Samantha: ఎన్నాళ్ల నుంచో అభిమానుల మనస్సులో తొలుస్తున్న అనుమానానికి ఇప్పుడు సమాధానం దొరికింది. ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట అక్కినేని నాగ చైతన్య, సమంత ఎందుకు విడిపోయారు .. ఎందుకు విడిపోయారు.. వారి మధ్య వచ్చిన సమస్య ఏంటి.. ? అన్న ప్రశ్నకు నేడు బదులు దొరికింది.
ఏ మాయ చేసావే సినిమాతో సమంత కెరీర్ ను మొదలుపెట్టింది. ఆ తరువాత అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్ గా మారింది. మధ్యలో సిద్దార్థ్ తో ప్రేమాయణం నడిపిన ఈ చిన్నది.. తన అసలైన సోల్ మేట్, తన మొదటి సినిమా హీరోనే అని తెలుసుకుంది. అలా చై- సామ్ ప్రణయం.. ఇరుకుటుంబాల అనుమతితో పరిణయంగా మారింది.
ఇండస్ట్రీలో వీరిద్దరి జంటను చూసి మురిసిపోనీ వారు లేరు అంటే అతిశయోక్తి కాదు. అయితే ఎవరి దిష్టి కళ్లు పడ్డాయో.. ఏమో కానీ, నిండా నాలుగేళ్లు కూడా నిండకుండానే ఈ జంట విడాకులు తీసుకొని విడిపోయారు. ఏ రోజు అయితే వీరు విడాకులు ప్రకటించారో.. ఆరోజు నుంచి ఇప్పటివరకు చై- సామ్ ఎదురెదురుగా కనిపించిన పాపాన పోలేదు. అసలు ఈ జంట ఎందుకు విడిపోయారా అని ఆరాలు తీస్తే .. ఎన్నో కారణాలు బయటపడ్డాయి.
ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో సామ్ చేసిన ఇంటిమేటెడ్ సీన్స్ వలన అక్కినేని కుటుంబం పరువు పోయిందని, అందుకే విడాకులు తీసుకున్నారని మాట్లాడారు. ఇంకొంతమంది చైకు మరొకరితో ఎఫైర్ ఉందని, అందుకే విడాకులు తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే అసలు నిజానిజాల కేవలం సామ్ కు , అక్కినేని కుటుంబానికి మాత్రమే తెలుసు. ఇక ఇప్పుడు మంత్రి కొండా సురేఖ .. వీరిద్దరి విడాకులకు కారణం కేటీఆర్ అంటూ చెప్పి పెద్ద బాంబ్ పేల్చారు.
Also Read: ఆ హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారు.. మంత్రి కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్
నాగ చైతన్య, సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. అక్కినేని నాగార్జున N కన్వెన్షన్ ను అడ్డుపెట్టుకొని సమంతను తన దగ్గరకు పంపాలని బ్లాక్ మెయిల్ చేశాడని.. నాగార్జున, సమంతను కేటీఆర్ వద్దకు వెళ్ళమంటే ఆమె నో అని చెప్పడంతో గొడవలు మొదలై.. వెళ్తే కేటీఆర్ దగ్గరకు వెళ్లు.. లేకపోతే విడాకులు తీసుకో అని చెప్పినట్టు మంత్రి చెప్పుకొచ్చారు. దీంతో సమంత అక్కినేని కుటుంబం నుంచి బయటకు రావడానికి ఇదే కారణమని చెప్పుకొస్తున్నారు.
ఇక కేవలం సమంత విషయంలోనే కాదు.. చాలామంది హీరోయిన్స్ జీవితాలను కేటీఆర్ నాశనం చేశాడని ఆమె తెలిపారు. ఇక ఇన్నాళ్లకు సామ్ – చై విడాకులకు అసలైన కారణం తెలియడంతో అభిమానులు.. ఇలా అయితే ఆమె విడాకులు తీసుకోవడమే మంచిది అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ వ్యాఖ్యలపై సమంత ఎలా స్పందిస్తుందో చూడాలి.