VT 15:మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ (Varun Tej) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మెగా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు కానీ ఇప్పటివరకు మిగతా మెగా హీరోల రేంజ్ లో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోలేకపోయారు. అయినా సరే అభిమానులను అలరించడానికి హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు కొత్త కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.ముఖ్యంగా కెరియర్ మొదటి నుంచి డిఫరెంట్ ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న ఈయన.. ఎంత కష్టపడినా ఎన్ని ప్రయోగాలు చేసినా.. కలిసి రావడం లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటీవల వచ్చిన ‘మట్కా’ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతారేమో అనుకుంటే.. ఆ సినిమా మరింత ఘోరంగా అట్టర్ ప్లాఫ్ గా నిలిచింది. దీంతో ఆ తర్వాత సినిమా విషయంలో ఎంతో జాగ్రత్త వహించి.. ‘ఎక్స్ప్రెస్ రాజా’, ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ లాంటి ఎంటర్టైనర్ చిత్రాలను తీసిన మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) కి అవకాశం ఇచ్చారు వరుణ్ తేజ్.
మేర్లపాక గాంధీ డైరెక్షన్లో వరుణ్ 15వ మూవీ..
ఈ నేపథ్యంలోనే ఈ సినిమా విషయంపై అభిమానులతో పంచుకుంటూ ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు. ఇండో – కొరియన్ మూవీ గా వరుణ్ తేజ్ కెరియర్లో 15వ మూవీ గా తెరకెక్కుతోంది. ఈ నేపథ్యంలోనే షూటింగ్ పై అప్డేట్ ఇస్తూ మేకర్స్ కూడా ఒక ప్రోమో ని విడుదల చేశారు. ఆ ప్రోమోలో హీరో వరుణ్ తేజ్ ఒక చీకటి గదిలో కూర్చొని ఉండగా.. కమెడియన్ సత్య(Sathya ) వరుణ్ దగ్గరికి వెళ్లి.. వెలుగు, చీకటి కామన్.. బయటకి వచ్చే బ్రో అంటే.. అంత సీన్ లేదు సమ్మర్ కదా కరెంటు పోయింది అని అంటాడు వరుణ్.. ఆ మాట అనగానే కరెంటు వచ్చేస్తుంది. దానికి సత్యా కూడా చూసావా బ్రో నేను రాగానే నీ లైఫ్ లోకి కూడా వెలుగు వచ్చింది అంటూ కామెంట్ చేస్తాడు. ఇంతకీ తర్వాత సినిమా ఏంటి బ్రో అని వరుణ్ ను అడిగితే.. ఈసారి మనది ఎక్స్ప్రెస్ రాజా, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మేర్లపాక గాంధీతో సినిమా అని వరుణ్ చెప్తాడు.. దాంతో వెంటనే నువ్వు దీనికంటే చీకట్లో ఉండడమే బెటర్ బ్రో అని సత్య అక్కడి నుంచి వెళ్లబోతుంటే.. అంతలోనే డైరెక్టర్ గాంధీ అక్కడికి వస్తాడు. అతన్ని చూడగానే వావ్ సూపర్ డైరెక్టర్ అంటూ అతని పాదాలు తాకబోయే ప్రయత్నం చేస్తాడు సత్య ..
Mohan Lal: అబ్బే అస్సల్ సెట్ అవ్వలేదు… చిరు గాడ్ ఫాదర్‌పై మోహన్ లాల్ షాకింగ్ కామెంట్..!
ఇండో – కొరియన్ డ్రామాలో మూవీ..
ఇక మరి సినిమాలో నేనున్నానా అంటే.. నువ్వు లేకుండా సినిమానా.. నీవల్లే చాలా సినిమాలు హిట్ అవుతున్నాయి అంటూ పొగుడుతాడు వరుణ్ తేజ్.. ఆ తర్వాత సత్యా సంబరపడిపోయి అవును బయట కూడా ఇదే అనుకుంటున్నారు అంటూ కామెంట్ చేస్తాడు. ఇక కథ చెప్పండి అనగానే వెంటనే కొరియన్ రైటర్ ని రంగంలోకి దింపేస్తారు. ఇక ఆ అమ్మాయి చేసిన కామెడీ బాగా వర్క్ అవుట్ అయింది. ఇక ఇందులో సినిమా యూనిట్ సినిమా గురించి రివీల్ చేశారు. కొరియన్ బ్యాక్ డ్రాప్ లో హార్రర్ కామెడీ జానర్ గా తెరకెక్కనుంది అని, షూటింగ్ కూడా ఆల్రెడీ మొదలైందని మంచి హైప్ ఇచ్చారు. మొత్తానికైతే యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమాతో నైనా వరుణ్ గ్రాండ్ సక్సెస్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Eesari BLOCKBUSTER EXPRESS route 😎
Korea’s chills meet India’s thrills❤️🔥#VT15 Shoot begins with a super fun promo💥💥
Brace yourselves for an Indo-Korean horror comedy that’s going to be hauntingly hilarious and hilariously haunting 🐉🥳
Mega… pic.twitter.com/0PjFeXxwFs
— UV Creations (@UV_Creations) March 26, 2025