BigTV English

Peddapuram Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. పెద్దాపురంలో చినరాజప్ప హ్యాట్రిక్ కొట్టడం ఖాయమా?

Peddapuram Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. పెద్దాపురంలో చినరాజప్ప హ్యాట్రిక్ కొట్టడం ఖాయమా?
ap politics

Peddapuram Assembly Constituency(AP Politics) :

ఆధ్యాత్మికంగా, చారిత్రాత్మకంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న నియోజకవర్గం పెద్దాపురం. ఇక్కడ.. కాంగ్రెస్ ఆరు సార్లు, టీడీపీ ఆరు సార్లు, సీపీఐ రెండు సార్లు, పీఆర్పీ ఒకసారి గెలిచింది. ప్రస్తుతం నిమ్మకాయ‌ల చినరాజ‌ప్ప రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్నారు.హ్యాట్రిక్‌ కొట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. 2019 జగన్ వేవ్ ను తట్టుకొని విజయం సాధించారు చినరాజప్ప. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ బలం పుంజుకొని.. పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీను కైవసం చేసుకుంది. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో బరిలో నిలిచేది ఎవరెవరో తేలిపోయింది. వైసీపీ నుంచి దవులూరి దొరబాబు బరిలోకి దిగుతున్నారు. టీడీపీ కూటమి నుంచి నిమ్మకాలయ చినరాజప్ప అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు ఖరారు చేశారు. మరి కాపు సామాజిక వర్గ ప్రజలు అత్యధిక సంఖ్యలో ఉన్న ఈ నియోజకవర్గంలో ఎవరి బలాలు ఎలా ఉన్నాయనే దానిపై బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్ ఎలక్షన్ సర్వే నిర్వహించింది. ఆ వివరాలను పరిశీలించే ముందు 2019 ఎన్నికల ఫలితాలను పరిశీలిద్దాం.


2019 ఎన్నికల ఫలితాలు..
YCP 39%
TDP 41%
JANASENA 16%
OTHERS 4%

2019 ఎన్నికల్లో పెద్దాపురం గడ్డపై విజయఢంకా మోగించారు నిమ్మకాయల చినరాజప్ప.అయితే అంతకుముందు ఆసక్తికర రాజకీయ పరిణామాలు జరిగాయి. టీడీపీ ఎంపీగా ఉన్న తోట నర్సింహం ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా తన భార్య తోట వాణికి పెద్దాపురం టికెట్‌ ఇవ్వాలని టీడీపీ అధిష్టానాన్ని కోరారు. అయితే టీడీపీ చినరాజప్ప వైపు మొగ్గు చూపడంతో ఆయన వైసీపీలో చేరి పెద్దాపురం నుంచి తన భార్యను బరిలోకి దింపారు. ఈ ఎన్నికల్లో తోట వాణి గట్టి పోటీ ఇచ్చినప్పటికి ఓడిపోయారు. అయితే అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల కారణంగా ప్రజలు రాజప్పనే మరోసారి గెలిపించారు. అయితే కేవలం 2.47 శాతం ఓట్లతోనే తోట వాణి ఓటమి చెందారు. అయితే ఆ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ దవులూరి దొరబాబు ఇన్‌డైరెక్ట్‌గా టీడీపీకి సపోర్ట్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే అంతటి జగన్‌ వేవ్‌లోనూ.. కాపు సామాజిక వర్గంలో మంచి పట్టున్న తోట కుటుంబానికి ఓటమి తప్పలేదు. మరోవైపు జనసేన నుంచి పోటీ చేసిన తుమ్మల రామస్వామి కూడా ఏకంగా 16 శాతం ఓట్లు సాధించారు. ఆయనకు కూడా కాపు సామాజిక వర్గం నుంచి బలమైన సపోర్ట్ లభించింది.ముందుగా వరుసగా రెండుసార్లు గెలిచిన నిమ్మకాలయల చినరాజప్పకు అనుకూలించే, ప్రతికూలించే అంశాలేంటో చూద్దాం.


నిమ్మకాయల చినరాజప్ప (TDP) ప్లస్ పాయింట్స్

  • వరుసగా రెండుసార్లు గెలుపొందడం
  • ప్రజల్లో మంచి గుర్తింపు ఉండటం
  • జనసేనతో కలిసి రానున్న పొత్తు
  • 2014-19 మధ్య హోంమంత్రిగా పనిచేయడం
  • ప్రస్తుత ప్రభుత్వ లోపాలను సమర్థవంతంగా ఎత్తి చూపడం
  • తన హయాంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి
  • బలంగా మద్ధతిచ్చే టీడీపీ క్యాడర్
  • నియోజకవర్గంలో నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమం
  • కాపు సామాజిక వర్గం బలంగా మద్ధతిచ్చే అవకాశం

నిమ్మకాయల చినరాజప్ప మైనస్‌ పాయింట్స్

  • జనసేన నేతలు ఎంత వరకు సహకరిస్తారన్న దానిపై అనుమానాలు

దవులూరి దొరబాబు (YCP) ప్లస్ పాయింట్స్

  • గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత యాక్టివ్ అవ్వడం
  • పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం
  • క్యాడర్‌తో నిత్యం టచ్‌లో ఉండటం
  • గత ఎన్నికల్లో టికెట్ దక్కలేదన్న సింపతి

దవులూరి దొరబాబు మైనస్‌ పాయింట్స్

  • గత ఎన్నికల్లో టీడీపీకి సహకరించారన్న ఆరోపణలు
  • కుటుంబ సభ్యులకే కీలక పదవులు కట్టబెట్టారన్న ఆరోపణలు
  • పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు
  • ప్రజల్లో ఉన్న మిక్స్‌డ్‌ టాక్
  • ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత

ఇక వచ్చే ఎన్నికల్లో పెద్దాపురం బరిలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం..

దవులూరి దొరబాబు vs నిమ్మకాయల చినరాజప్ప
YCP 41%
TDP 52%
OTHERS 7%

ఇప్పటికిప్పుడు పెద్దాపురంలో ఎన్నికలు జరిగితే టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్పకు 52 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని బిగ్ టీవీ సర్వేలో తేలింది. వైసీపీకి కేవలం 41 శాతం ఓట్లు మాత్రమే రావచ్చని తేలింది. ఇక ఇతరులకు 7 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని రిపోర్ట్ చెబుతోంది.

ముఖ్యంగా టీడీపీ, జనసేన పొత్తు ఈ నియోకవర్గంలో కీలకం కానుంది. ఈ నియోజకవర్గంలో దాదాపు సగం మంది కాపు సామాజిక వర్గ ప్రజలే ఉన్నారు. దీంతో పొత్తు కారణంగా వారంతా టీడీపీకి ఓట్లు వేసే అవకాశ ముందని సర్వే చెబుతోంది. ఇక్కడ టీడీపీ, జనసేన నేతలు కూడా ఇదే సామాజిక వర్గ నేతలే. మరోవైపు చినరాజప్పకు ఉన్న పాజిటివ్ ఇమేజ్‌ కూడా టీడీపీకి కలిసొచ్చే అంశం. దీనికి తోడు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడా టీడీపీకి బాగా కలిసి వచ్చే అంశమే అని బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ చెబుతోంది.

వైసీపీకి వచ్చే ఓట్లలో ఎక్కువ శాతం సంక్షేమ పథకాల లబ్ధిదారులే ఉన్నారని తెలుస్తోంది. అంతేగాకుండా గత ఎన్నికల్లో దవులూరికి టికెట్ దక్కలేదన్న సింపతి ఉన్న వారు కూడా వైసీపీకి ఓటు వేసే అవకాశముందని బిగ్ టీవీ సర్వే రిపోర్ట్‌ చెబుతోంది.

.

.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×