E-Paper
Advertisement

Kovai Sarala: అక్కడ తండ్రి చనిపోతే.. ఇక్కడ డప్పుకొట్టి ఎంజాయ్ చేశా..

Kovai Sarala: అక్కడ తండ్రి చనిపోతే.. ఇక్కడ డప్పుకొట్టి ఎంజాయ్ చేశా..
Advertisement

Kovai Sarala: స్టార్ కమెడియన్ కోవై సరళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు లేడీ కమెడియన్సులో రమాప్రభ తర్వాత అంతటి గొప్ప పేరు తెచ్చుకున్న లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు ఉంది. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారిన కోవై సరళ ఈ మధ్య జోరు తగ్గించి అప్పుడప్పుడు ఒక సినిమా చేస్తూ ఉంది. ఇక సినిమాలు తగ్గించి బుల్లితెరపై జడ్జిగా మారింది. ఈ మధ్యనే ఒక తెలుగు షోలో మెరిసిన కోవై సరళ తాజాగా ఆలీ యాంకరింగ్ చేస్తున్న ఆలీతో సరదాగా అనే షోకు గెస్ట్ గా విచ్చేసింది. ఈ షోలో ఆమె ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంది.

ఆలీ, కోవై సరళ కలిసి ఎన్నో సినిమాలు చేశారు. వీరిద్దరికి తీసుకొచ్చిన సినిమా దేశముదురు. ఇక అందులోని డైలాగ్ తోనే ఆమె ఎంట్రీ ఇచ్చింది. కోవై తన ఇంటిపేరు కాదని. అప్పట్లో కోయంబత్తూర్ ను కోవై అని పిలిచేవారని.. అలా తనపేరు కోవై సరళగా మారిందని చెప్పుకొచ్చింది. కమల్ హాసన్ సరసన హీరోయిన్ గా చేసే అవకాశం తనకు వచ్చిందని, అప్పట్లో తన డేట్ కోసం మూడు నెలలు వారు ఎదురుచూసినట్లు చెప్పుకొచ్చింది. వారంతా చాలా సైలెంట్ ఉండేవాళ్ళని, తానే సెట్ లో అరిచేదాన్ని అని తెలిపింది.

Advertisement

ఇకపోతే ఈ భాష కేవలం సినిమా కోసమే కాదని, తనకు నచ్చినవాళ్లతో ఇలాగే మాట్లాడి అలవాటు అయ్యిపోయింది. ఇప్పుడు అంటే మెచ్యూరిటీగా మాట్లాడుతున్నాను కానీ, ఒరిజినల్ అలాగే ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇక తన ఫేవరేట్ కమెడియన్ ఆలీనే అని తెలిపిన సరళ.. అప్పట్లో తనకు ప్రేమిస్తున్నాను అని కూడా చెప్పినట్లు చెప్పి నవ్వేసింది. ఇక తాను ఇప్పటివరకు పెళ్లి చేసుకోవడానికి కారణం కూడా చెప్పుకొచ్చింది. “పెళ్లి చేసుకొని జీవించాలి అనే కండీషన్ లేదు కదా.. ఇప్పుడున్న హీరోస్ లో పెళ్లి చేసుకోవాలి అంటే అల్లు అర్జున్ ను చేసుకుంటా..” అని సిగ్గుపడింది.

కోవై సరళ తన తండ్రి మరణాన్ని గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యింది. ” నేను అప్పుడు ఊటీలో షూటింగ్ చేస్తున్నాను. ఆ షూటింగ్ సీన్ వచ్చేసి డప్పుకొట్టుకుంటూ డ్యాన్స్ వేసి ఎంజాయ్ చేయాలి.. అంతలోనే నా తండ్రి చనిపోయినట్లు వార్త తెల్సింది. వెంటనే నేను వెళ్ళాలి. కానీ, అది చిన్న సినిమా. అందరూ నాకోసం ఎదురుచూస్తున్నారు. రాను అని చెప్పలేను. ఇప్పుడు కూడా నా సొంత వాళ్లు చెప్తున్నారు.. వీళ్లకు డబ్బే.. నాన్న చనిపోయినా కూడా షూటింగే అని.. అక్కడ పరిస్థితి వాళ్లకు తెలియదు” అని ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×