BigTV English

Dil Ruba : సెన్సార్ ను పూర్తి చేసుకున్న ‘ దిల్ రూబా ‘.. ఆ మూవీని కాపీ కొట్టారా..?

Dil Ruba : సెన్సార్ ను పూర్తి చేసుకున్న ‘ దిల్ రూబా ‘.. ఆ మూవీని కాపీ కొట్టారా..?

Dil Ruba : టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గతంలో క అనే కొత్త మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ మూవీ క్లైమాక్స్ బాగా ఆకట్టుకోవడంతో సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ మూవీ తర్వాత ఇప్పుడు దిల్ రూబా అనే మూవీతో థియేటర్లలో సందడి చెయ్యనున్నాడు. షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకి విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తుండగా.. రవి, జోజో, జోస్, రాకేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సినిమా రిలీజ్ అవ్వడానికి కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో జోష్ ని పెంచింది.. వరుసగా ప్రెస్ మీట్ లను ఏర్పాటు చేస్తూ జనాల్లోకి తీసుకెళ్లాని ప్రమోషన్స్ ఇస్తున్నారు. తాజాగా ట్రైలర్ ను ను విడుదల చేశారు. ఆ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా సెన్సార్ ను పూర్తి చేసుకుంది. మరి సర్టిఫికెట్ ను సొంతం చేసుకుందో చూద్దాం..


దిల్ రూబా మూవీ.. 

సరికొత్త కథతో మరోసారి ప్రేక్షకులను పలకరించనున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. ఈ మూవీ అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని త్వరలోనే రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ మూవీని మార్చి 14 న రిలీజ్ చెయ్యనున్నారు.. సినిమాను జనాల్లోకి తీసుకెళ్ళేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో జోరుని పెంచింది. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ ని రిలీజ్ చేశారు. దానికి మంచి రెస్పాన్స్ రావడంతో మూవీ పై అంచనాలు భారీగా పెరిగాయి. ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అని యూత్ ఎక్కువగా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారని ఓ వార్త షికారు చేస్తుంది..


సెన్సార్ రిపోర్ట్.. 

కిరణ్ అబ్బవరం నటించిన దిల్ రూబా మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నెల 14 న మూవీ రిలీజ్ చేస్తున్నట్లు డేట్ ను ప్రకటించారు. నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు క్లియరెన్స్ ఇస్తూ యూ / ఏ సర్టిఫికెట్ ను అందుకుంది.. అయితే సెన్సార్ నుంచి అంతా క్లియర్ అయిన కూడా ఈ మూవీ అంతా నాని నటించిన నిన్ను కోరి మూవీలాగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఓపెనింగ్ పడితే ఈ మూవీ స్టోరీ తెలిసేలా ఉంది. ఏది ఏమైనా ఫస్ట్ షో పడకముందే ఇలా కాపీ అని రావడంతో టీమ్ టెన్షన్ పడుతున్నారు. ఏది ఏమైనా ఈ మూవీ ఎలాంటి టాక్ ను అందుకుంటుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే..

Also Read :  రజినీ ‘కూలీ’ తెలుగు రైట్స్ ను సొంతం చేసుకున్న నాగవంశీ.. ఎన్ని కోట్లంటే..?

ఇక దిల్ రూబా సినిమాకి వీలైతే మీ లవర్‌తో, కొద్దిగా కష్టంగా ఉంటుంది కానీ మీ ఎక్స్‌తో సినిమాకి వెళ్ళండి. బయటికి వచ్చేటప్పుడు మీరు మీ లవర్, మీ ఎక్స్ ముగ్గురూ చాలా హ్యాపీగా ఫ్రెండ్‌షిప్‌తో బయటికి వస్తారు అంటూ చెప్పుకోచ్చాడు. ఎక్స్ మీద మనకు ప్రేమ పోవచ్చు కానీ ఫ్రెండ్‌షిప్ అలానే ఉంటుంది.. అంటూ కిరణ్ మాట్లాడిన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే..

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×