Manchu Vishnu: నేడు సినీ ప్రముఖులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన విషయం తెల్సిందే. గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో ఉన్న సమస్యల గురించి వారి మధ్య చర్చలు జరిగాయి. ఈ భేటీకి హీరోలు వెంకటేష్, నాగార్జున, నితిన్, వరుణ్ తేజ్, శివబాలాజీ తో పాటు దర్శకులు త్రివిక్రమ్, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, బాబీ, వంశీ తదితరులు కలిశారు. అలాగే నిర్మాతలుగా సురేష్ బాబు, నాగవంశీ, సునీల్ నారంగ్, సుప్రియ, మురళీ మోహన్ తదితరులు హాజరయ్యారు. ఈ చర్చల్లో ఇండస్ట్రీ బాగు గురించి రేవంత్ రెడ్డి పలు పాయింట్స్ ను వివరించారు.
తెలంగాణ లోని ఎకో టూరిజం, టెంపుల్ టూరిజాన్ని ప్రమోట్ చేయాలని, గంజాయి, డ్రగ్స్ తో పాటు సామాజిక అంశాలపైన సినిమా పరిశ్రమ ప్రచారం చేయాలనీ తెలిపారు. బెనిఫిట్ షో విషయంలో జరిగిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని.. బెనిఫిట్ షోల విషయంలో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోమని స్పష్టం చేశారు. అంతేకాదు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన దానికే కట్టుబడి ఉంటామని, బెనిఫిట్ షోలు ఉండవని ఇండస్ట్రీ పెద్దలకు సీఎం తేల్చిచెప్పారు.
Konidela Surekha: అల్లుడు బన్నీ కోసం మేనత్త కీలక నిర్ణయం..!
ఇక ఇంతమందిలో మా ప్రెసిడెంట్ మంచు విష్ణు కనిపించకపోవడం పెద్ద చర్చకు దారితీసింది. ఇండస్ట్రీ బాగుకోరే పదవిలో ఉన్న విష్ణునే అసలు ఈ భేటీకి హాజరుకాకపోవడంపై పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో జగన్ సీఎం గా ఉన్నప్పుడు.. సినీ ప్రముఖుల భేటీలో కూడా విష్ణు కనిపించలేదు. అందరితో పాటు నేను వెళ్లడం ఏంటి అనుకున్నాడా.. ? లేక మనమెందుకులే అనుకున్నాడా అనేది తెలియదు కానీ, చర్చలు అయిన అనంతరం మాత్రం సీఎం రేవంత్ రెడ్డికి ఎక్స్ ద్వారా థాంక్స్ చెప్తూ పోస్ట్ చేశాడు.
“ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ. ఎ. రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ. మల్లు భట్టి విక్రమార్క గారు, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ సహా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. పరిశ్రమకు సానుకూల వాతావరణాన్ని పెంపొందించడంలో వారి చురుకైన మద్దతును అభినందిస్తున్నాము. తెలంగాణ ప్రభుత్వంతో ఫలవంతమైన అనుబంధం కోసం ఎదురుచూస్తున్నాం” అంటూ చెప్పుకొచ్చాడు.
Venkatesh: కొడుకు ఇండస్ట్రీ ఎంట్రీపై వెంకీ మామ క్లారిటీ..!
ఇలా ట్వీట్స్ వేసే బదులు నువ్వు కూడా వెళ్లొచ్చు కదా అన్నా అని కొందరు. నీకు ఇండస్ట్రీ శ్రేయస్సు కన్నా కన్నప్ప సినిమా ఎక్కువ అయిపోయింది అని ఇంకొందరు.. నువ్వు ఎందుకు వెళ్ళలేదు అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే ఈ మధ్యకాలంలో మంచు కుటుంబంలో ఆస్తి తగాదాలు జరిగిన విషయం తెల్సిందే.
విష్ణు తమ్ముడు మనోజ్.. తన అన్న తనను చంపాలనుకుంటున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జనరేటర్ లో పంచదార వేసి మనోజ్ కుటుంబాన్ని చంపాలని చూశాడట విష్ణు. ఇక ప్రస్తుతం ఈ కేసు పై పోలీసులు విచారిస్తున్నారు. మరి ఈ అన్నదమ్ముల ఆస్తితగాదాల కేసు ఎక్కడవరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.
Today, the Chief Minister of Telangana Sri. A. Revanth Reddy garu, Deputy Chief Minister Sri. Mallu Bhatti Vikramarka garu, and Cinematography Minister Sri. Komatireddy Venkat Reddy garu met with representatives of the Telugu Film Industry, including the 'Movie Artists…
— Vishnu Manchu (@iVishnuManchu) December 26, 2024