BigTV English
Advertisement

Neymar Lock.. Richarlison shock.. : నెయ్‌మార్‌ లాక్.. రిచర్లిసన్ షాక్..

Neymar Lock.. Richarlison shock.. : నెయ్‌మార్‌ లాక్.. రిచర్లిసన్ షాక్..

Neymar Lock.. Richarlison shock.. : ఫిఫా వరల్డ్‌కప్‌లో హాట్ ఫేవరెట్ బ్రెజిల్… తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టింది. స్టార్ ఆటగాడు నెయ్‌మార్‌ను సెర్బియా కట్టడి చేయడం, గాయం కారణంగా అతను మైదానాన్ని వీడటంతో… బ్రెజిల్ గెలుస్తుందో లేదోనని ఫ్యాన్స్ ఆందోళన చెందారు. కానీ కొత్త హీరో రిచర్లిసన్… సెర్బియాకు షాకిచ్చి, బ్రెజిల్ అభిమానుల్లో జోష్ తీసుకొచ్చాడు.


గ్రూప్‌-Gలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో సెర్బియాపై 2-0 గోల్స్ తేడాతో బ్రెజిల్ ఘన విజయం సాధించింది. స్టార్ ఆటగాడు నెయ్‌మార్‌ను కట్టడి చేయడం మీదే ఎక్కువగా దృష్టి సారించిన సెర్బియా… వ్యూహానికి తగ్గట్టే అతణ్ని లాక్ చేసింది. ఆ తర్వాత చీలమండ గాయం కారణంగా నెయ్‌మార్‌ మైదానాన్ని వీడటంతో… మ్యాచ్ మీద పట్టుచిక్కినట్టేనని సెర్బియా ఆనందపడింది. కానీ… యువ ఆటగాడు రిచర్లిసన్‌ రెండు మెరుపు గోల్స్‌తో సెర్బియాకు షాకిచ్చాడు. 63వ నిమిషం, 72వ నిమిషంలో కళ్లు చెదిరే రెండు ఫీల్డ్‌ గోల్స్‌తో బ్రెజిల్‌ను గెలిపించాడు.

బ్రెజిల్ ఆటగాడు విన్సియన్ కొట్టిన బంతిని సెర్పియా గోల్‌కీపర్‌ అడ్డుకున్నా… నెట్‌కు దగ్గరగా కాచుకుని ఉన్న రిచర్లిసన్‌… రీబౌండ్‌ అయిన బంతిని గోల్‌ పోస్టులోకి పంపి… జట్టుకు తొలి గోల్ అందించాడు. ఆ తర్వాత 9 నిమిషాలకు… విన్సియన్ అందించిన బంతిని ఒడుపుగా పైకి లేపిన రిచర్లిసన్‌.. ఎడమవైపు పల్టీ కొడుతూ ఎదురుగా ఉన్న డిఫెండర్‌ను తప్పించి బంతిని గోల్‌లోకి పంపాడు. సెర్బియా గోల్‌కీపర్‌ ఆపేందుకు ప్రయత్నించినా… బంతి అతనికి చిక్కకుండా మెరుపువేగంతో గోల్ పోస్టులోకి దూసుకెళ్లింది. గాల్లో పల్టీ కొడుతూ రిచర్లిసన్ కొట్టిన ఈ గోల్‌ మ్యాచ్‌కే కాదు… ఈ ప్రపంచకప్‌కే హైలైట్‌ అని చెప్పొచ్చు. బ్రెజిల్ ఆటగాళ్లు మరో మూడు గోల్స్ చేయడానికి ప్రయత్నించినా… సెర్బియా డిఫెండర్లు, గోల్‌కీపర్‌ మిలింకోవిచ్‌ శక్తికి మించి ఆడి ప్రత్యర్థి దాడులను అడ్డుకున్నారు. మరోవైపు సెర్బియా చేసిన గోల్స్ ప్రయత్నాలను కూడా బ్రెజిల్ సమర్థంగా తిప్పికొట్టడంతో… ఆ జట్టు ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. చివరికి సెర్బియాపై 2-0 గోల్స్ తేడాతో గెలిచింది.. బ్రెజిల్.


Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×