OTT Movie : ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు, వెబ్ సిరీస్ లకు ఓటీటీ లో ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్నారు. సెన్సార్ నిబంధనలు లేని ఈ వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల మతి పోగోడుతున్నాయి. గత ఏడాది హాలీవుడ్ నుంచి వచ్చిన ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటిటిలో దుమ్ము లేపుతోంది. ఇద్దరు సైకోల చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఇందులో మగ సైకో కంటే, ఆడ సైకో చాలా డేంజర్ గా ఉంటుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ హాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘డార్క్ సిటీ: ది క్లీనర్’ (Dark City : The cleaner). రచయిత పాల్ క్లీవ్ నవల ‘ది క్లీనర్’ ఆధారంగా ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఇందులో కోహెన్ హోల్లోవే, చెల్సీ ఫ్లోరెన్స్ జో మిడిల్టన్, మెలిస్సా ఫ్లవర్స్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
ఒక పోలీస్ క్రైమ్ డిపార్ట్మెంట్లో హీరో క్లీనర్ గా పనిచేస్తుంటాడు. దాదాపు పది సంవత్సరాలు అక్కడే నమ్మకంగా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకుంటాడు. ఒకరోజు ఇతడు తన తల్లికి విషం పెట్టి చంపేస్తాడు. ఎందుకంటే హీరో తండ్రి ఒక గే. ఆ విషయం హీరో తల్లికి తెలిసి అతనికి విడాకులు ఇస్తుంది. భర్త మీద కోపంతో హీరోని దారుణంగా ట్రీట్ చేస్తుంది. అతనికి సరిగ్గా ఫుడ్ కూడా పెట్టదు. చిన్నప్పటినుంచి ఇవన్నీ భరించిన హీరో తల్లికి విషం పెట్టి చంపేస్తాడు. ఆ తర్వాత అమ్మాయిలను చంపుతూ పోతాడు. ఇతని లైఫ్ లోకి వచ్చిన అమ్మాయితో హీరో ప్రేమలో పడే ఫీలింగ్స్ వస్తే ఆమెను చంపేస్తుంటాడు. ఈ హత్యలు ఎవరు చేస్తున్నారో, పోలీసులకి అర్థం కాక తలలు పట్టుకుంటూ ఉంటారు. హీరో మాత్రం పోలీసులతో పాటు ఉంటూ వారి కదలికలను కూడా తెలుసుకుంటూ ఉంటాడు. అయితే హీరో అమ్మాయిని చంపిన తర్వాత అక్కడ ఒక ఆపిల్ పండును పెట్టి పోతాడు.
ఒకసారి హీరో ఎవరినీ చంపక పోయినా, ఒక అమ్మాయిని చంపి అక్కడ ఒక వ్యక్తి ఆపిల్ పెట్టి వెళ్తాడు. పోలీసులు పాత నేరస్థుడు ఇది కూడా చేశాడని అనుకుంటారు. హీరో ఆ వ్యక్తిని ఎలాగైనా కనిపెట్టి చంపాలనుకుంటాడు. ఇంతలో హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది. హీరోతో చాలా క్లోజ్ గా మూవ్ అవుతుంది. వీళ్ళిద్దరూ ఒంటరిగా ఒకచోట వెళ్తుంటే, హీరోయిన్ తన విశ్వరూపం చూపిస్తుంది. గన్ తీసి హీరోకి పెట్టి కాళ్లు చేతులు కట్టేస్తుంది. అమ్మాయిలను చంపుతున్నది నువ్వే కదా అని అడుగుతుంది. ఆమె తనదైన స్టైల్ లో అతని చేత నిజం చెప్పిస్తుంది. అతని బాల్స్ లో ఒక దాన్ని కత్తిరిస్తుంది. హీరో నొప్పిని తట్టుకోలేకపోతాడు. ఆ తర్వాత హీరోయిన్, హీరోకి బిత్తరపోయే ఒక ట్విస్ట్ ఇస్తుంది. హీరోయిన్ ఇచ్చే ట్విస్ట్ ఏమిటి? పోలీసులు హీరోని పట్టుకుంటారా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, డార్క్ సిటీ: ది క్లీనర్ (Dark City : The cleaner) అనే ఈ వెబ్ సిరీస్ ను చూడండి.