BigTV English

Khushboo: కన్న తండ్రే కామాంధుడు.. ఖుష్బూ ఎమోషనల్ కామెంట్స్..!

Khushboo: కన్న తండ్రే కామాంధుడు.. ఖుష్బూ ఎమోషనల్ కామెంట్స్..!

Khushboo:సీనియర్ నటి ఖుష్బూ.. ఈ హీరోయిన్ పేరు చెబితే తెలియని వాళ్ళు ఉండరు. ఈ ముద్దుగుమ్మ కేవలం సినిమాల్లో రాణించడమే కాదు రాజకీయాల్లో కూడా సత్తా చాటుతోంది. సినిమాల్లో ఆఫర్స్ తగ్గాక రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ నాయకురాలిగా ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయ్యి, తప్పు జరిగిన ప్రతిసారి గొంతు విప్పి మాట్లాడుతుంది. మహిళలకు జరిగే అన్యాయాల పట్ల ఖుష్బూ ఎక్కువగా మాట్లాడుతుంది. ప్రస్తుతం బీజేపీలో కీలక నాయకురాలుగా కొనసాగుతున్న ఖుష్బూ, సినీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఆమె ఏజ్ చాలా చిన్నది.అయినా కూడా ఏజ్ తో పని లేకుండా తన యాక్టింగ్ తోనే అప్పటి ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇక ఇప్పటికి కూడా అవకాశం వచ్చినప్పుడల్లా ఖుష్బూ సినిమాల్లో నటిస్తూ ఉంది. అలా ప్రస్తుతం అక్క, అమ్మ, వదిన, అత్త వంటి పాత్రల్లో ఖుష్బూ నటిస్తోంది.


తండ్రిపై ఖుష్బూ షాకింగ్ కామెంట్స్..

అయితే అలాంటి ఖుష్బూ ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి తనని లైంగికంగా వేధించారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. మరి ఇంతకీ ఖుష్బూ తండ్రి పై ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేసింది? అనేది ఇప్పుడు చూద్దాం.. సీనియర్ నటి ఖుష్బూ ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి చేసిన టార్చర్ గురించి మాట్లాడుతూ.. “నా కన్నతండ్రి నన్ను లైంగికంగా వేధించాడు. ఇది ఎవరు ఊహించలేనిది.సొంత తండ్రి ఎలా కూతురిపై లైంగికంగా వేధింపులు చేస్తారు అంటే నా తండ్రి వల్లే నా జీవితంలో జరిగింది.


లైంగికంగా మా నాన్న వేదించాడు..

ఈ విషయం నేను బయట చెబితే మా అమ్మని, బ్రదర్స్ ని కొట్టేవాడు. మా అమ్మను అయితే చాలాసార్లు తలను గోడకేసి బాధేవాడు. చాలా చిన్న ఏజ్ లో ఉన్నప్పుడే మా నాన్న నన్ను లైంగికంగా వేధించాడు. అడ్డు వచ్చిన మా సోదరులను,తల్లిని చెప్పులతో, బెల్టుతో ఎలా పడితే అలా చిత్ర విచిత్రంగా కొట్టేవాడు. మా అమ్మని అయితే మరీ దారుణంగా కొట్టేవాడు. అయితే నేను ఈ విషయాన్ని బయటికి చెబితే ఎక్కడ మా వాళ్ళని ఇంకా వేధిస్తాడోనని భయపడి ఈ విషయాన్ని నేను ఎక్కడ బయట పెట్టడానికి ధైర్యం చూపించలేదు. ఇక ఆయన ఆగడాలు అలా సాగుతున్న సమయంలోనే నేను కాస్త పెద్దయ్యాక నాకు సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి. చెన్నైకి వచ్చాక కుటుంబం మీద ఆధారపడకుండా నా సొంత కాళ్లపై నేను నిలబడి సినిమాల్లో నటించాను.

బయటకు చెబితే మా అమ్మను చిత్రవధ చేసేవాడు..

ఇక అలా సినిమాల్లో నటిస్తున్న సమయంలో డబ్బు సంపాదించేటప్పుడు కూడా నా దగ్గరికి నాన్న వచ్చి హింసించేవాడు. ఓసారి నా దగ్గర పని చేసే హెయిర్ డ్రెస్సెర్ మా నాన్న ప్రవర్తన చూసి అనుమానం వచ్చి ఎందుకు మీ నాన్న నీతో అలా ప్రవర్తిస్తున్నాడు అని అడిగింది.దానికి మా నాన్న చేసే ఆగడాలని ఆమె ముందు బయట పెట్టాను. దాంతో హెయిర్ డ్రెస్సర్ నాకు చాలా ధైర్యాన్ని నూరిపోసింది. ఇలా అయితే కష్టమే అని, ధైర్యంగా ఉండాలి అని, నీకు జరిగిన అన్యాయాన్ని అడ్డుకో అంటూ నాకు ధైర్యం చెప్పడంతో ఆమె మాటలకు నేను ధైర్యంగా నిలబడ్డాను. అప్పటినుండి మా నాన్నకు ఎదురు తిరగడం మొదలుపెట్టాను. ఇక అలా ఎదురు తిరిగిన సమయంలో కూడా ఓ రోజు షూటింగ్ కి వచ్చి అందరి ముందే నన్ను బాగా కొట్టాడు. ఆ దెబ్బలకు ఆ హెయిర్ డ్రెస్సర్ బాధపడి నాకు ధైర్యం చెప్పింది.

14 ఏళ్ల వయసులోనే అలాంటి దాడి..

ఇక 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నాకు జరిగిన అన్యాయాన్ని లైంగిక వేధింపులకు సంబంధించిన విషయాన్ని మొదటిసారి బయట పెట్టాను. ఆ సమయంలో మా నాన్న మమ్మల్ని వదిలేసి దూరంగా పారిపోయాడు. అలా చిన్నతనంలోనే నేను మా నాన్న చేతిలో లైంగిక వేధింపులకు గురయ్యాను.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఖుష్బూ. దీంతో ఈమె మాటలు వైరల్ అవడంతో.. ఈమె మాటలు విన్న చాలామంది బాధపడుతున్నారు. సొంత తండ్రే అలా కూతురుపై లైంగిక దాడి చేస్తే ఎలా.. ఇక ఈ మధ్యకాలంలో అమ్మాయిలపై సొంత తండ్రి,అన్న, తమ్ముడు, మామ ఇలా ఎంతోమంది క్రూరాతి క్రూరంగా అత్యాచారాలు చేసి చంపిన ఘటనలు మనం ఎన్నో చూస్తున్నాం. అలా ఖుష్బూ కూడా చిన్న తనంలోనే లైంగిక వేధింపులు ఎదుర్కొందని తెలుస్తోంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×