E-Paper
Advertisement

Khushbu Sundar : 8 ఏళ్ల వ‌య‌సులో క‌న్న తండ్రే లైంగికంగా వేధించాడు..ఖుష్బూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Khushbu Sundar : 8 ఏళ్ల వ‌య‌సులో క‌న్న తండ్రే లైంగికంగా వేధించాడు..ఖుష్బూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Advertisement
Khushbu Sundar

Khushbu Sundar : సీనియ‌ర్ న‌టి, రాజ‌కీయ నాయ‌కురాలు ఖుష్బూ సుంద‌ర్ రీసెంట్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్య‌లు నేష‌న‌ల్ రేంజ్‌లో సెన్సేష‌న‌ల్ అవుతున్నాయి. ఆమె కామెంట్ చేసిన వ్య‌క్తి మ‌రెవ‌రో కాదు.. ఆమె తండ్రే. ఇంత‌కీ ఖుష్బూ త‌న తండ్రిపై అంతా చేసిన కామెంట్స్ ఏంట‌నే వివ‌రాల్లోకి వెళితే.. ‘‘మా అమ్మగారు వైవాహిక జీవితంలో ఎన్నో ఇబ్బందుల‌ను ఎదుర్కొంది. నా తండ్రి న‌న్ను, మా అమ్మ‌ని, పిల్ల‌ల్ని రోజూ కొట్టేవాడు. నాకు 8 వయ‌సున్న‌ప్పుడు లైంగికంగా వేధించాడు. 15 ఏళ్ల వ‌య‌సులో నేను త‌న‌ని ఎదిరించ‌టం మొద‌లు పెట్టాను. 16 ఏళ్ల వ‌య‌సులో త‌ను మ‌మ్మ‌ల్ని అంద‌రినీ విడిచి పెట్టేసి వెళ్లిపోయాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ విష‌యాన్ని నేను మా అమ్మ‌తో కూడా చెప్ప‌లేదు. ఇప్పుడు నేను చెప్పినా ఆమె నిజ‌మ‌ని న‌మ్మ‌దు’’ అంటూ ఖుష్బూ త‌న క‌న్న తండ్రిపై చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి.

ప‌లు తెలుగు, త‌మిళ చిత్రాల్లో న‌టించి హీరోయిన్‌గా మెప్పించిన ఖుష్బూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్‌ను సంపాదించుకుంది. అగ్ర హీరోయిన్‌గా రాణించింది. త‌ర్వాత క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గానూ ప‌లు సినిమాల్లో న‌టించింది. కొన్నాళ్లు రాజ‌కీయాల్లోకి రంగ ప్ర‌వేశం చేసింది. ప్ర‌స్తుతం ఆమె బీజేపీ పార్టీలో ఉన్నారు. రీసెంట్‌గానే జాతీయ మ‌హిళా క‌మీష‌న్‌లో స‌భ్యురాలిగా ఎన్నిక‌య్యారు. చిన్న వ‌య‌సులోనే సినిమాల్లోకి అడుగు పెట్టి కెరీర్ స్టార్ట్ చేసిన ఖుష్బూ క‌లియుగ పాండ‌వులు చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు ఆడియెన్స్‌ను అల‌రించింది. త‌ర్వాత తెలుగు కంటే త‌మిళంలోనే ఆమె ఎక్కువ సినిమాలు చేసి రాణించింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×