Apsara Murder Case: అప్సర హత్య కేసులో సంచలన తీర్పు వెల్లడించింది రంగారెడ్డి న్యాయస్థానం. కేసులో దోషి సాయిృష్ణకు జీవితఖైదు విధించింది. సాక్ష్యాలు తారుమారు చేసినందుకు మరో ఏడేళ్లు జైలు శిక్షవిధించింది. జీవిత ఖైదుతోపాటు రూ.10 వేలు జరిమానా విధించింది. మృతురాలి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇచ్చేలా ఆదేశాలు ఇచ్చింది.
అసలేం జరిగింది?
తమిళనాడుకు చెందిన అప్సర నటన హత్య కేసులో రంగారెడ్డి న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. డిగ్రీ చదివిన అప్సర పలు తమిళ చిత్రాల్లో నటించింది. మోడలింగ్‌పై ఆసక్తితో టాలీవుడ్‌లో నటించేందుకు మూడేళ్ల కిందట అంటే సరిగ్గా 2022 ఏడాదిలో హైదరాబాద్‌కు వచ్చింది. ఆమె తండ్రి ఒక ఆశ్రమంలో పని చేస్తున్నారు.
తల్లితో కలిసి అప్సర సరూర్‌నగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. అప్సర తరచూ దేవాలయాలకు వెళ్లేది. ఆ సమయంలో పూజారి సాయికృష్ణతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆపై శారీరక సంబంధానికి దారి తీసింది. ఆమె గర్భం దాల్చగా అబార్షన్ సైతం చేయించాడు. తనను పెళ్లి చేసుకోవాలని సాయిపై ఒత్తిడి తెచ్చింది ఆమె. లేకుంటే ఇద్దరి మధ్య రిలేషన్ షిప్ బయటపెడతానంటూ సాయిని హెచ్చరించింది.
ఈ విషయం బయటకు వస్తే పరువు పోతుందని భావించాడు సాయి. ఈమెని శాశ్వతంగా తప్పించుకోవాలని భావించాడు. చివరకు అప్సరను హత్య చేయాలని స్కెచ్ వేశాడు. పలుమార్లు ప్లాన్ చేసినా సక్సెస్ కాలేదు. చివరకు ఐదోసారి సాయి చేతికి అప్సర దొరికిపోయింది. సరిగ్గా 2023 జూన్ 3న కోయంబత్తూరు వెళ్తున్నట్లు విమాన టికెట్లు తీసుకున్నానని నమ్మించాడు సాయి. అప్సర కూడా లగేజీతో ట్రావెల్‌కి రెడీ అయ్యింది.
ALSO READ: కారు యాక్సిడెంట్ లో యువతి మృతి, కట్ చేస్తే భర్త హంతకుడు
అప్సర హత్యకు ప్లాన్
శంషాబాద్‌లో దించి వస్తానని చెప్పి తన కారులో ఆమెని తీసుకెళ్లాడు. రాత్రి 11 గంటలకు సుల్తాన్‌పల్లిలోని గోశాల వద్దకు వెళ్లారు సాయి-అప్సర. తెల్లవారు జామున గోశాల సమీపంలోని ఓ వెంచర్ వద్దకు వెళ్లారు. అప్పటికే అప్సర నిద్రలోకి జారుకుంది. కారు సీటు కవర్‌ను ఆమె ముఖంపై వేసి ఊపిరాడకుండా చేయడంతో ఆమె స్పృహ కోల్పోయింది.
ఈలోగా తన కారులో ఉంచిన రాయిని తీసుకొని ఆమె తలపై పలుమార్లు బలంగా కొట్టాడు. స్పాట్‌లో అప్సర మృతి చెందింది. మృతదేహంపై కవర్ కప్పి కారులో ఉంచి ఇంటికి తెచ్చి పార్కు చేశాడు. ఎప్పటి మాదిరిగానే ఇంటికి వచ్చేసి తన కార్యకలాపాల్లో నిమగ్నం అయ్యాడు.
మూడు రోజులపాటు కారులో డెడ్‌బాడీ
రెండు రోజుల తర్వాత మృతదేహాన్ని అర్థరాత్రి వేళ సరూర్ నగరలోని మైసమ్మ ఆలయ సమీపంలోని మ్యాన్ హోల్‌లో పడేశాడు. ఆ ప్రాంతంలో వాసన రావడంతో రెండు ట్రక్కుల మట్టి తెప్పించి మ్యాన్ హోల్‌లో వేయించాడు సాయి. దానిపై కాంక్రీట్ వేసి మూసేశాడు. చివరకు అప్సర తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో అసలు విషయాలు వెలుగు చూశాయి.
ఈ కేసులో మొత్తం 30 మంది సాక్షులకు 28 మంది సాక్షుల వాదనను పరిగణలోనికి తీసుకుంది న్యాయస్థానం. అప్సర హత్య చేయడానికి అవసరమైన టెక్నికల్ ఎవిడెన్స్‌తో పాటు మిగతా ఆధారాలు పరిశీలించారు న్యాయమూర్తి. వాటిని పరిగణలోకి తీసుకుని తీర్పు వెల్లడించింది కోర్టు. నిందితుడు వెంకట సాయి కృష్ణ వినిపించిన వాదనలను పరిగణలోనికి తీసుకోలేదు.