BigTV English

Prabhas: బిజిమెన్ డాటర్ తో త్వరలో డార్లింగ్ పెళ్లి.. రహస్యంగా కానిచ్చేస్తున్న శ్యామలాదేవి..!

Prabhas: బిజిమెన్ డాటర్ తో త్వరలో డార్లింగ్ పెళ్లి.. రహస్యంగా కానిచ్చేస్తున్న శ్యామలాదేవి..!

Prabhas:రెబల్ స్టార్ ప్రభాస్ గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. తన నటనతో పాన్ ఇండియా స్టార్ గా పేరు సొంతం చేసుకున్న ఈయన.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మోస్ట్ ఎలిజిబుల్ హీరోగా కూడా నిలిచిపోయారు. నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇంకా పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ గానే కొనసాగుతూ.. అభిమానులను పూర్తిస్థాయిలో హర్ట్ చేస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ డార్లింగ్ పెళ్లి కోసం అటు సినీ సెలబ్రిటీలు కూడా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. వేలకోట్ల ఆస్తికి అధిపతి అయినా సరే ఇప్పటివరకు పెళ్లికి నోచుకోలేదని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తూ ఉంటారు.


ఈ ఏడాదే ప్రభాస్ పెళ్లి..

ఇదిలా ఉండగా.. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి (Shyamala Devi) రహస్యంగానే పెళ్లి సంబంధాలు చూస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి శ్యామలాదేవి మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి ఈ ఏడాది.. వచ్చే ఏడాది అంటూ కప్పిపుచ్చుతూనే ఉన్నారు. కానీ ఇప్పటివరకు డార్లింగ్ పెళ్లి గురించి ప్రస్తావన లేదు. ఇక మరొకవైపు ప్రభాస్ త్రిష (Trisha), అనుష్క(Anushka ) వంటి హీరోయిన్లతో ప్రేమాయణం నడిపారు అంటూ కూడా వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలలో నిజం లేదు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన మరో విషయం ఏమిటంటే.. ప్రభాస్ తో పాటు త్రిష, అనుష్క కూడా ఒంటరిగానే తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు.


ప్రభాస్ పెళ్లిపై బిగ్ అప్డేట్..

ఇకపోతే ఎప్పటిలాగే ఇప్పుడు కూడా ప్రభాస్ పెళ్లికి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. రెబల్ స్టార్ ఫ్యామిలీ నుంచి ఒక బిగ్ సీక్రెట్ బయటకు వచ్చింది. ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయిందని, ఈ వ్యవహారాన్ని ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి రహస్యంగానే నడిపిస్తున్నారని సమాచారం. హైదరాబాదుకు చెందిన ఒక బడా బిజినెస్ మాన్ డాటర్ తో ప్రభాస్ పెళ్లి కాబోతోందని.. ముఖ్యంగా శ్యామలాదేవి ఒక పెద్దింటి అమ్మాయిని చూసి లోలోపలే ప్రభాస్ పెళ్లి పనులు మొదలు పెట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇలా ప్రభాస్ పెళ్లిపై పుకార్లు రావడం ఇదేమి కొత్త కాకపోయినా.. తాజాగా వినిపిస్తున్న సమాచారంలో ఎంతో కొంత నిజం ఉండే ఉండొచ్చు అని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. పైగా ప్రభాస్ వయసు ఇప్పటికే 45 ఏళ్లు ..ఇంకా పెళ్లి చేసుకోలేదు అందుకే లోలోపలే అన్నీ కాని చేస్తున్నారు అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరికొంతమంది ఈ వార్తలు నిజమే అని చెబుతున్నారు. ఎందుకంటే ఇటీవల బాలకృష్ణ (Balakrishna) హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో కి .. ‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా గెస్ట్ గా వచ్చిన రామ్ చరణ్ (Ram Charan) కూడా ప్రభాస్ పెళ్లి ఈ యేడాదే అన్నట్టు క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు ఈ వార్తలు రావడంతో ఇది నిజమేనని కామెంట్లు చేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ.. దీనిపై ఎవరో ఒకరు స్పందిస్తే తప్ప రూమర్స్ కి చెక్ పెట్టలేని పరిస్థితి అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

VT 15: భయపెట్టడానికి సిద్ధమవుతున్న వరుణ్ తేజ్.. ఇండో కొరియన్ అంటూ..!

ప్రభాస్ సినిమాలు.

ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ప్రభాస్ మారుతి (Maruthi) డైరెక్షన్లో ‘రాజా సాబ్’, హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో ‘ఫౌజీ’, సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ‘స్పిరిట్’ చిత్రాలతో పాటు.. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ‘సలార్ 2’ , నాగ్ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వంలో ‘కల్కి 2’ చిత్రాలు చేయనున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×