POCSO Case in Vizag: విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ స్కూల్‌లో చదువుతున్న ఐదేళ్ల మైనర్‌పై ఉపాధ్యాయుడు లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పీఎం పాలెం పోలీసులు వెల్లడించారు.
ALSO READ: మెట్రోలో రేప్ కేసు నిందితుడు ఇతనే..
LKG చదువుతున్న తమ కూతురుపై పీటీ టీచర్ రామచంద్రరావు లైంగిక దాడి చేసేందుకు ప్రత్నించాడని చిన్నారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.
రామచంద్రరావును అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు. మైనర్‌కు అత్యాచారం చేసేందుకు ప్రయత్నించినందుకు నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.