Big Stories

HBD Vijay Deverakonda: కత్తి నాదే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే.. విజయ్ దేవరకొండ కొత్త మూవీ పోస్టర్ అదుర్స్!

Vijay Devarakonda’s New Movie Poste Released on His Birthday: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. డిఫరెంట్ స్టోరీలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు. ఇటీవల ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాతో వచ్చి పర్వాలేదనిపించుకున్నాడు. ‘గీతాగోవిందం’ సినిమాతో మంచి హిట్ అందించిన దర్శకుడు పరశురామ్.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించాడు.

- Advertisement -

అయితే ఎన్నో అంచనాల నడుమ థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా యూత్‌ని ఆకట్టుకోవడంలో మాత్రం విఫలం అయింది. రొటీన్ స్టోరీ లైన్, పాత్రలతో రావడంతో యూత్ రిజెక్ట్ చేశారు. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాకు ఫిదా అయిపోయారు. ఒక మధ్య తరగతి కుటుంబంలో ఉండే కష్టాలను దర్శకుడు చూపించిన తీరుకు ఫ్యామిలీ ఆడియన్స్ చప్పట్లు కొట్టారు.

- Advertisement -

ఇక ఈ మూవీ అనంతరం ఇప్పుడు మరొక సినిమాకు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు నిర్మాత దిల్ రాజుతో మరోసారి చేతులు కలిపాడు. ఈ కొత్త చిత్రానికి ‘రాజా వారు రాణి గారు’ ఫేం రవి కిరణ్ కోలా దర్శకత్వం వహించనున్నాడు. ఇది దర్శకుడి రెండో సినిమా. విలేజ్ నేపథ్యంలో.. ప్రేమ కథతో తన ఫస్ట్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన రవి కిరణ్.. ఇప్పుడు తన రెండవ సినిమాను మాస్ యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు.

Also Read: విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో దిల్‌రాజు మ‌రో మూవీ.. టైటిల్ ఇదే!

ఈ మూవీ పక్కా మాస్ అండ్ రూరల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కబోతుంది. ఇందులో భాగంగా ఈ రోజు హీరో విజయ్ దేవర కొండ బర్త్ డే కావడంతో ఈ మూవీ నుంచి మేకర్స్ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ చూస్తే మామూలుగా లేదు. ‘‘నా చేతుల మీద ఉన్న రక్తం వాళ్ల చావుకు చిహ్నం కాదు.. వ్యక్తిగా నా పునర్జన్మకు సంకేతం’’ అనే క్యాప్షన్‌తో విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో పోస్ట్ చేశాడు.

దీంతో ఈ పోస్టర్ రిలీజ్ అయిన అతి కొద్ది నిమిషాల్లోనే ట్రెండింగ్‌లోకి మారింది. అయితే ఆ పోస్టర్ మీద ‘‘కత్తి నాదే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే’’ అని రాసి ఉండటంతో సినిమా మామూలు రేంజ్‌లో ఉండదని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. కాగా ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మితమవుతుంది. కాగా ఇది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ 59వ సినిమా. ఇది తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.

Also Read: Pradeep Machiraju: ప్రదీపూ.. ఓ ప్రదీపూ.. ఎక్కడికి వెళ్లిపోయావ్.. ?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News