E-Paper
Advertisement

Keerthi Suresh : పెళ్లి పీటలు ఎక్కబోతున్న కీర్తి సురేష్.. వరుడు బ్యాగ్రౌండ్ ఇదే..?

Keerthi Suresh : పెళ్లి పీటలు ఎక్కబోతున్న కీర్తి సురేష్.. వరుడు బ్యాగ్రౌండ్ ఇదే..?
Advertisement

Keerthi Suresh : టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. మలయాళ హీరోయిన్ అయిన ఈమె తెలుగులో వరుస సినిమా అవకాశాలు అందుకుంటుంది. ఒక్కో సినిమాతో తన తన టాలెంట్ తో బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి స్టార్స్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక మహానటి సినిమా ఆమె పేరును గోల్డెన్ అక్షరాలతో లిఖించుకొనేలా చేసింది. ఆ సినిమా అయితే మంచి పేరును అందించింది. కానీ ఆ తర్వాత నటించిన సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. దాంతో బాలీవుడ్ లో తన అదృష్టంను పరీక్షించుకోవాలని ట్రై చేస్తుంది. ఇక ఈ అమ్మడు పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తుంది. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది. అసలు విషయమేంటో ఒకసారి తెలుసుకుందాం..

కీర్తి సురేష్ తన బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకోబోతుందని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలకు ఎప్పటికప్పుడు చెక్ పెడుతూనే వస్తుంది. తాజాగా మరోసారి ఆమె డిసెంబర్ లో పెళ్లి చేసుకోబోతుందని వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతుంది. డిసెంబర్‌లో పెళ్లి చేసుకోబోతున్నారని, గోవాలో పెళ్లి జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. ప్రముఖ నిర్మాత, నటుడు సురేష్ – నటి మేనక దంపతుల చిన్న కుమార్తె కీర్తి సురేష్. కీర్తి సురేష్ హీరోయిన్ గా బాగా బిజీ అయ్యింది. వరుస సినిమాలను చేస్తుంది. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలను చేస్తుంది. ఇదిలా ఉండగా ఈమె పెళ్లి అంటూ ఓ వార్తలు షికారు చేస్తున్నాయి. కేరళకు చెందిన ఓ రాజకీయ నాయకుడిని కీర్తి పెళ్లి చేసుకోబోతోందని కొన్నాళ్ల క్రితం వార్తలు వినిపించాయి. ఇది కాకుండా, ఆమె పేరు అనిరుధ్ రవిచందర్‌తో ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోనున్నారని ప్రచారం జరిగింది. అప్పట్లో దీనిపై కీర్తి తండ్రి, కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇందులో వాస్తవం లేదన్నారు. ప్రస్తుతం తన కెరీర్‌పై పూర్తి శ్రద్ధ పెట్టానని, అందుకే పెళ్లి గురించి ఆలోచించడం లేదని కీర్తి స్వయంగా చెప్పింది.. దీనిపై మనసు మార్చుకుంటుందేమో చూడాలి..

Advertisement

ఈమె తెలుగు లో చివరగా నటించిన సినిమా భోళా శంకర్.. ఈ సినిమా తర్వాత తెలుగు లో పెద్దగా కనిపించలేదు. కానీ బాలీవుడ్ లో బిజీ అవుతుంది. వరుస సినిమా అవకాశాల ను అందుకుంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెడుతుంది. అక్కడ మొదటి సినిమా మంచి ఫలితాన్ని ఇచ్చిందని సమాచారం. ఇక తెలుగులో సినిమాలు అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. చిరంజీవి లాంటి స్టార్ తో సినిమా చేసింది. చిరు తో భోళా శంకర్ సినిమాలో చెల్లెలు పాత్రలో నటించింది.. కానీ ఆ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది.. ఆ తర్వాత సినిమాలు ప్రకటించలేదు. ఇక న్యాచురల్ స్టార్ నాని దసరా 2 సినిమాలో నటిస్తుంది. త్వరలోనే కొత్త ప్రాజెక్టులను అనౌన్స్ చెయ్యనుందని సమాచారం..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×