E-Paper
Advertisement

Konidela Surekha: అల్లుడు బన్నీ కోసం మేనత్త కీలక నిర్ణయం..!

Konidela Surekha: అల్లుడు బన్నీ కోసం మేనత్త కీలక నిర్ణయం..!
Advertisement

Konidela Surekha: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు చిరంజీవి (Chiranjeevi). ఇక ఆయన ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఆయన పట్టుదల, కృషి మాత్రమే కాదు.. ఆయన భార్య సురేఖ(Surekha)హస్తం కూడా ఉంది. ఈ విషయాన్ని చిరంజీవి ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు కూడా.. సినిమా ఇండస్ట్రీ నేపధ్య కుటుంబానికి చెందిన వారైనప్పటికీ.. కుటుంబ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ భర్తకు వెన్నెముకగా నిలిచారు సురేఖ. తన కుటుంబ సభ్యుల బాగోగులు మాత్రమే కాదు పుట్టింటి బాగోగులు చూసుకోవడంలో కూడా సురేఖ ముందు ఉంటారని మరోసారి నిరూపించారు. ఈ క్రమంలోనే తన మేనల్లుడు అల్లు అర్జున్(Allu Arjun) సమస్యల్లో ఉన్నాడని తెలిసి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయం తెలిసి అటు బన్నీ అభిమానులు సైతం బన్నీ మేనత్త పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మేనల్లుడి కోసం అలాంటి పని..

Advertisement

మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ పేరుకే అల్లు అర్జున్ కి మేనత్త అయినా.. తన కొడుకు రామ్ చరణ్ (Ram Charan)కంటే కూడా ఎక్కువగా అల్లు అర్జున్ ను ఆదరించారట. ప్రతి విషయంలో కూడా అల్లు అర్జున్ కి అండగా నిలిచారట సురేఖ. అల్లుడికి కష్టం వస్తే తల్లి కంటే ఎక్కువగా బాధపడుతారట. అందుకే ఇప్పుడు తన మేనల్లుడు కష్టాల్లో ఉన్నాడని తెలిసి, అల్లుడి కోసం అండగా నిలిచింది. ఈ నేపథ్యంలోనే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సురేఖ తన మేనల్లుడు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి త్వరగా బయటపడాలని, ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ 1000 మందికి అన్నదానం చేయాలని నిర్ణయం తీసుకున్నారట. ముఖ్యంగా బన్నీ పేరు పైన ప్రత్యేకంగా పూజలు, అర్చనలు చేయిస్తూ.. ఈ కేసు నుంచి ఆయన త్వరగా బయటపడాలని ప్రార్థనలు చేస్తున్నారట. ఇక ఈ విషయం తెలిసి కనీసం అల్లు అర్జున్ కుటుంబ సభ్యులకైనా ఈ ఆలోచన ఎందుకు రాలేదు? అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరొకవైపు మేనల్లుడి కోసం మేనత్త పడే తపన అందరికీ ముచ్చట వేస్తోంది అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. మరి సురేఖ పూజలు ఫలించాలని కూడా కోరుతున్నారు.

చిక్కుల్లో పడ్డ అల్లు అర్జున్..

Advertisement

అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ సినిమా బెనిఫిట్ షో డిసెంబర్ 4న వేశారు. అందులో భాగంగానే హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న సంధ్యా థియేటర్ కి ర్యాలీ నిర్వహించుకుంటూ ఫ్యామిలీతో వచ్చారు బన్నీ. బన్నీని చూడడానికి అభిమానులు ఎగబడగా.. బౌన్సర్లు కాస్త హద్దు మీరారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ విషయంపై అల్లు అర్జున్ పై కేసు నమోదు అయింది. దీనికి తోడు మరొకవైపు తొక్కిసలాటలో రేవతి మరణించగా ఆమె కొడుకు హాస్పిటల్ పాలయ్యారు. ఈ విషయాలపై అరెస్టు అయిన అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ మీద వచ్చారు. కానీ ఎప్పుడైనా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే తన మేనల్లుడికి ఎలాంటి సమస్యలు రాకూడదని, కేసు కొట్టి వేయాలనే నేపథ్యంలో సురేఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయాలు వైరల్ గా మారుతున్నాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×