంది. ఇందులో మూడు సింహాలతో రాజముద్ర ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరూ భద్రంగా బీరువాలో దాచిపెడతారు. అలాంటి మన భారత దేశ పాస్పోర్టును దరిద్రపుగొట్టు ఇండియన్ పాస్పోర్టు అంటూ అభివర్ణించాడు. అలాంటి వాడిపై తగిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇండియన్స్ అందరిని కూడా వాడు దరిద్రపుగొట్టు అంటూ కామెంట్లు చేశారు ” అంటూ ఫైర్ అయ్యింది కరాటే కళ్యాణి. ఇక కరాటే కళ్యాణి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×