BigTV English

Shah Rukh Khan: షారుక్ ఖాన్ ఇంటి కరెంట్ బిల్లు తెలిస్తే గుండె గుబేల్.. ప్రతినెల ఎంత పే చేస్తారంటే..?

Shah Rukh Khan: షారుక్ ఖాన్ ఇంటి కరెంట్ బిల్లు తెలిస్తే గుండె గుబేల్.. ప్రతినెల ఎంత పే చేస్తారంటే..?

Shah Rukh Khan: సాధారణంగా సెలబ్రిటీలు ఎంత లగ్జరీ లైఫ్ అనుభవిస్తారో ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఆ లగ్జరీ లైఫ్ కి ఎలక్ట్రిసిటీ కూడా చాలా అవసరం. ముఖ్యంగా దైనందిత జీవితంలో పవర్ లేనిదే ఏ పని జరగదు అనడంలో సందేహం లేదు. అయితే బాలీవుడ్ ఉన్నత వర్గాలకు ఇది భారీ ఖర్చు కూడా.. అత్యాధునిక లైటింగ్, హోమ్ థియేటర్లు, విలాసవంతమైన సౌకర్యాలతో కూడిన విశాలమైన ఇళ్లతో ఈ సెలబ్రిటీలకు కరెంట్ బిల్లులు కూడా విపరీతంగా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలి అంటే సామాన్యులు ఏడాది పొడవునా వాడుకునే విద్యుత్తును, ఈ సెలబ్రిటీలు 15 రోజుల్లోనే ఖర్చు చేస్తారంటే అతిశయోక్తి కాదు. సాధారణంగా మధ్యతరగతి కుటుంబాలు లైట్, ఫ్యాన్, టీవీ ,వాషింగ్ మిషన్ లాంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఎక్కువగా వినియోగించే వారి ఇళ్లల్లో నెలకు రూ.1000 నుంచి రూ.2000 బిల్లు వస్తుంది.


అయితే ఈ బిల్లు కట్టడానికి కూడా ప్రజలు ఆందోళన పడతారు. కానీ బాలీవుడ్ తారలు మాత్రం లక్షల్లో బిల్లులు కడతారు. విస్తీర్ణంలోనే కాదు అత్యాధునిక లగ్జరీతో అలంకరించిన వారి ఇల్లు, భారీ విద్యుత్ వినియోగానికి కారణం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దీపికా పదుకొనే (Deepika Padukone) ను మొదలుకొని షారుఖ్ ఖాన్ (Sharukh Khan)వరకు వీళ్లంతా కూడా చాలా లగ్జరీ ఇళ్లల్లోనే జీవితాన్ని గడుపుతున్నారు. మరి వీరు ప్రతినెల ఎంత కరెంట్ బిల్లు కడతారు అనే విషయం అందరిలో అనుమానాలను రేకెత్తిస్తూ ఉంటుంది. మరి ఈ కథనం ద్వారా ఎవరు ఎంత బిల్ పే చేస్తున్నారు అనే విషయం ఇప్పుడు చూద్దాం..

షారుఖ్ ఖాన్:


బాలీవుడ్ లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న సెలబ్రిటీస్ లో షారుఖ్ ఖాన్ ప్రథమ స్థానంలో ఉంటారు. ఇటీవలే మన్నత్ ఇంటిని అత్యంత సుందరంగా నిర్మించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆయన లగ్జరీ జీవితానికి ఈ ఇల్లు ప్రతీక అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ ఇంటికి ఆయన నెలకు సుమారుగా రూ.45 లక్షల వరకు విద్యుత్ బిల్లు కడుతున్నారట. అద్భుతమైన లైటింగ్, లగ్జరీ సౌకర్యాలకు ప్రసిద్ధి అయిన ఈ మన్నత్ ఎలక్ట్రిక్ ఖర్చు కూడా సూపర్ స్టార్ హోదాను ప్రతిబింబిస్తుంది అని చెప్పవచ్చు.

సల్మాన్ ఖాన్:

వేలకోట్ల ఆస్తులు ఉన్నా నిరాడంబరంగా జీవించే అతి తక్కువ మంది సెలబ్రిటీస్ లో సల్మాన్ ఖాన్ (Salman Khan) మొదటి స్థానంలో నిలుస్తారు. బాలీవుడ్ కండల వీరుడు గా గుర్తింపు తెచ్చుకున్న సల్మాన్ ఖాన్ ముంబైలోని గెలాక్సీ అపార్ట్మెంట్ లో జీవిస్తున్నారు. ఇంత నిరాడంబరంగా ఉన్నప్పటికీ ఆయన తన ఇంటికి నెలవారి కట్టే కరెంట్ బిల్లు విలువ అక్షరాలా రూ.25 లక్షలు.. ఇది ఆయన ఇంటిలో ఆయన అనుభవిస్తున్న విలాసానికి నిదర్శనం అనడంలో సందేహం లేదు.

దీపిక పదుకొనే..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న దీపికా పదుకొనే (Deepika Padukone) ఇటీవలే తెలుగు చిత్రాలలో కూడా నటిస్తోంది. తన భర్త రణవీర్ సింగ్ (Ranveer Singh) తో కలిసి సముద్ర తీర అపార్ట్మెంట్ లో నివసిస్తోంది. మరి ఈ ఇంటికి ఆమె కట్టే కరెంట్ బిల్లు నెలకు అక్షరాలా రూ.15 లక్షలు. ఒకరకంగా చెప్పాలి అంటే దీపిక కాస్త పొదుపరి కాబట్టి.. అక్కడక్కడ విద్యుత్ ఆదా చేస్తుందట. అంత ఆధా చేస్తుంది కాబట్టే రూ.15 లక్షల వరకు వస్తుందని సమాచారం.ఏది ఏమైనా ఈ సెలబ్రిటీలు లక్షల్లో నెలకు కరెంట్ బిల్లులు కడుతుంటే అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×