BigTV English

Krithi Shetty: హీరోయిన్ కృతి శెట్టి.. స్టార్ హీరో అజిత్ సిస్టరా..!

Krithi Shetty: హీరోయిన్ కృతి శెట్టి.. స్టార్ హీరో అజిత్ సిస్టరా..!
Krithi Shetty latest news

Krithi Shetty latest news(Tollywood celebrity news):

ఇండస్ట్రీకి వచ్చి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకున్న నటీమణులలో కృతి శెట్టి ఒకరు. ‘ఉప్పెన’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఫస్ట్ మూవీతోనే అభిమానుల హృదయాల్లో చెదరని స్థానం సంపాదించుకుంది. ఈ సినిమాతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. అందులో కొన్ని సినిమాలు హిట్ కాగా మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి.


ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకి తెలుగులో అవకాశాలు కరువయ్యాయి. దీంతో తమిళ ఇండస్ట్రీకి చెక్కేసి.. అక్కడ బాగా స్పీడ్ పెంచేసింది. దాదాపుగా రెండు మూడు సినిమాలను లైన్‌లో పెట్టేసింది. అందులో స్టార్ హీరో అజిత్‌తో ఓ సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే అందులో హీరో అజిత్‌కు జోడీగా హీరోయిన్‌గా కాకుండా.. సిస్టర్ రోల్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా మొత్తం చెల్లెలి సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఆ కారణంగానే ఈ అమ్మడు ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాలో అజిత్‌కు సిస్టర్ రోల్‌లో నటిస్తుందని తెలియడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×