BigTV English

Katrina Kaif: అలాంటి అనారోగ్య సమస్యతో బాధపడతోందా.. వీడియో వైరల్..!

Katrina Kaif: అలాంటి అనారోగ్య సమస్యతో బాధపడతోందా.. వీడియో వైరల్..!

Katrina Kaif.. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గ్లామర్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న కత్రినా కైఫ్ (Katrina Kaif) సడన్ గా అలా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. 2024 దసరా నవరాత్రి వేడుకల వేళ ముంబై విమానాశ్రయంలో తలుక్కున మెరిసి అందరిని అలరించింది. అందమైన చీరకట్టుతో అభిమానులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలో ఉండగా మరొకవైపు తన చేతికి ధరించిన బ్లాక్ గ్లూకోజ్ ప్యాచ్ ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేయడమే కాదు పలు అనుమానాలకు దారితీస్తోంది. దీంతో కత్రినా కైఫ్ ఎందుకు అది ధరించింది అంటూ అభిమానులు తెగ ప్రశ్నలు గుప్పిస్తున్నారు. కత్రినా బ్లాక్ ప్యాచ్ ధరించిన ఫోటోలు, వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.


బ్లాక్ ప్యాచ్ ధరించి అనుమానాలకు దారి తీసిన కత్రినా…

ఇకపోతే ఇది చూసిన కొంతమంది నెటిజన్స్ అది డయాబెటిక్ అని, డయాబెటిక్ ప్యాచ్ అలాగే ఉంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే కత్రినా కైఫ్ ఎయిర్ పోర్టులో గ్లామర్ కంటే కూడా ఆమె చేతికి ధరించిన ప్యాచే ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అవుతోంది. ఒకవైపు నెటిజన్లు చాలా అందంగా ఉన్నావంటూ కామెంట్లు చేస్తూనే.. మరి కొంతమంది అసలు మీ చేతికి ధరించిన ఆ నల్లటి ప్యాచ్ ఏంటి అంటూ కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం. దీంతో అసలు కత్రినాకు ఏమైంది? ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిందా? ఏంటి? అని కూడా చర్చించుకుంటున్నారు.


బ్లాక్ ప్యాచ్ వేసుకోవడానికి గల కారణం..

తాజాగా నివేదిక ప్రకారం కత్రినాకైఫ్ చేతి పై ఉన్న బ్లాక్ ప్యాచ్ రక్తంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ మానిటరింగ్ చేసే డయాబెటిస్ ప్యాచ్ కావచ్చు. సాధారణంగా మధుమేహం ఉన్న వ్యక్తులు మాత్రమే ఇలాంటి ప్యాచ్ ధరిస్తారని కూడా చెబుతున్నారు. వాస్తవానికి కత్రినా మధుమేహంతో బాధపడుతుంది అనడానికి అధికారిక నిర్ధారణ ఏదీ లేదు. కానీ కొంతమంది అభిమానులు ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు. అయితే మరి కొంతమంది మాత్రం అది ఫిట్నెస్ ట్రాకర్ అని కూడా చెబుతున్నారు. ఎందుకంటే ఫిట్నెస్ విషయంలో ఈమె చాలా కచ్చితంగా ఉంటారని అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కత్రినా బ్లాక్ ప్యాచ్ గురించి ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది.

ఫిట్నెస్ ట్రాకర్ ధరించిందా..

అయితే తాజాగా కత్రినాను ఎయిర్ పోర్ట్ లో చూసిన అభిమానులు ఆమెలో ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపెట్టలేకపోయారు. దీంతో అది కేవలం ఫిట్నెస్ ట్రాకర్ మాత్రమే అని నెటిజన్స్ చెప్పేస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలని , తనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరకూడదని అభిమానులు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే కత్రినా కైఫ్ తాజాగా ఉత్సాహంగా కనిపించింది. అభిమానులకు అభివాదం చేస్తూ ఫోటోలకు కూడా ఫోజులిస్తూ.. అభిమానులతో సెల్ఫీలు కూడా దిగింది. ముఖ్యంగా ప్యాచ్ సంగతి కాస్త పక్కన పెడితే, చీర కట్టులో అందమైన జువెలరీతో అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే విక్కీ కౌశల్ ను వివాహం చేసుకున్న తర్వాత గర్భం విషయంలో వస్తున్న వార్తలపై కూడా క్లారిటీ ఇచ్చింది.

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Elite A_Z (@elitea_z)

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×