Cooli Movie : తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ ( Rajinikanth ), కొలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు కాంబినేషన్ లో కూలీ మూవీ తెరకేకుతున్న విషయం అందరికి తెలిసిందే.. ‘వేట్టైయన్’ తర్వాత, సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పుడు ‘కూలీ’ మూవీలో నటిస్తున్నారు. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ భారీ కాస్టింగ్‌తో రూపొందుతుంది.. హీరోయిన్ పూజా హెగ్డే ఈ సినిమాలో ఒక పాటలో మాత్రమే డ్యాన్స్ చేసింది. ఐటెమ్ సాంగ్‌గా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. దీనికోసం ఆమె భారీగా రెమ్యూనరేషన్ ను అందుకుంది. ఈ సినిమా కోసం కేవలం రజినీ ఫ్యాన్స్ మాత్రమే కాదు, తమిళ సినీ ఇండస్ట్రీ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది.. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమిళ్ళో భారీ క్రేజ్ ను అందుకున్న ఈ మూవీ తెలుగు రైట్స్ ఎవరు సొంతం చేసుకున్నారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందా..
తమిళ సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా రజినీ మూవీ ఎట్టకేలకు థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటి వరకు టాలీవుడ్, శాండిల్ వుడ్, బాలీవుడ్ చిత్రాలకు వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ సినిమాలు ఉన్నాయి కానీ, కోలీవుడ్ కి మాత్రం వెయ్యి కోట్ల సినిమా లేదు. ఇది ఆ సినీ పరిశ్రమ పెద్దలను తీవ్రంగా కలిచివేస్తుంది. అందుకే ఈ సినిమా కచ్చితంగా వెయ్యి కోట్ల గ్రాస్ ని కొల్లగొడుతుందని అందరు నమ్ముతున్నారు. అయితే ఈ మూవీ టాలీవుడ్ రైట్స్ ఎవరు సొంతం చేసుకున్నారో అనే వార్తలకు చెక్ పడింది.. ఈ మూవీ తెలుగు రైట్స్ ముందుగా అక్కినేని నాగార్జున 40 కోట్లకు హక్కులను కొనుగోలు చెయ్యాలని అనుకున్నాడు. కానీ తప్పుకున్నాడు. ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్ కొనుగోలు చెయ్యాలని అనుకున్నారు. చివరకు ప్రముఖ నిర్మాత నాగ వంశీ 40 కోట్లకు సొంతం చేసుకున్నాడని సమాచారం. దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది…
Also Read :తల్లిపై చిరంజీవి ఎమోషనల్ వీడియో… అది వింటే కన్నీళ్లు ఆగవు అంతే..
ఇక ఈ మూవీలో అక్కినేని నాగార్జున,కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, శివ కార్తికేయన్, సందీప్ కిషన్ వంటి హీరోలు ఉండడంతో అంచనాలు ఇంకా కాస్త పెరిగాయి. ఇందులో హీరోయిన్ గా శృతి హాసన్(Sruthi hassan) నటిస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈ ఏడాది ఆగస్టు 14 న స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఇప్పటివరకు చిత్ర బృందం కేవలం పోస్టర్లతోనే అదరగొట్టేశారు. సంగీతాన్ని అనిరుద్ రవిచందర్ అందిస్తూ ఉన్నారు… గతంలో రజినీ నటించిన సినిమాల పై భారీ అంచనాలు ఉన్నాయి.. ఈ మూవీ పై కూడా అంతకు మించి అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఇందులో స్టార్స్ నటిస్తున్నారు. మొత్తానికి చూస్తుంటే రజినీ ఖాతాలో మరో హిట్ పడినట్లే..