E-Paper
Advertisement

Kriti Sanon : ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటాను: కృతి సనన్

Kriti Sanon : ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటాను: కృతి సనన్
Advertisement

Kriti Sanon : బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. నాలుగు పదుల వయసు అయినప్పటికీ ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. ప్రభాస్ – అనుష్క మధ్య లవ్ ట్రాక్ ఉందనే వార్తలు చాలానే వినిపించాయి. కానీ వారిద్దరు మాత్రం తమ మధ్య ప్రేమ ఉందని ఎక్కడా చెప్పలేదు. ఇద్దరం మంచి స్నేహితులం అని చెపుకున్నారు. కానీ ఇప్పుడు ప్రభాస్‌, కృతి సనన్ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి దానికి తగ్గట్లు ఆది పురుష్ టీజర్ రిలీజ్ సమయంలో ప్రభాస్, కృతి సనన్ మధ్య నడిచిన ట్రాక్ నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఈ క్రమంలో ప్రభాస్‌ను కృతి ససన్ పెళ్లి చేసుకుంటానని చెప్పినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అసలు ఇంతకీ ఏం జరిగిందంటే.. వరుణ్ ధావన్‌తో కృతి సనన్ కలిసి నటించిన తోడేలు చిత్రం రీసెంట్‌గా విడుదలైంది. దానికి సంబంధించిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో కృతి సనన్‌కి ముగ్గురు హీరోల పేర్లు ఇచ్చారు. కార్తీక్ ఆర్యన్, టైగర్ ష్రాఫ్, ప్రభాస్‌లలో ఎవరిని ఫ్లర్ట్ చేస్తావు, ఎవరితో డేటింగ్‌కి వెళతావు, ఎవరిని పెళ్లి చేసుకుంటావని ప్రశ్నించారు. కార్తీక్ ఆర్యన్‌ని ఫ్లర్ట్ చేస్తానని, టైగర్ ష్రాఫ్‌తో డేటింగ్ చేస్తానని, ప్రభాస్‌ని అయితే పెళ్లి చేసుకుంటానని కృతి సనన్ సమాధానం చెప్పింది. ప్రభాస్‌ని పెళ్లి చేసుకుంటానని ఈ బాలీవుడ్ బ్యూటీ చెప్పిన ఆన్సర్ చక్కర్లు కొడుతుంది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×