E-Paper
Advertisement

Bhaje Vaayu Vegam OTT: ఓటీటీలోకి కార్తికేయ ‘భజే వాయు వేగం’.. ఎప్పుడు, ఎక్కడంటే..?

Bhaje Vaayu Vegam OTT: ఓటీటీలోకి కార్తికేయ ‘భజే వాయు వేగం’.. ఎప్పుడు, ఎక్కడంటే..?
Advertisement

Hero Krthikeya’s Bhaje Vaayu Vegam OTT Release Date: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ తన మొదటి మూవీ ‘ఆర్ఎక్స్ 100’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఖాతా తెరిచాడు. లవ్ అండ్ రొమాంటిక్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసును షేక్ చేసింది. ఫుల్ రొమాంటిక్ సీన్లతో హోరెత్తించింది. ఇక ఈ మూవీతో యూత్‌తో మంచి క్రేజ్ అందుకున్న కార్తికేయ ఆ తర్వాత పలు సినిమాలు చేశాడు. కానీ ఏ మూవీ కూడా అతడికి మంచి స్టార్డమ్ అందించలేకపోయింది. చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.

ఆ తర్వాత హీరో నుంచి విలన్ పాత్రకు షిఫ్ట్ అయ్యాడు. అయితే విలన్ పాత్రలో మంచి మార్కులే కొట్టేశాడు. కానీ అలా విలన్ పాత్రలు చేసుకుంటూ పోతే హీరోగా కెరీర్‌ ఉండదని భావించిన కార్తికేయ మళ్లీ హీరోగా సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. గతేడాది ‘బెదురులంక 2012’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ మూవీ కూడా పెద్దగా ఎక్కలేదు. ఆడియన్స్ దీన్ని కూడా రిజెక్ట్ చేశారు.

Advertisement

దీంతో ఈ సారి ఎలాగైన హిట్టు కొట్టాలనే కాన్ఫిడెన్స్‌తో ‘భజే వాయు వేగం’ మూవీ చేశాడు. ఇందులో కార్తికేయకు జోడీగా ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా నటించింది. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఫస్ట్ నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. డిఫరెంట్ పోస్టర్స్, టీజర్, ఆసక్తి రేకెత్తించే ట్రైలర్‌తో సినిమాపై హైప్ బాగా క్రియేట్ అయింది. ఇక భారీ అంచనాలతో మే 31న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

Also Read: కార్తికేయ ‘భజే వాయు వేగం’ ట్రైలర్ సూపరో సుపర్

Advertisement

రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచే సినిమా మంచి పాజిటివ్ టాక్‌ను అందుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ చాలా బాగున్నాయని మూవీ చూసిన ప్రేక్షకులు వారి అభిప్రాయాలు తెలిపారు. అంతేకాకుండా సినిమాలో క్లైమాక్స్ సన్నివేశాలు మరింతగా ఆకట్టుకున్నాయని చెప్పుకొచ్చారు. దీంతో ఈ మూవీ బాక్సాఫీసు వద్ద మంచి టాక్‌తో అదిరిపోయే కలెక్షన్లను రాబట్టింది. అయితే ఈ మూవీ థియేటర్‌లో రన్ అవుతుండగానే.. ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి ఓ వార్త బయటకొచ్చింది.

ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ మంచి ధరకు కొనుక్కున్నట్లు తెలుస్తోంది. అందువల్ల ఇరువురి ఒప్పందం ప్రకారం.. ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన నెల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనిబట్టి చూస్తే ఈ మూవీ ఈ నెల అంటే జూన్ ఆఖరి వారంలో కానీ.. లేదా జూలై మొదటి వారంలో కానీ ఓటీటీలో స్ట్రీమ్ అయ్యే ఛాన్స్ ఉంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×