E-Paper
Advertisement

Kasthuri Shankar: మగాళ్లను రాక్షసుల్లా పోల్చిన సీరియల్ నటి కస్తూరి శంకర్… చిన్మయి పోస్ట్‌కు ఘాటు రిప్లే

Kasthuri Shankar: మగాళ్లను రాక్షసుల్లా పోల్చిన సీరియల్ నటి కస్తూరి శంకర్… చిన్మయి పోస్ట్‌కు ఘాటు రిప్లే
Advertisement

Kasthuri Shankar: నవ మన్మధుడు కింగ్ నాగార్జున (Nagarjuna) నటించిన ‘అన్నమయ్య’ సినిమాలో రమ్యకృష్ణతో పాటు మరో హీరోయిన్ గా నటించి తన నటనతో అందరినీ ఆకర్షించింది కస్తూరి శంకర్ (Kasthuri Shankar). ఆ తర్వాత పలు చిత్రాలలో నటించిన ఈమె.. ఇటీవల గృహలక్ష్మి సీరియల్ తో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. అటు వెండితెరపై సినిమాలు చేస్తూ.. ఇటు బుల్లితెరపై సీరియల్స్ తో మరింత ఆకట్టుకుంటున్న కస్తూరి శంకర్ ఎప్పటికప్పుడు పలు వివాదాలలో ఇరుక్కుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తమిళనాడులో నివసిస్తున్న తెలుగు బ్రాహ్మణులపై కీలక వ్యాఖ్యలు చేసి కొద్ది రోజులు జైలు జీవితం కూడా గడిపింది . అంతేకాదు పలు సందర్భాలలో విమర్శలకు దారి తీసేలా కామెంట్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే అలాంటి ఈమె.. ఇప్పుడు మగాళ్ళను రాక్షసుల్లా పోలుస్తూ.. ప్రముఖ నటి చిన్మయి ట్వీట్ కి సమాధానంగా పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ అవుతుంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

కస్తూరి ట్వీట్.. 

అసలు విషయంలోకెళితే.. డెహ్రాడూన్ కి చెందిన కరంజిత్ సింగ్ అనే 25 ఏళ్ల యువకుడు ఒంటరిగా నడుస్తున్న మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ దృశ్యాలు సిసిటీవీ ఫుటేజీలో క్యాప్చర్ కావడంతో గమనించిన పోలీసులు కరంజిత్ సింగ్ ను అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో దీనిని పోస్ట్ చేస్తూ చిన్మయి ట్వీట్ చేసింది.. “ఒకవేళ ఈ వ్యక్తి ఇప్పటికిప్పుడు ఆత్మహత్య చేసుకుంటే… అక్కడ ఆ టైంలో నడుస్తున్న ఆ అమ్మాయిదే అంతా తప్పు” అంటూ సెటైరికల్ ట్వీట్ వేసింది. కేరళలో బస్సు ఘటన నేపథ్యంలో మహిళదే తప్పు అన్నట్టు కామెంట్స్ వినిపిస్తున్న నేపథ్యంలో… చిన్మయి ఈ ట్వీట్ వేయడంపై సర్వత్ర చర్చ జరుగుతుంది. ఈ టైంలో.. చిన్మయి ట్వీట్ రిప్లేగా.. ఈ క్రమంలో విశ్వంలో ఉన్న పురుషులు కాదు.. రాక్షసులు అంటూ ట్వీట్ వేసింది.

మనుషుల్ని రాక్షసులతో పోల్చిన కస్తూరి..

Advertisement

కస్తూరి శంకర్ తన ఎక్స్ ఖాతా ద్వారా.. ఇలాంటి హృదయ విధారక పోస్టు నాకు బాధను మాత్రమే.. కాదు కోపాన్ని కూడా కలిగించింది. ఈ అసంబద్ధ పోలిక ఏమిటో అర్థం కావడం లేదు. ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా అతనిని వదిలిపెట్టరు. ముఖ్యంగా ఈ విశ్వంలో పురుషులు లేరు.. రాక్షసులు మాత్రమే ఉన్నారు. అలాగే స్త్రీలు లేరు.. బాధితులు మాత్రమే ఉన్నారు అనేది మరింత ఆందోళన కలిగిస్తోంది” అంటూ కస్తూరి శంకర్ పోస్ట్ పెట్టింది. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

అసలేం జరిగిందంటే?

స్త్రీవాదిగా పేరు తెచ్చుకున్న చిన్మయి ఇలాంటి పోస్ట్ పెట్టడానికి గల కారణం ఏమిటి అనే విషయానికొస్తే.. ఇటీవల కేరళలో ఒక బస్సులో దీపక్ అనే వ్యక్తి..ఒక మహిళను వేధించాడని.. సదరు మహిళ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే తన ప్రమేయం లేకపోయినా.. తప్పుడు ఆరోపణలు ఎదుర్కొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు డెహ్రడూన్ లో అమ్మాయి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిచిన వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకుంటే… అందరూ ఆ యువతిదే తప్పు అని అంటారు అంటూ చిన్మయి సెటైరికల్ ట్వీట్ చేయగా.. దానికి నటి కస్తూరి రిప్లై ఇచ్చింది.

Advertisement

అయితే ఆ ట్వీట్లో చిన్మయి కేరళ బస్సు గురించి గానీ, ఆ సంఘటన గురించి గానీ ,బాధితుడు దీపక్ గురించి కానీ ప్రస్తావించకపోయినా.. డెహ్రాడూన్ సంఘటనను కేరళ బస్సు సంఘటనతో పోల్చాలని ఆమె చూస్తున్నట్లు అర్థం అవుతోంది అంటూ సదరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పురుషులు అందరూ రాక్షసులు… ఆడవాళ్లు అందరూ బాధితులు అనే విధంగా కాస్త సెటైరికల్ పోస్ట్ పెట్టింది.

also read: Venkatesh: దృశ్యం3 నుంచి బిగ్ అప్డేట్.. స్పీడ్ మీదున్న వెంకీ మామ!

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×