E-Paper
Advertisement

Keerthy Suresh: మొన్న జాన్వీ.. నేడు కీర్తి.. హీరోయిన్లందరికీ ఎన్టీఆరే కావాలంట..?

Keerthy Suresh: మొన్న జాన్వీ.. నేడు కీర్తి.. హీరోయిన్లందరికీ ఎన్టీఆరే కావాలంట..?
Advertisement

Keerthy Suresh: ఎన్టీఆర్.. ఎన్టీఆర్.. ఎన్టీఆర్.. ప్రస్తుతం హీరోయిన్లందరూ ఎన్టీఆర్ నామజపం చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ మొదటి సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి టాలీవుడ్ లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందా.. ? అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు అభిమానులు. కానీ, జాన్వీ మాత్రం.. ఎన్టీఆర్ తో నటించే ఛాన్స్ రావాలని దేవుడిని రోజు మొక్కుకొనేదాన్ని అని చెప్పుకొచ్చింది.

ఇక దేవర సినిమా మొదలైనప్పటినుంచి ఎన్టీఆర్ గురించి చెప్తూనే వస్తుంది. అతని మంచితనం, డ్యాన్స్.. ఇలా ఒకటని చెప్పలేం. దేవర సినిమా మీద కంటే ఎన్టీఆర్ పై అమ్మడు ఎలివేషన్స్ ఇంకా హైప్ ను తీసుకొస్తున్నాయి. ఇక ఇప్పుడ జాన్వీలానే కీర్తి సురేష్ మారింది. తాను కూడా ఎన్టీఆర్ తో నటించాలని ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చింది.

Advertisement

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి.. తాజాగా రఘు తాత అనే సినిమాతో ఈఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంద. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి తన మనసులోని మాటను బయటపెట్టింది.

“ఎన్టీఆర్ ను మొట్ట మొదటిసారి మహానటి ఆడియో లాంచ్ ఈవెంట్ లో చూసాను. ఎన్టీఆర్ తో కలిసి నటించాలని ఉంది. మా ఇద్దరి జంట తెరపై చూడడానికి ఎంతో బావుంటుంది. మహానటి సక్సెస్ తరువాత ఆయన మా టీమ్ అందరికి పార్టీ ఇచ్చారు. ఎంతో మంచి వ్యక్తి. ఎన్టీఆర్ ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటారు. ఎన్టీఆర్ తో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Advertisement

ఇక కీర్తి మాటలు విన్న నెటిజన్స్.. హీరోయిన్లందరికీ ఎన్టీఆరే కావాలంటే ఎలా.. ? అని కొందరు. ఎన్టీఆర్ అంటే అలా ఉంటుంది. హీరోయిన్లకు కంఫర్టబుల్ హీరో అని కామెంట్స్ పెడుతున్నారు. మరి కీర్తి కోరికను ఎన్టీఆర్ తీరుస్తాడో లేదో చూడాలి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×