BigTV English

Juhi Chawla: అమ్మ బాబోయ్ రూ.4600 కోట్ల ఆస్తులే.. అమితాబ్ బచ్చన్ కు కూడా లేవు కదరా

Juhi Chawla: అమ్మ బాబోయ్ రూ.4600 కోట్ల ఆస్తులే.. అమితాబ్ బచ్చన్ కు కూడా లేవు కదరా

Juhi Chawla: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. ఇది పెద్దలు చెప్పిన మాట. ఎవరైనా వయస్సు ఉన్నప్పుడే కష్టపడాలి.. నాలుగు రాళ్లు వేనకేసుకోవాలి. కష్టపడే ప్రతిఒక్కరు  ఇదే సూత్రాన్ని పాటిస్తారు. ఇండస్ట్రీలో ఉన్నవారు అయితే మరింత పాటిస్తారు. ఒక సినిమా హిట్ అయ్యిందా.. ? ఇక దాని తరువాత నుంచి వరుస అవకాశాలు, యాడ్స్, ఈవెంట్స్ అంటూ ఖాళీ లేకుండా కష్టపడుతూ డబ్బు వెనకేస్తూ  ఉంటారు.


ఇక ఇండస్ట్రీలో అనాదిగా వస్తున్న ఆచారం ఏదైనా ఉంది అంటే.. అది హీరోల కన్నా.. హీరోయిన్ల పారితోషికాలు తక్కువ. అప్పుడే కాదు.. ఇప్పుడు కూడా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కు రెమ్యూనరేషన్స్ తక్కువ. ఒక హీరోకు రూ. 100 కోట్లు ఇవ్వడానికి వెనుకాడని మేకర్స్.. ఒక హీరోయిన్ కు రూ. 10 కోట్లు ఇవ్వాలంటే ఆలోచిస్తారు.

Director Bobby : లాస్ట్ టైం రవితేజ్… ఇప్పుడు బాబీకి బాబీ డియోలే దిక్కా..?


అలా తక్కువ రెమ్యూనరేషన్  తీసుకున్నా కూడా ఒక స్టార్ హీరోయిన్.. ఇండస్ట్రీలోనే  రిచ్చెస్ట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఆమె ఎవరో కాదు. బాలీవుడ్ అందాల భామ జూహీ చావ్లా. ప్రస్తుతం ఒక్కో సినిమాలు రూ. 10, 20 కోట్లు తీసుకుంటున్న హీరోయిన్స్ ను వెనక్కి నెట్టి రూ. 4600 కోట్ల ఆస్తులతో అత్యంత సంపన్నమైన హీరోయిన్ గా రికార్డ్ సృష్టించింది. ఇది మాములు విషయం కాదు. ఆమె ఆస్తులతో పోలిస్తే బిగ్ బి అమితాబ్ ఆస్తులు కూడా తక్కువేనట.

ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా హురున్ ఇండియా కంపెనీ.. దేశంలోనే అత్యంత సంపన్నుల లిస్ట్ 2024 ను విడుదల చేసింది. ఈ లిస్ట్ లో జూహీ అత్యంత సంపన్నురాలైన హీరోయిన్ గా మొదటిస్థానంలో నిలిచి అందరికి షాక్ ఇచ్చింది. ఆమె ఆస్తుల విలువ అక్షరాలా రూ. 4600 కోట్లు అన్నట్లు వారు తెలిపారు.

Rajamouli: రామ్ చరణ్ పై అలాంటి కామెంట్స్.. శంకర్ ఫీలవుతారేమో జక్కన్న..?

ఇక మొదటి స్థానంలో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నిలిచాడు. రూ. 7300 కోట్ల ఆస్తులతో ఆయన ముందు  స్థానంలో నిలబడగా.. రెండో స్థానంలో జూహీ నిలబడింది వీరిద్దరి తరువాత మూడో ప్లేస్ లో హృతిక్ రోషన్ రూ. 2000 కోట్లతో నిలబడగా.. అమితాబ్ రూ. 1200 కోట్లతో నాలుగో స్థానం కవిసం చేసుకున్నాడు.

1984లో మిస్ ఇండియాగా గెలిచి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న జూహీ 1986లో విడుదలైన సుల్తానేట్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా అంత ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా 1987లో కన్నడ  భాషలో రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ప్రేమలోకా సినిమా జూహీ జీవితాన్ని మార్చేసింది. ఆ తరువాతా ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు.

Aparna Malladi: టాలీవుడ్ లో విషాదం.. లేడీ డైరెక్టర్ మృతి

1990లో ఆమె నటించిన ప్రతిబంధ్ సినిమా ఇండస్ట్రీలోనే అతి పెద్ద హిట్ గా నిలిచింది. హిందీ భాషలోనే కాక, పంజాబీ, మళయాళం, కన్నడ, తమిళ్, తెలుగు, బెంగాలీ భాషల్లో కూడా సినిమలు చేశారు చావ్లా. 1980, 90 వ దశకాల్లోనూ, 20వ దశకం తొలినాళ్ళల్లోనూ ఆమె బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగింది. ఆమె అందానికి ఫిదా కానీ ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు.

తెలుగులో చాలా తక్కువ సినిమాల్లో నటించింది జూహీ.  కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే జూహీ పారిశ్రామికవేత్త  జయ్ మెహతా ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. జూహీ సినిమాలకు దూరంగా ఉన్నా నిర్మాతగా..ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ టీంకు యజమానిగా వ్యవహరిస్తోంది. ఇక ఇవన్నీ చేయడం వలనే ఆమె ఇన్ని ఆస్తులు కూడగట్టినట్లు తెలుస్తోంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×