E-Paper
Advertisement

Kushboo : అతను నన్ను లైంగికంగా వేధించాడు.. ఖుష్భూ సంచలన కామెంట్స్..

Kushboo : అతను నన్ను లైంగికంగా వేధించాడు.. ఖుష్భూ సంచలన కామెంట్స్..
Advertisement

Kushboo : ఖుష్బూ కోలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి. ముక్కుసూటిగా మాట్లాడేతత్వం ఆమెది. గతంలో తనపై ట్రోలింగ్ చేసేవారికి దిమ్మ తిరిగే కౌంటర్లు ఇచ్చారు. దక్షిణాదిలో కథానాయుకగా ఒక వెలుగు వెలిగిన ఖుష్భూ నటిగా రెండో ఇన్నింగ్స్ లోనూ ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజకీయాలపై ఆసక్తితో బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఇటీవల జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలుగా నియమితులయ్యారు.

తాజాగా ఖుష్భూ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టిస్తున్నాయి. తనకు 8 ఏళ్ల వయస్సులో ఎదురైన చేదు అనుభవాలను బయటపెట్టారు. తాను ఆ వయస్సులోనే లైంగిక వేధింపులకు గురయ్యాయని వెల్లడించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి ఎవరో కాదని తన తండ్రేనని గతాన్ని గుర్తు చేసుకున్నారు. తనను గాయపరిచి, చిత్రహింసలకు గురిచేసేవాడని పాతగాయాల గురించి వివరించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఖుష్భూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Advertisement

ఎవరైనా సరే చిన్నతనంలో వేధింపులకు గురైతే ఆ ఘటనలు జీవితాంతం భయానికి గురి చేస్తాయని ఖుష్భూ వ్యాఖ్యానించారు. భార్యాపిల్లల్ని చిత్రహింసలు పెట్టడం, కన్న కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడటాన్ని హక్కుగా భావించే వ్యక్తి వల్ల తన తల్లి వైవాహిక బంధంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్న విషయాన్ని చెబితే అమ్మ నమ్ముతుందో లేదోనని ఎంతో భయపడ్డానని ఖుష్భూ అన్నారు. ఎందుకంటే తన భర్త దేవుడని నమ్మే మనస్తత్వం తన తల్లిదని చెప్పుకొచ్చారు. 15 ఏళ్ల వయసులో తండ్రికి ఎదురుతిరగానని ఆ తర్వాత ఆయన మమ్మల్ని వదిలివెళ్లిపోయాడని నాటి చేదుజ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

హీరోయిన్‌గా కెరీర్‌ పీక్‌ లో ఉండగానే దర్శకుడు సుందర్‌ను ఖుష్బూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు అవంతిక, ఆనందిక అనే ఇద్దరు కూమార్తెలు ఉన్నారు. గతంలో ఖుష్భూ ఫ్యామిలీ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే.. దానిపై కొందరు విపరీత ధోరణిలో కామెంట్లు పెట్టారు. ఆమె కుమార్తెల బరువు,శరీరాకృతిపై కామెంట్స్‌ చేశారు. అప్పుడు కూడా నెగిటివ్ కామెంట్లు పెట్టిన వారికి ఖుష్బు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఎలాంటి విషయంపైనైనా నిర్భయంగా మాట్లాడే కుష్భూ ఇప్పుడు తండ్రిపై చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×