BigTV English

Prakash Raj on Pawan Kalyan: ‘అర్థమైంది రాజా’.. పవన్‌పై అందుకేనా సెటైర్లు.. #JustAsking

Prakash Raj on Pawan Kalyan: ‘అర్థమైంది రాజా’.. పవన్‌పై అందుకేనా సెటైర్లు.. #JustAsking

జస్ట్ ఆస్కింగ్.. అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించే ప్రకాష్ రాజ్ (Prakash Raj) ఎట్టకేలకు బయటపడ్డారు. ‘సనాతన’ అనే పదాన్ని ఆయన ఎందుకు హేట్ చేస్తున్నారో ఇప్పుడు అర్థమవుతోందంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఇందుకు కారణం.. ప్రకాష్ రాజ్ షేర్ చేసిన ఫొటోనే.


చెన్నైలో శనివారం పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌తో నటుడు ప్రకాష్ రాజ్ వేదికను పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ఉదయనిధి స్టాలిన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. పనిలో పనిగా ఆంధ్రప్రదేశ్ డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై కూడా సెటైర్లు వేశారు. ఇక్కడ ఉదయనిధి స్టాలిన్ సమానత్వం గురించి మాట్లాడుతుంటే.. పవన్ మాత్రం ఏదోదో మాట్లాడుతున్నారంటూ కౌంటర్లు వేశారు.

పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారని, తాను మాత్రం బలహీనవర్గాల తరపునే మాట్లాడతానని పేర్కొన్నారు. వాళ్ల తరపున ప్రశ్నలు సంధిస్తానని అన్నారు. తన ప్రశ్నలకు వాళ్లు భయపడుతున్నారని పేర్కొన్నారు. అక్కడివరకు బాగానే ఉంది. కానీ, ఆ తర్వాత అసలు సీను మొదలైంది. ప్రసంగం పూర్తయిన తర్వాత ప్రకాష్ రాజ్.. పక్కనే ఉన్న పెద్దాయనతో సరిగ్గానే మాట్లాడానా, బాగానే చెప్పానా.. అని అడిగారు. దీంతో ఆ పెద్దాయన కూడా సీఎం గురించి బాగా మాట్లాడాలని ప్రకాష్ రాజ్‌కు సలహా ఇచ్చారు. దీనికి ప్రకాష్ రాజ్ ఏం సమాధానం చెప్పలేదు. కానీ, ఆ వీడియో మాత్రం వైరల్‌గా మారింది. డబ్బులిస్తే ప్రకాష్ రాజ్ ఎవరి తరపునైనా మాట్లాడతాడని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.


అయితే, వారి మాటలు టీవీ చానెళ్లల్లో రికార్డు అయ్యాయి. ఆ వీడియోలు బయటకు రావడంతో ప్రకాష్ రాజ్‌పై నెటిజనులు సెటైర్లు వేస్తున్నారు. స్టాలిన్ మెప్పు కోసం సనాతన ధర్మంపై విమర్శలు ఎక్కువ పెట్టావా.. రాజా అంటూ ట్రోల్ చేస్తున్నారు. అందుకేనా ఆ రోజు స్టాలిన్ వ్యాఖ్యలు ‘జస్ట్ ఆస్కింగ్’ అని ప్రశ్నించలేకపోయావని అంటున్నారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి ప్రకాష్ రాజ్‌కు బాగానే సొమ్ములు అందుతున్నట్లున్నాయ్ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అర్థమైంది రాజా.. నీ ప్లాన్ అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. పవన్‌పై అందుకేనా సెటైర్లు.. #JustAsking అంటున్నారు.

అవకాశవాద రాజకీయాలు?

ప్రకాష్ రాజ్‌ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని కొందరు జనసైనికులు విమర్శిస్తున్నారు. ‘మా’ ఎన్నికలు జరుగుతున్నప్పుడు చిరంజీవి ఫ్యామిలీ మద్దతుతో బరిలోకి దిగారని, ఓటమి చవిచూడటంతో వారి అవసరం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారని అంటున్నారు. తిరుమల లడ్డు వివాదాన్ని హైలెట్ చేస్తూ.. పవన్ కళ్యాన్ సనాతన ధర్మంపై చేసిన కామెంట్స్‌పై ప్రకాష్ రాజ్ వరుసగా ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. ఇదే జనసైనికులను ఆగ్రహానికి గురిచేసింది. ధర్మాన్ని కాపాడుకోవడానికి పిలుపినిస్తే.. ప్రకాష్ రాజ్‌కు ఏంటి మంట అంటు కామెంట్లు కూడా వచ్చాయి. అయితే, ప్రకాష్ రాజ్ అవేవీ పట్టించుకోకుండా తన ట్వీట్ల వార్ కొనసాగిస్తూనే ఉన్నారు.

ప్రకాష్ రాజ్ మొదటి నుంచి బీజేపీ పార్టీకి యాంటీగా ఉంటున్నారనేది జగమెరిగిన సత్యం. ఇందుకు కారణాలు కూడా అనేకం. పవన్ కళ్యాణ్‌పై సెటైర్లకు కూడా కారణం కూడా అదే అని తెలుస్తోంది. కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్.. బీజేపీ మెప్పు కోసమే అలా చేస్తున్నారనేది ప్రకాష్ రాజ్ వర్గాల ఆరోపణ. ప్రకాష్ రాజ్ సనాతన ధర్మాన్ని విమర్శించడం లేదని, ధర్మం పేరుతో జనాలను చీల్చవద్దనే వాదన ఆయన వినిపిస్తున్నారని అంటున్నారు. ఏది ఏమైనా.. ప్రకాష్ రాజ్ స్టాలిన్‌‌ను పొగడటం.. ఆయనకు మద్దతు ఇవ్వడం వల్ల భవిష్యత్తులో ఏం మాట్లాడినా అది వారి వాయిస్‌గానే జనాలు పరిగణిస్తారు. మరి ప్రకాష్ రాజ్ మున్ముందు #JustAsking అంటారో… #JaiStalin అంటూ ఆ పార్టీ జెండా భుజాన్న వేసుకుంటారో చూడాలనేది జనాల మాట.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×