E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

అన‌వ‌స‌రంగా వైభ‌వ్ గెలికారు..ఇప్పుడు అనుభ‌వించండి, లంక ప్లేయ‌ర్ల‌పై గ‌వాస్క‌ర్‌ సెటైర్లు

అన‌వ‌స‌రంగా వైభ‌వ్ గెలికారు..ఇప్పుడు అనుభ‌వించండి, లంక ప్లేయ‌ర్ల‌పై గ‌వాస్క‌ర్‌ సెటైర్లు
Advertisement

Sunil Gavaskar :  శ్రీలంక గడ్డపై ప్రస్తుతం ట్రై సిరీస్ (Tri Nation A Series in Sri Lanka 2026 ) ఫైనల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ట్రై సిరీస్ ఫైనల్ లో టీమిండియా వర్సెస్ శ్రీలంక (Sri Lanka A vs India A, Final) లిస్ట్ దంబుల్లా వేదిక‌గా (Rangiri Dambulla International Stadium, Dambulla) తలపడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ కాసేపటికి క్రితమే ప్రారంభం కాగా, టీమిండియా లిస్టు ఏ మొదటి బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో శ్రీలంకపై వైభవ్ సూర్య వంశీ ప్రతీకారం తీర్చుకున్నాడు. 29 బంతుల్లోనే 94 పరుగులతో రెచ్చిపోయాడు వైభవ్. దీంతో సోషల్ మీడియా వేదికగా 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ పై (Vaibhav Sooryavanshi ) మళ్లీ ప్రశంసల వర్షం కురుస్తోంది. అటు లంక క్రికెటర్లు కూడా వైభవ్ బ్యాటింగ్ చూసి బిత్తర పోయారు. ఈ క్రమంలో ఈ బుడ్డోడిపై సునీల్ గవాస్కర్ ( Sunil Gavaskar ) సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్న గ్రూప్ స్టేజ్ లో అనవసరంగా వైభవ్ సూర్యవంశీను రెచ్చగొట్టారని మండిపడ్డారు. దాని ఫలితమే ఇవాళ అనుభవిస్తున్నారని చురకలు అంటించారు. ఆ రోజున వైభవ్ ను గెలికి ఉండకపోతే… ఇవాళ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడకపోయి ఉండేవాడని సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read: Ravichandran Ashwin weighs in on Ishan Kishan: అఫ్ఘాన్ పై సెంచ‌రీ చేశాడ‌ని ఎగిరి ప‌డొద్దు..వ‌ర‌ల్డ్ క‌ప్ కు ఇషాన్ అస‌లు ప‌నికే రాడు

అన‌వ‌స‌రంగా వైభ‌వ్ గెలికారు..ఇప్పుడు అనుభ‌వించండి

Advertisement

ట్రై సిరీస్ ఫైనల్స్ నేపథ్యంలో శ్రీలంక లిస్ట్ ఏ జట్టుపై వైభవ్ సూర్యవంశీ భయంకరమైన బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు. మొన్న లంక ప్లేయర్ లందరూ కలిసి వైభవ్ ను రెచ్చగొట్టారు. దీంతో రెండు జట్ల ప్లేయర్ల మధ్య గొడవ జరిగింది. అయితే దాన్ని మనసులో పెట్టుకున్న వైభవ్.. ఇవాళ తుఫాను ఇన్నింగ్స్ తో రెచ్చిపోయాడు. 29 బంతుల్లో 94 పరుగులు చేసి నరకం చూపించాడు.

అయితే వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పై తాజాగా సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మొన్నటి మ్యాచ్ సందర్భంగా అనవసరంగా వైభవ్ లో ఉన్న రాక్షసుడిని నిద్ర లేపారని శ్రీలంక క్రికెటర్లకు చురకలు అంటించారు. ఇక ఇవాల్టి మ్యాచ్ సందర్భంగా లంక ప్లేయర్లు, అనుభవించాల్సిన పరిస్థితి వచ్చిందని సెటైర్లు పేల్చారు. తాను మొదటి నుంచి చెబుతున్న.. వైభవ్ ను అస్సలు గెలకొద్దు, వాడు మనిషి రూపంలో ఉన్న మృగం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ద మ్యాచుల్లో కచ్చితంగా అతడు ఆడతాడని వెల్లడించారు. ఐపీఎల్ క్వాలిఫైయర్స్ సమయంలో కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు చుక్కలు చూపించాడని గుర్తు చేశారు. అతడే నిజమైన మ్యాచ్ విన్నారని… భవిష్యత్తులో టీమిండియా కు కీలక ఆటగాడిగా ఎదుగుతాడని ప్రశంసించారు సునీల్ గవాస్కర్.

Advertisement

Also Read:  Tanveer Ahmed On ICC Womens World Cup 2026 Womens Pakistan Team: నీకు చేత కాక‌పోతే త‌ప్పుకో..కోచ్ వహాబ్ రియాజ్ కు వార్నింగ్

 

Related News

తిట్టిన నోళ్ల‌తోనే, శ‌భాష్ అనిపించుకున్నాడు..వైభ‌వ్ ను మెచ్చుకున్న‌ లంక ప్లేయ‌ర్లు

జై షా చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవ‌డం ఇష్టం లేక పాకిస్తాన్ ఎలిమినేట్ అయింది

వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి పాకిస్తాన్ ఎలిమినేట్…ఫాతిమా స‌నా పాత వీడియో వైర‌ల్

రోహిత్ 40 కాదు,19 ఏళ్ల కుర్రాడిలా ఆడుతున్నాడు..రిపోర్ట‌ర్ల‌కు దిమ్మ‌తిరిగే ఆన్స‌ర్ ఇచ్చిన గంభీర్

Inzamam-ul-Haq: వ‌రుస‌గా మూడో ఓట‌మి..ఇక మీరు పాకిస్తాన్ లో అడుగుపెట్టొద్దు !

రిషబ్ పంత్ వ‌స్తే, కేఎల్ రాహుల్ ను తొక్కేస్తారు, ఢిల్లీని వ‌దిలితేనే బెట‌ర్‌ !

రోహిత్ శర్మ హ్యాట్రిక్ క్యాచ్ లు..కండ్లు తెరిచి చూడు అంటూ గంభీర్ పై ప‌ఠాన్ ఫైర్‌

Big Stories

×