BigTV English

Vidhya Balan: ఆనాటి బాధ వర్ణనాతీతం..ఆఖరికి బట్టలు కూడా..!

Vidhya Balan: ఆనాటి బాధ వర్ణనాతీతం..ఆఖరికి బట్టలు కూడా..!

Vidhya Balan.. ఎవరైనా సరే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత హీరోగా లేదా హీరోయిన్ గా సక్సెస్ అవ్వాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా అవకాశం వచ్చిన తర్వాత ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కూడా తెలిసి ఉండాలి. అప్పుడే హీరోయిన్ గా ఇండస్ట్రీలో చలామణి అవుతారు. అలా ఇండస్ట్రీలోకి వచ్చి ప్రస్తుతం స్టార్స్ గా మారి పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ (Vidhya Balan)కూడా ఒకరు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న ఈమె కహాని అనే సినిమాతో 2012లో మంచి విజయం సొంతం చేసుకుంది.


రూ.15 కోట్ల బడ్జెట్ రూ.79 కోట్ల లాభం..

కోలకత్తా లో మెట్రోలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. రూ.15 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ .79 కోట్లు రాబట్టి రికార్డు సృష్టించింది. ముఖ్యంగా ఈ సినిమా షూటింగ్స్ సమయంలో విద్యాబాలన్ ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. విద్యాబాలన్ మాట్లాడుతూ.. కహాని సినిమా షూటింగ్ సమయంలో వ్యానిటీ వ్యాన్ బడ్జెట్ లేకపోవడం వల్ల సాధ్యం కాలేదు. అందుకే రోడ్డు పక్కన మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాద్దీన్ పరాజయం తర్వాత కహాని సినిమా ఆఫర్ లభించింది.


కారులో బట్టలు మార్చుకోవాల్సి వచ్చింది..

ముఖ్యంగా ఒక్కసారి సినిమా ఒప్పుకుంటే చేసేస్తాను ముందుగా సుజయ్ ఘోష్ తో సినిమా చేద్దాం అని చెప్పారు. దీని గురించి ఏమీ తెలియదు మాకు. ఎలాంటి స్తోమత కూడా లేదు. అంత పెద్ద బడ్జెట్ కూడా లేదు. క్యారెక్టర్ కి తగ్గట్టుగా బట్టలు మార్చుకోవాల్సి వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఇన్నోవా కార్ కిటికీకి నల్లగుడ్డ చుట్టి ఆ కారులోనే బట్టలు మార్చుకున్నాను. ఆ పరిస్థితులు వర్ణనాతీతం అంటూ చెప్పుకొచ్చింది విద్యాబాలన్. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎంత కష్టపడ్డామో అంతే ఎంజాయ్ చేసాము. ఈ సినిమా కోసం నాతో పాటు చాలామంది కష్టపడ్డారు అంటూ తెలిపింది విద్యాబాలన్. ఇక మహిళా ప్రధాన పాత్రలు చేయడానికి ప్రస్తుతం ఆసక్తి చూపిస్తోన్న ఈమె.. రకరకాల రీల్స్, వీడియోలు చేస్తూ అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తుంది. ఏదేమైనా విద్యాబాలన్ కహాని సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఇబ్బందులను, ఎదుర్కొన్న పరిస్థితులను చెప్పుకొచ్చింది.

విద్యాబాలన్ కెరియర్..

విద్యాబాలన్ కెరియర్ విషయానికి వస్తే బెంగాలీ, హిందీ, మళయాల చిత్రాలలో నటించిన ఈమె పలు సీరియల్స్ లో, మ్యూజిక్ వీడియోలలో, సినిమాలలో కూడా నటించి పేరు సొంతం చేసుకుంది.. జనవరి ఒకటి కేరళ లో తండ్రి పిఆర్ బాలయ్య పెళ్లి సరస్వతి బాలన్ లకు జన్మించింది. చిన్నతనంలోనే మాధురి దీక్షిత్ నటనతో ప్రేరణ పొంది..సెయింట్ జేవియర్స్ కాలేజీ లో సోషియాలజీలో డిగ్రీ పూర్తి చేసిన ఈమె ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×