BigTV English

AP LAND Titling Act | ఏపీలో కొత్త భూ హక్కుల చట్టం.. ‘ప్రజా హక్కులను హరించే విధంగా నిబంధనలు’!

AP LAND Titling Act | కొత్త భూ యజమాన్య హక్కుల చట్టం.. ప్రజల హక్కులను హరించేలా ఉంది. అందుకే ఈ చట్టంపై పెద్ద దుమారం రేగింది. ఈ చట్టంతో ఏ వివాదం లేని భూములు, ఆస్తులు, ఇళ్లు అంటే undisputed properties కూడా disputedగా మారిపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

AP LAND Titling Act | ఏపీలో కొత్త భూ హక్కుల చట్టం.. ‘ప్రజా హక్కులను హరించే విధంగా నిబంధనలు’!

AP LAND Titling Act | ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఆగస్టు 31 2023న కొత్తగా భూ హక్కుల చట్టం అంటే AP LAND Titling Act 2023 తీసుకొచ్చింది. దీనికి సంబంధించి జీవో నెంబర్ 512 జారీ చేసిన.. గెజిట్ నోటిఫికేషన్ కూడా నవంబర్ 14 2023న విడుదల చేసింది. ఈ చట్టానికి సంబంధించి 2022లోనే ఏపీ గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం లభించింది.


ఈ కొత్త భూ యజమాన్య హక్కుల చట్టం.. ప్రజల హక్కులను హరించేలా ఉంది. అందుకే ఈ చట్టంపై పెద్ద దుమారం రేగింది. ఈ చట్టంతో ఏ వివాదం లేని భూములు, ఆస్తులు, ఇళ్లు అంటే undisputed properties కూడా disputedగా మారిపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటి? దీన్ని ప్రభుత్వం ఎలా అమలు చేయబోతోంది? అనేది ఒకసారి తెలుసుకుందాం.


భూ హక్కుల చట్టం అంటే (ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌) ప్రకారం… మూడు రకాల రిజిస్టర్లు రూపొందిస్తారు.

ఒకటి స్థిరాస్థి హక్కుల రిజిస్టర్‌. ఇందులో రాష్ట్రంలోని మొత్తం స్థిరాస్థుల శాశ్వత రికార్డులుంటాయి. మిగతా రెండులో ఒకటి భూమి కొనుగోలు అంటే క్రయ, విక్రయ రిజిస్టర్, మరొకటి భూ వివాదాల రిజిస్టర్. దీని ప్రకారమే ప్రతి గ్రామంలోని రెవెన్యూ రికార్డులను సవరిస్తారు. ఇదంతా ఒక స్పెషల్ ఆఫీసర్.. చీఫ్ టైటిల్ రిజిస్టర్ అధికారి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ స్పెషల్ ఆఫీసర్ ఒక మాజీ ఐఎయస్.. ప్రధాన కార్యదర్శ స్థాయి వ్యక్తి.

ఈ చీఫ్ టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్(TRO) కింద మండల స్థాయిలో లాండ్‌ టైటిల్ రిజిస్టర్ అధికారులను ప్రభుత్వ నియమిస్తుంది.

మండల ల్యాండ్‌ టైట్లింగ్‌ అధికారి బాధ్యతలు
భూమి హక్కులను రిజిస్టర్‌ చేసే బాధ్యత ల్యాండ్‌ టైట్లింగ్‌ అధికారికే ఉంటుంది. స్థిరాస్తి అంటే భూమి లేదా ఇల్లు గుర్తింపు సంఖ్య, స్థిరాస్తి ఉన్న ప్రాంతం, యజమాని పేరు, యజమాన్య హక్కు బదిలీలకు సంబంధించిన సమాచారం, అలాగే ఆస్తి వారసత్వ సమాచారం, భూమి లేదా ఇంటిపై ఏదైనా దావాలుంటే ఆ దావాలకు సంబంధించిన సమాచారం.. ఇలా మొత్తం వివరాలతో టైటిల్‌ రిజిస్టర్‌ని నిర్వహిస్తారు. పలు దశల్లో విచారణ చేసిన తర్వాత… టైటిలింగ్ అధికారి భూముల యజమానులను శాశ్వత హక్కుదారులుగా గుర్తిస్తారు. అతని పేరును భూహక్కుదారుడి రిజిస్టర్‌లో నమోదు చేస్తారు.

ఈ చట్టంతో మోసాలకు తావులేకుండా… యజమానులను, శాశ్వత హక్కుదారులను గుర్తించి రిజిస్ట్రర్‌లో నమోదు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇలాంటి చట్టం ఇంతవరకూ ఏ రాష్ట్రంలోనూ లేదు.

వినడానికి ఇంతవరకూ బాగానే ఉంది. అయితే ఈ చట్ట ప్రకారం.. ఏదైనా స్థిరాస్తి వివాదాలపై సివిల్ కోర్టులలో విచారణ జరగదు. ఒక ప్రత్యేక టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్.. అన్నీ తానై నిర్ణయాలు తీసుకుంటాడు. అసలు సమస్య ఇక్కడి నుంచే మొదలవుతోంది. ఏవైనా ఆస్తి తగాదాలుంటే.. కొత్త చట్టంలోని Rules ప్రకారం.. ల్యాండ్‌ టైటిలింగ్‌ అధికారి నమోదు చేసే హక్కు రిజిస్టర్‌లో.. ఒక్కసారి భూహక్కు దారుడు పేరున ఆస్తి నమోదైన తరువాత ఎవరికైనా అభ్యంతరాలుంటే..జాయింట్‌ కలెక్టరు నేతృత్వంలో ఏర్పాటయ్యే రెవెన్యూ ట్రిబ్యూనల్లోనే తేల్చుకోవలసి ఉంటుంది. అంతే తప్ప సివిల్ కోర్టుకు వెళ్లడానికి లేదు. కేవలం హై కోర్టులో మాత్రమే కేసు వేసుకోవాలి. ఈ కారణంగా ఇటీవల భూమి వివాదాలు.. ఆస్తి తగదాల కేసులపై సివిల్ కోర్టులు విచారణ జరపడానికి స్వీకరించడం లేదు. సంబంధిత టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌ల వద్దకే వెళ్లాలని సూచిస్తున్నాయి.

సామాన్యులు హైకోర్టులో పిటిషన్‌ వేసుకోవడమంటే చాలా డబ్బు ఖర్చవుతుంది. లక్షలు ఖర్చు పెట్టడమే కాకుండా చాలా ప్రయాస పడాలి, ఇది దాదాపు అసాధ్యం.

మరో సమస్య ఏమిటంటే.. ఈ కొత్త TRO లు.. ఇంతకుముందు రెవెన్యూ అధికారులు చేసిన సర్వేల ఆధారంగానే రిజిస్టర్‌లలో భూమి, యజమానుల వివరాలను పొందుపరుస్తున్నారు. అయితే ఈ రెవిన్యూ అధికారులు చేసిన తప్పుల వలనే ఇంతవరకు సివిల్ కోర్టుల్లో ఎక్కువ శాతం కేసులు నడుస్తున్నాయి. పైగా రెవెన్యూ అధికారులనే దాదాపు కింది స్థాయి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లుగా ఉంటారు.

చిన్న, సన్నకారు రైతులు రెవిన్యూ అధికారుల తప్పుల వలనే వారి భూహక్కులను కోల్పోతూ కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు, అయితే మళ్లీ ఆ అధికారులకే శాశ్వత నిర్ణయాలు తీసుకునే అధికారం ఈ చట్టం కల్పిస్తోంది. ఇది చాలా అనాలోచిత విధానమని, అన్యాయంగా ఉందని న్యాయ నిపుణలు చెబుతున్నారు.

దళిత, గిరిజన భూములు, చిన్న, సన్నకారు రైతుల భూములను అక్రమదారులు కబ్జా చేయడానికి ఈ భూహక్కుల చట్టం అవకాశమిస్తోందని అభిప్రాయపడుతున్నారు. ఈ చట్టం అమల్లోకి రావడం వలన ఇప్పటి వరకు భూములకు ఉన్న 30 రకాల రికార్డులు (ఉదాహరణకు పట్టాదారు పాస్‌ బుక్‌, టైటిల్‌ డీడ్‌, అడంగళ్‌, 1బి లాంటివి) క్రమంగా రద్దు కానున్నాయి.

ఈ చట్టం వలన పేద రైతులు తమకు ఉండే కొద్దిపాటి భూముల విషయంలో వారి హక్కును నిర్దారించుకోవడానికి అవకాశం లేక శాశ్వతంగా భూమిని కోల్పోయి అవకాశం ఉంది. వారి భూములు.. పెద్ద పెద్ద భూస్వాముల చేతుల్లోకి వెళ్లిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతవరకూ ఒక ఇల్లు, లేక కొద్దిపాటి భూమి ఉన్న యజమానికి వ్యతిరేకంగా ఎవరైనా ఫిర్యాదు చేసి.. అతని భూమిపై దావా సంబంధిత అధికారి వద్ద దావా వేస్తే.. ఆ యజమాని స్వయంగా ఆ భూమి తనదేనని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అంతవరకూ ఆ భూమి వివాదాస్పద భూమిగా అంటే DISPUTED LAND OR DISPUTED PROPERTY కేటగిరీలో వెళ్లిపోతుంది. ఆ తరువాత వెంటనే అది క్లియర్ కాదు. అన్ని ఆధారులున్నా.. నిర్ధారణ పేరుతో అధికారులు పెండింగ్‌లో పెట్టేస్తారు.. నిబంధనల ప్రకారం దాదాపు రెండేళ్ల తరువాతే అది క్లియర్ అవుతుంది.

ఈ చట్టం రావడంతో జిల్లా కోర్టుల్లో సివిల్‌ కేసులు దాఖలు చేయడానికి వీలుండదు. వీటి స్థానంలో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక్కో ట్రిబ్యూనల్‌ చొప్పున 26 ట్రిబ్యునల్‌లలో కేసులను త్వరితగతిన పరిష్కస్తామని ప్రభుత్వం చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఏపీలోని 563 కోర్టుల్లో చేయలేని పని.. కేవలం 26 ట్రిబ్యూనల్స్‌ ఎలా పరిష్కరిస్తాయో అర్థం కావడం లేదు. ఈ కొత్త చట్టం ప్రకారం మనకు అందుబాటులో ఉన్న కోర్టులో కేసు వేయడానికి వీలులేదని నిబంధన ఉండటం రాజ్యాంగ వ్యతిరేకం కూడా.

కబ్జాలకు పాల్పడే బడా వ్యక్తులకు, కార్పొరేట్లకు భూములు ధారాదత్తం చేసేట్లు ఈ చట్టం అవకాశాలు కల్పిస్తోంది. పైగా ప్రభుత్వం చెబుతున్న అప్పిలేట్ అథారిటి ఏ ప్రతిపాదికన నియామకం జరుగుతుందో చట్టంలో స్పష్టంగా నిర్వచించకపోవటం అనుమానాలకు తావిస్తోంది.

ఇప్పటికే ఈ అంశం మీద న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు నిరసనలు చేశారు. ఈ కొత్త భూ హక్కుల చట్టాన్ని సవాల్ చేస్తూ ఇటీవల హైకోర్టులో ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌, ఏపీ స్టేట్ బార్‌ కౌన్సిల్‌ Public Interest Litigations అంటే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశాయి. ఈ పిటీషన్లపై విచారణ హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సమయంలో పిటీషనర్లు వాదిస్తూ.. కొత్త చట్టం అమల్లోకి రావడంతో స్థిరాస్తి వివాదాలపై దాఖలయ్యే దావాలను సివిల్‌ కోర్టులు విచారణ చేపట్టడం లేదని హైకోర్టుకు తెలిపారు. అయితే దీనిపై ప్రభుత్వ తరపు న్యాయవాది స్పందిస్తూ.. ఈ చట్టం పూర్తి స్థాయిలో అమలు చేయలేదని తెలిపారు. టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్ (టీఆర్‌వో), ల్యాండ్‌ టైట్‌లింగ్‌ అప్పిలెట్‌ అధికారులను (ఎల్‌టీఏవో) కూడా నియమించలేదని చెప్పారు.

ఇరు పక్షాల వాదనలను విన్న హైకోర్టు బెంబ్ ఈ కేసుని వాయిదా వేస్తూ.. తీర్పు చెప్పేంత వరకూ జిల్లా కోర్టులు యథావిధిగా సివిల్ కేసుల విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీచేసింది.

అయితే మన దేశంలో misuse of power అంటే అధికార దుర్వినియోగం జరగకుండా రాజ్యాంగంలో ఒక provision ఉంది. అదే division of power లేదా separation of power.

ఈ నిబంధన ప్రకారమే అధికారాన్నిమూడు శాఖలుగా విభజించారు. అవే Legislation, Executive, Judiciaryగా అంటే శాసనం, పరిపాలన, న్యాయ వ్యవస్థ.

ప్రజాస్వామ్యంలో శాసనం అంటే ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రభుత్వం. ప్రజల మేలు కోసం ప్రభుత్వానికి కొత్త చట్టాలు తీసుకువచ్చే బాధ్యత ఉంది. పరిపాలన అంటే ఆ చట్టాలను అమలు పరిచే యంత్రాంగం. ఉదాహరణకు MRO, Collectorate, Police వ్యవస్థ. న్యాయ వ్యవస్థ అంటే కోర్టులు. చట్టాలు ఎవరైనా అతిక్రమిస్తే శిక్షిస్తాయి, లేదా చట్టాలు ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉంటే వాటిని న్యాయపరంగా విచారణ చేస్తాయి.

భారత రాజ్యాంగంలో ఈ division of power ఉద్దేశం.. checks and balances ని క్రియేట్ చేయడం. ఇందులో ఏదైనా ఒక శాఖ తన పరిమితిని అతిక్రమిస్తే.. దానిని మరో శాఖ సరిచేస్తుంది.

ఇప్పుడు ఈ కొత్త చట్టం వలన న్యాయశాఖ అధికారాలను తగ్గించేసి.. పరిపాలన అంటే executive శాఖకు ఆ అధికారాలను పెంచుతోంది ప్రభుత్వం. ఇది రాజ్యాంగ విరుద్ధం. పైగా దీని వలన అధికార దుర్వినియోగం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెబుతున్నట్లు వారి ఉద్దేశం మంచిదే అయినా.. ground realityలో దాని అమలు వలన నష్టాలు ఎక్కువగా కనిపిసుత్నాయి.

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×