BigTV English

Keerthy Suresh: ఈ హీరోయిన్ పెళ్లయ్యాక ఎక్కువ షో చేస్తోంది…

Keerthy Suresh: ఈ హీరోయిన్ పెళ్లయ్యాక ఎక్కువ షో చేస్తోంది…

Keerthy Suresh: సాధారణంగా హీరోయిన్ పెళ్లి చేసుకున్నాకా, ఆమె కెరీర్‌పై ఫోకస్ తగ్గిపోతుంది, అవకాశాలు తగ్గిపోతాయి అనే అభిప్రాయం ఉంది. కానీ, ఈ ట్రెండ్‌ను పూర్తిగా బ్రేక్ చేసిన నటి కీర్తి సురేష్. పెళ్లి తర్వాత కూడా ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు, మరింత పెరిగింది. ఆమె సోషల్ మీడియా ఫాలోయింగ్ చూస్తే, అభిమానుల్లో కీర్తి సురేష్ హవా ఇంకా కొనసాగిస్తూనే ఉందని స్పష్టంగా అర్థమవుతోంది.


ఇంతకు ముందు, కీర్తి సురేష్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఎక్కువగా సింపుల్ ఫోటోలు, కాజువల్ లుక్స్ షేర్ చేసేది. కానీ ఇప్పుడు గ్లామర్ ఫోటోషూట్స్‌తో అభిమానులకు కొత్తగా కనిపిస్తోంది. పెళ్లి అయిన తర్వాత ఎక్కువ గ్లామర్ ఫోటోలు పోస్టు చేయడం అనేది ఫ్యాన్స్‌కు ఆసక్తిగా మారింది. ‘ఇంతకు ముందు ఇలాంటి ఫోటోలు పోస్ట్ చేయలేదు కదా’ అనే కామెంట్స్ వస్తున్నా, కీర్తి స్టన్నింగ్ లుక్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

పెళ్లి తర్వాత హీరోయిన్ కెరీర్ ముగిసిపోతుందనే ట్రెండ్ కీర్తి విషయంలో వర్తించదు అని స్పష్టమవుతోంది. సోషల్ మీడియాలో గ్లామర్ లుక్స్‌తో ఆకట్టుకుంటూ, మరోవైపు మంచి సినిమాలనూ అంగీకరిస్తూ ముందుకెళ్తోంది. సినీ ఇండస్ట్రీలో తన రేంజ్ ఏమాత్రం తగ్గకుండా, నెక్స్ట్ లెవెల్ స్టార్డమ్ మైంటైన్ చేస్తున్న కీర్తి కెరీర్ ఇప్పట్లో స్లో అయ్యేలా లేదు, మరి రాబోయే రోజుల్లో అభిమానులను ఇంకా ఎలాంటి సర్ప్రైజ్‌లు ఇవ్వనుందో చూడాలి!


ఇక సినిమాల విషయానికి వస్తే, కీర్తి ప్రస్తుతం బిజీగా ఉన్న హీరోయిన్‌నే. పెళ్లి తర్వాత కూడా వరుస అవకాశాలు దక్కించుకుంటూ ఇండస్ట్రీలో బిజిబిజిగా ఉంది. తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం, కీర్తి త్వరలోనే దిల్ రాజు బ్యానర్‌లో ఓ సినిమాలో నటించనుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో హీరో నితిన్ కాగా, మొదట ఈ ప్రాజెక్ట్‌కి సాయి పల్లవి హీరోయిన్‌గా ఎంపికైనట్లు టాక్. కానీ, ఇప్పుడు ఆమె స్థానాన్ని కీర్తి సురేష్ భర్తీ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం అధికారికంగా తెలియాల్సి ఉన్నా, సినీ వర్గాల్లో ఇది హాట్ టాపిక్‌గా మారింది.

దిల్ రాజు నిర్మించే ఈ సినిమా పేరు ‘ఎల్లమ్మ’ అని తెలుస్తోంది. బలగం వేణు తెరకెక్కించనున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర చాలా ఇంపార్టెంట్ అట, అందుకే ఆమెను ఎంపిక చేశారని కొందరు భావిస్తున్నారు. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీపై అనౌన్స్ చేయకముందు నుంచే అంచనాలు ఉన్నాయి. నాని ఒకే చేసి డేట్స్ అడ్జస్ట్ కాక వదులుకున్న సినిమా కావడంతో ఎల్లమ్మ సినిమ్మలో మంచి కథ ఉంటుందనే నమ్మకం ఆడియన్స్ లో ఉంది. ఎల్లమ్మ మాత్రమే కాకుండా విజయ్ దేవరకొండ హీరోగా దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న రౌడీ జనార్ధన్ సినిమాలో కూడా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని సమాచారం. ఈ రెండు ప్రాజెక్ట్స్ క్లిక్ అయితే కీర్తి సురేష్ తెలుగులో మళ్లీ సక్సస్ ట్రాక్ ఎక్కేసి బిజీ హీరోయిన్ అయిపోవడం గ్యారెంటీ.

Related News

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Stories

×