EPAPER

Jaggareddy: కేటీఆర్.. తప్పు నీదే.. కొండా సురేఖకు క్షణాపణలు చెప్పు: జగ్గారెడ్డి

Jaggareddy: కేటీఆర్.. తప్పు నీదే.. కొండా సురేఖకు క్షణాపణలు చెప్పు: జగ్గారెడ్డి

Jaggareddy Comments: సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి బీఆర్ఎస్, బీజేపీలపై ఫైరయ్యారు. గాంధీభవన్ లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘బీజేపీ రైతు దీక్ష చేపట్టింది. కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీలు ఇచ్చింది.. అధికారంలోకి వచ్చాక అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేశాం. డేటా సరిగ్గా లేకపోవడంతో మిగిలిన రుణమాఫీ చేయలేకపోయాం. రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కేసీఆర్ వదిలి వెళ్లారు.


తెలంగాణలో బీజేపీకి పట్టు లేదు. కేవలం ఉనికి కోసం బీజేపీ రైతు దీక్షతో ప్రయత్నాలు చేసింది. రైతుల గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదు. ప్రధాని మోడీ ప్రతి పేదవాడి అకౌంట్ లో రూ. 2 లక్షలు వేస్తా అన్నారు.. వేశారా?. పదేళ్లు ప్రధానిగా ఉండి ఎందుకు చేయలేదు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు.. ఇవ్వలేదు. రైతుల ఆదాయం డబుల్ చేస్తాం అన్నారు చేశారా..? రైతు నల్ల చట్టాలు తెచ్చింది మీరు కదా..? రైతుల మీదకు వెహికల్ ను తీసుకెళ్లి చంపింది మీరు కదా..? అప్పుడు ఎందుకు బీజేపీ రాష్ట్ర నాయకులు మాట్లాడలేదు.

Also Read: ట్రోలింగ్‌పై మళ్లీ స్పందించిన ఎంపీ రఘనందన్‌రావు.. ఈసారి ఏమన్నారంటే..?


మన్మోహన్ సింగ్ హాయంలో బంగారం ధర రూ. 28 వేలు ఉంటే.. మోడీ వచ్చాక రూ. లక్షకు చేరింది. తెలంగాణ మహిళలు ఎందుకు బీజేపీకి ఓటు వేశారో అర్ధం కావడం లేదు. గ్యాస్ సిలిండర్,పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అయినా కూడా ప్రజలు ఓట్లు వేసి 8 సీట్లు ఇచ్చారు. దీంతో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలకు కళ్లు నెత్తికెక్కాయి. ప్రజల మధ్యలో కాంగ్రెస్ నేతలు ఉంటారు. బీజేపీ నేతలు నటిస్తున్నారు.. వాళ్లు డ్రామా ఆర్టిస్టులు. తెలంగాణ రైతులకు మా విజ్ఞప్తి. రేవంత్ సర్కార్ చేసే ప్రయత్నాలకు అండగా ఉండండి.

మంత్రి కొండా సురేఖను రెచ్చగొట్టేవిధంగా కేసీఆర్, కేటీఆర్ లు విమర్శలు చేయించుకుంటున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కొండా సురేఖపై అవమానకరంగా పోస్టులు పెట్టడం సరికాదు. బీఆర్ఎస్ సోషల్ మీడియాను మందలించాల్సిన పెద్దరికం కేటీఆర్ తీసుకునేది ఉండే. కొండా సురేఖ ఆవేదన.. దుఃఖంతో ఉన్నారు. ఆమె ఫైర్ బ్రాండ్. ఆమెను ఎందుకు రెచ్చగొట్టారు. వ్యక్తిగత జీవితంలోకి వెళ్లి విమర్శలు చేసుకోవడం పద్ధతి కాదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు దండలు వేసిన వాళ్ళందరినీ అలానే అనుకుంటారా..? దండలు వేయడం తప్పా..?

కాంగ్రెస్ ఎప్పుడైనా అలా చేసిందా? ఆ జ్ఞానం బీఆర్ఎస్ కు లేదా? రాజకీయ పరిపూర్ణత లేని నాయకుడిగా కేటీఆర్ మాట్లాడుతున్నాడు. కొండా సురేఖకు వెంటనే క్షమాపణలు చెప్పి..ఇప్పటికైనా ఈ వివాదాన్ని బీఆర్ఎస్ ఆపాలి.

Also Read: మీ వ్యాఖ్యలతో కేటీఆర్ ఇంటొళ్లు బాధపడరా..? వాళ్లు ఆడబిడ్డలు కారా..? : కొండా సురేఖపై సబిత సీరియస్

దేశ ప్రజలకు రాహుల్ గాంధీ కుటుంబం గురించి తెలుసు. దేశాన్ని 52 ఏళ్ల పాటు రాహుల్ గాంధీ కుటుంబం పాలించింది. మీ మాదిరి రాహుల్ గాంధీ కుటుంబం అని భావించకండి. గాంధీ కుటుంబం మీద పగా పట్టిన మోడీ.. సభ్యత్వం రద్దు చేసి.. ఆయన ఉండే బంగ్లాను ఖాళీ చేయించారు. రాహుల్ గాంధీ చరిత్ర తెలుసుకో..ఎందుకు నోరు పారేసుకుంటున్నావ్ కేటీఆర్. నెహ్రూ పుట్టిన ఆనంద్ భవన్ ను కూడా.. దేశానికి రాసిచ్చారు. రాహుల్ గాంధీ చెబితేనే.. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. అప్పుడు మీరు మంత్రులు.. కేసీఆర్ సీఎం అయ్యారు.

మూసీ సుందరీకరణ డబ్బుతో రాహుల్ గాంధీ బతుకుతడా..? ఏం అయిన అర్ధం ఉందా.? కేసీఆర్ ఫీల్డ్ వర్కర్, ఫీల్డ్ లీడర్.. కానీ కేటీఆర్ ఫీల్డ్ వర్కర్స్. కేసీఆర్ దగ్గర ట్రైనింగ్ తీసుకో కేటీఆర్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంచి సిన్సియర్ ఆఫీసర్.. కానీ లీడర్ కాదు. అందుకే ఆయన మాటలను సిరియస్ గా తీసుకోవద్దు’ అంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

Related News

Minister Seethakka: వారి మరణానికి కారణం మీరు కాదా..? : ప్రధాని మోదీకి మంత్రి సీతక్క కౌంటర్

Scircilla: నేతన్నలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం… దసరా కానుకగా మీకు…

Narsingi: నార్సింగిలో బంగారు గని..?

CM Revanth Reddy: మా ప్రభుత్వానికి ఎవరిమీద కోపం లేదు.. కానీ,… : సీఎం రేవంత్ రెడ్డి

KTR: ఉన్న సిటీకే దిక్కులేదు.. ఫోర్త్ సిటీనా? : కేటీఆర్

TPCC Chief: కేటీఆర్.. అతి తెలివిగా ప్రశ్నలు వేయకు: మహేష్ కుమార్ గౌడ్

Telangana Rice: దసరా పండుగ వేళ తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త… త్వరలోనే..

×