BigTV English

Mounika: వైసీపీలోకి మంచు మౌనిక?.. మరి, భూమా అఖిలప్రియ!?

Mounika: వైసీపీలోకి మంచు మౌనిక?.. మరి, భూమా అఖిలప్రియ!?

Mounika: రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. చాలాసార్లు ప్రూవ్ అయిందీ విషయం. కాదేదీ రాజకీయాలకు అనర్హం అంటారు. లేటెస్ట్‌గా అలాంటిదే మరో సంచలన పొలిటికల్ ఎంట్రీ జరగబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. ఇటీవల మంచు మనోజ్‌ను పెళ్లి చేసుకున్న భూమా మౌనికారెడ్డి.. త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నారనేది బ్రేకింగ్ న్యూస్.


ఈ విషయం పరోక్షంగా మౌనిక భర్త మంచు మనోజే చెప్పడం ఆసక్తికరం. వివాహం తర్వాత శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమల వెళ్లారు మంచు, భూమా కుటుంబ సభ్యులు. స్వామి వారి దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. మనోజ్ సంచలన విషయం వెల్లడించారు. మా ఇద్దరికీ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం ఉందని చెప్పారు. అయితే, తనకు రాజకీయాల్లోకి రావాలని లేదని.. పాలిటిక్స్‌పై మౌనికకు ఆసక్తి ఉంటే తాను అండగా ఉంటానని అన్నారు. ఈ టాపిక్‌పైనే ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

భూమా మౌనికారెడ్డి. డాటర్ ఆఫ్ భూమా శోభా, నాగిరెడ్డి. ఆమె రక్తంలోనే రాజకీయం ఉంది. వారి కుటుంబం ఏళ్లుగా రాజకీయం చేస్తోంది. గతంలో తన సోదరుడు, సోదరి కోసం భూమా మౌనికారెడ్డి విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. మంచి వాగ్దాటి ఆమె సొంతం. రాజకీయాలకు పక్కాగా సరిపోతారు. ఇప్పటికే మౌనిక అక్క అఖిలప్రియ ఫుల్ టైమ్ పాలిటిక్స్‌లో ఉన్నారు. గతంలో మంత్రిగానూ చేశారు. ప్రస్తుతం టీడీపీలో చురుగ్గా కొనసాగుతున్నారు. అఖిలప్రియ లానే మౌనిక సైతం రాజకీయాలపై మొదటినుంచీ ఆసక్తిగానే ఉన్నారు. ఇప్పుడు మంచు మనోజ్‌ను వివాహం చేసుకోవడం.. భార్యను తాను ప్రోత్సహిస్తానంటూ మనోజ్ చెప్పడం చూస్తుంటే.. మౌనిక పొలిటికల్ ఎంట్రీ త్వరలోనే ఉండొచ్చనే చర్చ సోషల్ మీడియాతో నడుస్తోంది. మరి, మంచు మౌనికారెడ్డి ఏ పార్టీలో చేరుతారు అనేదే ఇంట్రెస్టింగ్ పాయింట్.


అక్క అఖిల టీడీపీలో ఉంది కాబట్టి.. చెల్లి మౌనిక కూడా ఆ పార్టీలోనే చేరుతుందని అనుకోలేమని అంటున్నారు. ఎందుకంటే అక్కడున్నది మంచు ఫ్యామిలీ. కరుడుగట్టిన వైసీపీ సానుభూతిపరుడు మోహన్‌బాబు కోడలు ఆమె. చేరితే గీరితే మంచు మౌనిక వైసీపీలోనే చేరాల్సి ఉంటుందనే చర్చ నడుస్తోంది. భూమా కుటుంబం సైతం గతంలో వైఎస్సార్‌సీపీలోనే ఉండేది. వైఎస్ కుటుంబ అభిమానులుగానే ఉన్నారు. ఆ తర్వాత మారిన పరిణామాల నేపథ్యంలో టీడీపీలో చేరారు. సో, వారి ఫ్యామిలీకి జగన్ పార్టీ అంటరానిదేమీ కాదు.

అక్క అఖిల ఎలాగూ టీడీపీలో ఉంది కాబట్టి.. చెల్లి మౌనిక వైసీపీలో చేరితే.. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. వారి ఇంటి నుంచే ఓ పవర్ సెంటర్ ఉంటుందనే లాజిక్కూ ఇక్కడ అప్లై అవుతోంది. మంచు కుటుంబం అంటేనే వైసీపీ కాబట్టి.. ఆ ఇంటి కోడలు మౌనికారెడ్డి సైతం వైసీపీ కండువే కప్పుకుంటారని అంటున్నారు. అదే నిజమైతే.. అక్క ఓ పార్టీ.. చెల్లి ఇంకోపార్టీ.. మరి ఆ ఇద్దరూ ఎన్నికల్లో ఫేస్ టు ఫేస్ తలపడే పరిస్థితి వస్తుందా?

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×